AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pakistan: దేశం సంక్షోభంతో అల్లాడుతుంటే మీరు విదేశీ టూర్లు వేస్తారా.. ఇమ్రాన్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు

పాకిస్థాన్ మాజీ ప్రధాన మంత్రి ఇమ్రాన్‌ఖాన్, ప్రస్తుత ప్రధాని షెహబాజ్ షరీఫ్, విదేశాంగ మంత్రి బిలావల్ బుట్టో జార్దరీపై విరుచుకుపడ్డారు. దేశం సంక్షోభంలో ఉండగా విదేశీ పర్యటనలు చేయడం ఏంటంటూ వాళ్లిద్దరిని విమర్శించారు. లాహోర్‌లో చేపట్టిన ర్యాలీలో ఇమ్రాన్ ఖాన్ ఈ వ్యాఖ్యలు చేశారు.

Pakistan: దేశం సంక్షోభంతో అల్లాడుతుంటే మీరు విదేశీ టూర్లు వేస్తారా.. ఇమ్రాన్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు
Imran Khan
Aravind B
|

Updated on: May 08, 2023 | 10:21 AM

Share

పాకిస్థాన్ మాజీ ప్రధాన మంత్రి ఇమ్రాన్‌ఖాన్, ప్రస్తుత ప్రధాని షెహబాజ్ షరీఫ్, విదేశాంగ మంత్రి బిలావల్ బుట్టో జార్దరీపై విరుచుకుపడ్డారు. దేశం సంక్షోభంలో ఉండగా విదేశీ పర్యటనలు చేయడం ఏంటంటూ వాళ్లిద్దరిని విమర్శించారు. లాహోర్‌లో చేపట్టిన ర్యాలీలో ఇమ్రాన్ ఖాన్ ఈ వ్యాఖ్యలు చేశారు. సుప్రీంకోర్టు, రాజ్యాంగం, పాకిస్థాన్ చీఫ్ జస్టీస్ ఉమార్ అటా బండిలాల్ కు సంఘీబావం తెలిపేందుకు ఆయన ఈ ర్యాలీ నిర్వహించారు. ప్రపంచంలో పాకిస్తాన్ అవమానాలకు గురవుతోందని ఆరోపించారు. ప్రపంచవ్యాప్తంగా తిరుగుతున్న బహిలావల్ బుట్టో.. తన పర్యటనలపై దేశ సొమ్మును ఖర్చు చేస్తున్నానని.. దీనివల్ల ఏదైనా లాభం లేదా నష్టం ఉంటుందా అని ఎవరినైనా అడిగారా అంటూ ప్రశ్నించారు.

అయితే తాజాగా యూకేలో కింగ్ చార్లెస్ 3 కి జరిగిన పట్టాభిషేకం మహోత్సవంలో అక్కడికి పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్ వెళ్లారు. మరోవైపు బిలావల్ బుట్టో భారత్‌‌లోని గోవాలో జరిగిన షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజన్‌(SEO) సమావేశంలో పాల్గొనేందుకు గురువారం వచ్చారు. అయితే ఈ ఎసీవో విదేశాంగ మంత్రుల మండలి సమావేశంలో బిలావల్‌ మాట్లాడుతూ తమ దేశం కూడా ఉగ్రవాదానికి బలైందని పేర్కొన్నారు. వ్యక్తిగతంగా తానూ బాధితుడినేని.. తన తల్లి బేనజీర్‌ భుట్టో కూడా ఉగ్రవాదుల చేతుల్లో హతమయ్యారని తెలిపారు. ఉగ్రవాదాన్ని దౌత్య సంబంధాల్లో ఆయుధంగా వినియోగించకూడదంటూ పరోక్షంగా భారత్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. అలాగే భారత విదేశాంగ మంత్రి జైశంకర్ కూడా పాకిస్థాన్‌ను పరోక్షంగా విమర్శించారు. తీవ్రవాదాన్ని ఎట్టిపరిస్థితుల్లో సమర్థించకూడదని తాము బలంగా విశ్వసిస్తున్నామని.. సీమాంతర ఉగ్రవాదంతో సహా అన్ని రూపాల్లో ఉన్న ఉగ్రవాదాన్ని ఆపాలని పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం..

Follow Us
ఆస్ట్రేలియాలో కాబట్టే మూసుకున్నారు.. అదే భారత్‌లో జరిగితే
ఆస్ట్రేలియాలో కాబట్టే మూసుకున్నారు.. అదే భారత్‌లో జరిగితే
తెలంగాణ వేదికగా ఖేలో ఇండియా గేమ్స్.. పోటీలు నిర్వహించే నగరాలు ఇవే
తెలంగాణ వేదికగా ఖేలో ఇండియా గేమ్స్.. పోటీలు నిర్వహించే నగరాలు ఇవే
ఓటీటీలో సూపర్ హిట్ మలయాళం క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ చూడొచ్చు
ఓటీటీలో సూపర్ హిట్ మలయాళం క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ చూడొచ్చు
ట్రంప్‌ వర్సెస్‌ ఓటు.. అమెరికా ఎన్నికల్లో అసలు ఫైట్‌ ఇదే..
ట్రంప్‌ వర్సెస్‌ ఓటు.. అమెరికా ఎన్నికల్లో అసలు ఫైట్‌ ఇదే..
54 బంతుల్లో మ్యాచ్ క్లోజ్.. 2 బంతుల్లోనే ఛేజింగ్..
54 బంతుల్లో మ్యాచ్ క్లోజ్.. 2 బంతుల్లోనే ఛేజింగ్..
భారత రైల్వే నె‌ట్‌వర్క్ అభివృద్ధిపై కేంద్రం ఫోకస్..
భారత రైల్వే నె‌ట్‌వర్క్ అభివృద్ధిపై కేంద్రం ఫోకస్..
దేశంలో ఉద్యోగ కల్పన, నిరుద్యోగంపై ఫ్యాక్ట్ చెక్‌లో కీలక విషయాలు
దేశంలో ఉద్యోగ కల్పన, నిరుద్యోగంపై ఫ్యాక్ట్ చెక్‌లో కీలక విషయాలు
చికెన్ తిన్న తర్వాత పొరపాటున కూడా ఈ ఆహారాలు ముట్టొద్దు..
చికెన్ తిన్న తర్వాత పొరపాటున కూడా ఈ ఆహారాలు ముట్టొద్దు..
మిగిలింది ఇంకా రెండే నెలలు..60 ఏళ్ల క్రితమే రాసిపెట్టిన మరణ శాసనం
మిగిలింది ఇంకా రెండే నెలలు..60 ఏళ్ల క్రితమే రాసిపెట్టిన మరణ శాసనం
పీఎఫ్ అకౌంట్ ఉందా..? ఈ ఒక్క పని చేస్తే భారీగా నష్టపోతారు
పీఎఫ్ అకౌంట్ ఉందా..? ఈ ఒక్క పని చేస్తే భారీగా నష్టపోతారు