Karnataka Elections 2023: కర్ణాటకలో చక్రం తిప్పేది మనోళ్లే.. ఆ 12 జిల్లాల్లో కీలకం కానున్న తెలుగు ఓటర్లు..

కన్నడ నాట పొలిటికల్ పోరు చివరి అంకానికి చేరుకుంటోంది. ఇప్పటి కర్నాటకలో ఒక సారి అధికారంలో ఉన్న పార్టీ మళ్లీ అధికారం చేపట్టే ఛాన్స్ లేదన్న సెంటిమెంట్‌ను ఎలాగైనా బ్రేక్ చెయ్యాలని డిసైడైన బీజీపీ అందుకు ఎన్ని ప్రయత్నాలు చెయ్యాలో అన్నీ చేస్తోంది. చివరిగా ప్రధాని నరేంద్ర మోదీ కూడా నేరుగా రంగంలోకి దిగి శనివారం భారీ ర్యాలీ, ప్రచార సభ నిర్వహించారు.

Karnataka Elections 2023: కర్ణాటకలో చక్రం తిప్పేది మనోళ్లే.. ఆ 12 జిల్లాల్లో కీలకం కానున్న తెలుగు ఓటర్లు..
Karnataka Elections
Follow us
Shaik Madar Saheb

|

Updated on: May 07, 2023 | 1:25 PM

కన్నడ నాట పొలిటికల్ పోరు చివరి అంకానికి చేరుకుంటోంది. ఇప్పటి కర్నాటకలో ఒక సారి అధికారంలో ఉన్న పార్టీ మళ్లీ అధికారం చేపట్టే ఛాన్స్ లేదన్న సెంటిమెంట్‌ను ఎలాగైనా బ్రేక్ చెయ్యాలని డిసైడైన బీజీపీ అందుకు ఎన్ని ప్రయత్నాలు చెయ్యాలో అన్నీ చేస్తోంది. చివరిగా ప్రధాని నరేంద్ర మోదీ కూడా నేరుగా రంగంలోకి దిగి శనివారం భారీ ర్యాలీ, ప్రచార సభ నిర్వహించారు. మోదీ ర్యాలీకి దారి పొడుగునా వచ్చిన జనం చూసిన బీజేపీకి కొండంత బలం వచ్చిందనడంలో ఎలాంటి ఆశ్చర్యం లేదు. పోలింగ్‌కు ఇంకా మరో మూడు రోజులే సమయం ఉంది. ఎన్నికల సంఘం నియమాల ప్రకారం మరి కొద్ది గంటల్లో ప్రచారం ముగిసి తీరాలి కూడా. ఈ నేపథ్యంలో వచ్చిన ఏ అవకాశాన్ని విడిచి పెట్టకుండా ప్రధాన పార్టీలు ప్రచారం చేస్తున్నాయి. గెలుపు విషయంలో ఎవరి ధీమా వాళ్లదే. అయితే కొద్ది రోజులుగా వస్తున్న సర్వేలు కాంగ్రెస్‌కు అనుకూలంగా వస్తుండటం… గడిచిన 40 ఏళ్లుగా ఒక సారి అధికారంలో ఉన్న పార్టీ మళ్లీ అధికారంలోకి రాకపోవడం వంటి సెంటిమెంట్లు.. కాంగ్రెస్‌కు కాస్త బలాన్నిస్తున్నాయి. అదే సమయంలో ఎలాగైనా కింగ్ మేకరై కర్నాటకలో మరోసారి చక్రం తిప్పాలని జేడీఎస్ ఉవ్విళూరుతోంది. ఈ నేపథ్యంలో కర్నాటకలో తెలుగు వారి ప్రభావం ఎలా ఉండబోతోందో ఇప్పుడోసారి చూద్దాం.

