Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: వామ్మో.. ఇంట్లో అకస్మాత్తుగా ప్రత్యేక్షమైన భారీ శ్వేతనాగు.. గూస్ బంప్స్ తెప్పించే వీడియో..

మనం ఇప్పటి వరకూ ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైన ప్రమాదకరమైన కింగ్‌ కోబ్రాను చూశాం. ఇటీవల ఎక్కడంటే అక్కడ ఇవి కనిపిస్తూ జనాలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి.

Viral Video: వామ్మో.. ఇంట్లో అకస్మాత్తుగా ప్రత్యేక్షమైన భారీ శ్వేతనాగు.. గూస్ బంప్స్ తెప్పించే వీడియో..
White Cobra
Shaik Madar Saheb
|

Updated on: May 06, 2023 | 1:07 PM

Share

మనం ఇప్పటి వరకూ ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైన ప్రమాదకరమైన కింగ్‌ కోబ్రాను చూశాం. ఇటీవల ఎక్కడంటే అక్కడ ఇవి కనిపిస్తూ జనాలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. అయితే స్నేక్‌ క్యాచర్స్‌ వాటిని తమ నైపుణ్యంతో పట్టి బంధించి సురక్షిత ప్రాంతాల్లో వదులుతున్నారు. అయితే ఈ కింగ్ కోబ్రా చాలా పొడవుగా ఉండటమే కాకుండా నల్లగా దాని ఒంటిపై తెల్లటి చారను కలిగి ఉంటుంది. ఇది అందరికీ తెలిసిందే. కానీ తమిళనాడులో ఓ భారీ శ్వేతనాగు ప్రత్యక్షమై అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌ అవుతోంది.

తమిళనాడులోని కోయంబత్తూరు పరిసర ప్రాంతాల్లో 10 రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. జిల్లావ్యాప్తంగా రెండ్రోజులుగా వర్షాలు కురుస్తుండడంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఈ వరద నీటిలో ఓ అరుదైన భారీ శ్వేత నాగు కొట్టుకొచ్చింది. కురింజి శక్తినగర్‌కు చెందిన ఆనంద్‌ అనే వ్యక్తి ఇంటి ప్రాంగణంలోకి చొరబడింది. దానిని చూసి భయాందోళనకు గురైన స్థానికులు అటవీ సిబ్బందికి సమాచారమిచ్చారు. రంగంలోకి దిగిన అటవీ సిబ్బంది శ్వేతనాగును బంధించి సమీపంలోని అడవుల్లో వదిలిపెట్టారు.

శ్వేతనాగు వీడియో చూడండి..

జన్యుపరమైన సమస్య కారణంగా అల్బినో కోబ్రా తెల్లగా ఉంటుందని వన్యప్రాణి సంరక్షకులు తెలిపారు. ఈ వీడియోను ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఆఫీసర్ సుశాంత్ నందా ట్విట్టర్‌లో పంచుకున్నారు. దాంతో ఈ వీడియో వైరల్‌గా మారింది. అరుదైన నాగుపామును చూసి జనం ఆశ్చర్యపోతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం..

గిల్ సేనకు లార్డ్స్‌లో డేంజర్ బెల్స్
గిల్ సేనకు లార్డ్స్‌లో డేంజర్ బెల్స్
ఇలాంటి వాళ్లు గ్రీన్ టీకి దూరంగా ఉండాల్సిందే!లేదంటే ముప్పు తప్పదు
ఇలాంటి వాళ్లు గ్రీన్ టీకి దూరంగా ఉండాల్సిందే!లేదంటే ముప్పు తప్పదు
అదృష్టం వరించింది​.. గిరిజ‌న కార్మికుడికి దొరికిన ఖ‌రీదైన వ‌జ్రం.
అదృష్టం వరించింది​.. గిరిజ‌న కార్మికుడికి దొరికిన ఖ‌రీదైన వ‌జ్రం.
జొన్న రొట్టె తినడం వలన కలిగే ఐదు అద్భుత ప్రయోజనాలివే!
జొన్న రొట్టె తినడం వలన కలిగే ఐదు అద్భుత ప్రయోజనాలివే!
100 ఏళ్ల తర్వాత అద్భుతం.. అదృష్టకలగనున్న రాశులివే!
100 ఏళ్ల తర్వాత అద్భుతం.. అదృష్టకలగనున్న రాశులివే!
పాలు పొంగిపోవడం మంచిదికాదా.. వాస్తు శాస్త్రం ఏం చెబుతుందంటే?
పాలు పొంగిపోవడం మంచిదికాదా.. వాస్తు శాస్త్రం ఏం చెబుతుందంటే?
Jioలో దిమ్మదిరిగే ప్లాన్‌..రూ.1958 ప్లాన్‌తో 365 రోజుల వ్యాలిడిటీ
Jioలో దిమ్మదిరిగే ప్లాన్‌..రూ.1958 ప్లాన్‌తో 365 రోజుల వ్యాలిడిటీ
ప్రపంచ వింతల వెనక విస్తుపోయే రహస్యాలు.. అపార నిధులన్ని అక్కడే..
ప్రపంచ వింతల వెనక విస్తుపోయే రహస్యాలు.. అపార నిధులన్ని అక్కడే..
ఓ ఇంటి సమీపాన గుప్పుమన్న ఘాటైన వాసన.. అనుమానమొచ్చి చెక్ చేయగా..
ఓ ఇంటి సమీపాన గుప్పుమన్న ఘాటైన వాసన.. అనుమానమొచ్చి చెక్ చేయగా..
రాజస్థాన్‌లో కూలిన ఎయిర్‌ ఫోర్స్‌ ఫైటర్‌ జెట్‌.. పైలట్‌ మృతి!
రాజస్థాన్‌లో కూలిన ఎయిర్‌ ఫోర్స్‌ ఫైటర్‌ జెట్‌.. పైలట్‌ మృతి!