ఉరుకులు పరుగుల జీవితంలో చాలామంది లైంగిక సమస్యలతో సతమతమవుతున్నారు. దైనందిన జీవితంలో దంపతుల మధ్య ఈ సమస్య పెరుగుతూ వస్తోంది. లైంగిక సమస్యలతో బాధపడే వారు జీవనశైలిలో మార్పులతోపాటు.. శక్తి కోసం మంచి ఆహారాన్ని తీసుకోవడం అవసరం. ముఖ్యంగా ఆహారంలో కొన్ని ప్రాథమిక పోషకాలను చేర్చుకోవాలని మానసిక, సెక్సాలజీ నిపుణులు సూచిస్తున్నారు. ఇంకా ఇద్దరి మధ్య అన్యోన్యత కూడా ముఖ్యమైన విషయమని పేర్కొంటున్నారు. ముఖ్యంగా లైంగిక సమస్యలు, శ్రీఘ్రస్కలనం, నపుసంకత్వం లాంటి వాటని ఆహారంతో చెక్ పెట్టవచ్చంటున్నారు. అయితే, సత్తువ (స్టామినా) ను పెంచుకోవడానికి తినాల్సిన ఆహారాలు ఏంటీ..? ఎలా తినాలి.. లైంగిక సమస్యలను ఎలా దూరం చేస్తాయి.. అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..