ఒకటి కాదు .. రెండు కాదు.. 12 జిల్లాల్లో చక్రం తిప్పే స్థాయి అక్కడ తెలుగు ప్రజలది. కర్నాటకలో 15 శాతం జనాభా తెలుగు వాళ్లే. వాళ్లు కాదంటే ఏ పార్టీకైనా చుక్కలు కనిపించడం ఖాయం. సుమారు 40 అసెంబ్లీ స్థానాల్లో తెలుగు ఓటర్లు భారీ సంఖ్యలో ఉన్నారు. బళ్లారి, కోలార్, బెంగళూరు రూరల్, బెంగళూరు అర్బన్, రాయ్‌చూర్, కొప్పల, తుమకూరు, చిత్రదుర్గ, చిక్కబల్లాపురా, యాదగిరి, బీదర్, కాలబురగి జిల్లాల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచి వలస వచ్చిన తెలుగు ఓటర్లు ఎక్కువ. కొన్ని నియోజకవర్గాల్లో స్థానిక ఓటర్ల సంఖ్యకు మించి వీరి ఓటర్ల సంఖ్య ఉంది. కోలార్ జిల్లాల్లో ఎక్కువ శాతం ఓటర్లు తెలుగు ప్రజలే. వీరు ఆ జిల్లాలోని 6 నియోజకవర్గాలను బలంగా ప్రభావితం చేసే అవకాశం ఉంది. అలాగే బెంగళూరు రూరల్‌, బెంగళూరు అర్బన్‌ పరిధిలోనూ తెలుగు ఓట్లర్లు భారీ సంఖ్యలో ఉన్నారు. వీరు 25 నియోజకవర్గాల్లో ఎన్నికల్లో ప్రభావితం చేయగలరని చేసే అవకాశం ఉంది. తెలుగు రాష్ట్రాల సరిహద్దుల్లో ఉన్న రాయ్‌చూర్, బళ్లారి జిల్లా, చిక్కబల్లాపుర్ జిల్లాల్లో తెలుగు ఓటర్లు గెలుపు, ఓటమిలో కీలకపాత్ర పోహించనున్నారు. మిగిలిన చోట్ల లింగాయత్‌, ఒక్కలిగ, ఎస్సీ/ఎస్టీలు, పార్టీల ప్రణాళికలు, ప్రాంతాల అభివృద్ధి, ప్రస్తుత పాలన వంటి అంశాలు ఎన్నికల్లో ఫలితాలను నిర్ణయిస్తుంటాయి. కానీ ఈ 12 జిల్లాల్లో మాత్రం తెలుగు వారిదే హవా. వాళ్లెవరికి ఓటేస్తే.. ఆ పార్టీకి గెలుపు దాదాపు ఖాయం.

ఎన్నికలు పోటాపోటీగా సాగే ప్రతిసారీ గెలుపోటములను వెయ్యి నుంచి ఐదు వేల ఓట్లు శాసిస్తుంటాయి. కర్ణాటకలోని మొత్తం 224 నియోజకవర్గాల్లో దాదాపుగా ప్రతిసారీ కనీసం 17 శాతం సీట్లయినా ఇలాంటి స్వల్ప తేడాలతోనే ఉంటున్నాయి. 2008లో 30 స్థానాల్లో ఐదు వేల కంటే తక్కువ, 34 స్థానాల్లో వెయ్యి ఓట్ల కంటే తక్కువ తేడాతో అభ్యర్థులు గెలిచారు. 2013లో 49 స్థానాల్లో, 2018లో 52 స్థానాల్లో ఐదు వేలు అంతకంటే తక్కువ ఓట్ల మెజారిటీతో అభ్యర్థులు విజయం సాధించారు. ఇలాంటి సందర్భాల్లో తెలుగు ఓటర్ల పాత్ర కీలకం కాబోతోంది. ఈసారి ఎన్నికల్లోనూ తక్కువ ఓట్ల ఆధిక్యం నమోదయ్యే స్థానాల సంఖ్య 50కిపైగా ఉండబోతోందని సర్వేలు చెబుతున్నాయి. అందుకే అభ్యర్థులు తెలుగు ఓటర్లను ఆకట్టుకోవటానికి అన్ని పార్టీలు ప్రయత్నిస్తున్నాయి.

ఇవి కూడా చదవండి

అందుకే తెలుగు వారు ఎక్కువ ఉండే ప్రాంతాలకు తెలుగు నాయకుల్ని, తెలుగు సినీ తారల్ని ప్రచారంలో వాడుతున్నాయి పార్టీలు. ఇప్పటికే బండి సంజయ్, రేవంత్ రెడ్డి, బ్రహ్మానందం సహా మరి కొంత మంది ప్రముఖులు సరిహద్దు జిల్లాలలో ముమ్మరంగా ప్రచారం నిర్వహించారు. పదేళ్లుగా కర్ణాటకలోని తెలుగు ఓటర్లలో చైతన్యం పెరిగింది. కర్ణాటక కేబినేట్‌లోనూ తెలుగు నేతలకు ప్రాధాన్యమివ్వటంతో స్థానిక ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఉత్సాహం చూపుతున్నారు. కన్నడ రాజకీయాల్లో తెలుగువాళ్ల భాగస్వామ్యం పెరుగుతోంది. ఐటీ ఉద్యోగులు, వ్యాపార, విద్యా రంగాలకు చెందిన సంఘాలు ఎన్నికల్లో ఓటు వేయాలని తమతమ సభ్యులను జాగృతం చేస్తున్నాయి. తుమకూరు, చిత్రదుర్గ, యాదగిరి, బీదర్‌, కలబురగి జిల్లాల్లో సగటున ఒక్కో నియోజకవర్గంలో 20% మంది తెలుగువారున్నారు. ప్రాంతాలవారీగా చూస్తే కల్యాణ కర్ణాటకలోని 40 నియోజక వర్గాల్లో తెలుగు ఓటర్లు సగటున 45 శాతం దాకా ఉంటారని అంచనా. ఈ నేపథ్యంలో అక్కడ తెలుగు వారి డిమాండ్లేంటి… కొద్ది రోజులుగా తెలుగు భాష పట్ల, సంస్కృతి పట్ల కన్నడ నాయకులు చిన్న చూపు చూస్తున్నారన్న అపవాదు ఉంది. ఈ విషయంలో తెలుగు వారి అభిప్రాయమేంటి..? ఈ సారి ఎన్నికల్లో నేతలకు తామేంటో తెలుగు వారు చూపించాలనుకుంటున్నారా..? ఈ వివరాలను కొద్ది రోజులుగా కన్నడ నాట పర్యటించి టీవీ9 ప్రతినిధి రాకేశ్ కీలక వివరాలను సేకరించారు.

సో.. అది సంగతి.. ఈ సారి కర్నాటకలో ఎవరు కింగో డిసైడ్ చెయ్యడంలో తెలుగు వారిది కీ రోల్ అన్న విషయంలో ఎలాంటి డౌట్స్ అవసరం లేదు. విశేషమేంటంటే.. ఈ ఎన్నికల ఫలితాలు ఇటు తెలుగు రాష్ట్రాల ఎన్నికలపై కూడా ప్రభావం చూపనున్నాయి. కర్నాటకలో మరోసారి బీజేపీ విజయం సాధిస్తే.. 40 ఏళ్లుగా కొనసాగుతూ వస్తున్న సెంటిమెంట్‌ను బీజేపీ బద్దలు కొట్టినట్టవుతుంది . ఆ జోష్‌ రాబోయే తెలంగాణ ఎన్నికల్లో కూడా బీజేపీకి బూస్ట్ ఇస్తుందనడంలో ఎలాంటి డౌట్ ఉండదు. బీఆర్ఎస్ పేరుతో కర్నాటకలో జేడీఎస్‌కి మద్దతిస్తున్న కేసీఆర్ టీంకి కూడా ఈ ఎన్నికల రిజల్ట్స్ లిట్మస్ టెస్ట్ లాంటివే. ఒక వేళ సరిహద్దు నియోజకవర్గాలలో బీఆర్ఎస్ ప్రభావం చూపిస్తే.. కచ్చితంగా జేడీఎస్ కింగ్ మేకరయ్యే ఛాన్సుంటుంది. అదే జరిగితే బీఆర్ఎస్ జోరు మరింత పెరుగుతుంది. ఇక సర్వేలు చెబుతున్నట్టు ఒక వేళ కాంగ్రెస్ అధికారంలోకొస్తే.. తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ పార్టీకే కాదు.. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి కూడా కచ్చితంగా ఉత్సాహాన్నిస్తుంది. అటు ఏపీలో కూడా కర్నాటక ఎన్నికలపై తెగ చర్చ జరుగుతోంది. కర్నాటకలో అసెంబ్లీలోని 224 స్థానాలకు ఒకే విడతలో మే 10న పోలింగ్ నిర్వహించనున్నారు. మే 13న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. ప్రస్తుతం కర్నాటక అసెంబ్లీలో బీజేపీకి 119 మంది సభ్యులుండగా.. కాంగ్రెస్ పార్టీ నుంచి 75 మంది ఎమ్మెల్యేలు, జేడీఎస్ నుంచి 28 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు.

– రవికుమార్ పాణంగిపల్లి, టీవీ9 తెలుగు (డిజిటల్)

మరిన్ని జాతీయ వార్తల కోసం..

బలపడిన అల్పపీడనం.. వచ్చే 3రోజులు వానలే వానలు! పిడుగులు పడే ఛాన్స్
బలపడిన అల్పపీడనం.. వచ్చే 3రోజులు వానలే వానలు! పిడుగులు పడే ఛాన్స్
Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే