AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Wanted Boyfriend: ఈ అమ్మాయికి బాయ్‌ఫ్రెండ్‌ కావాలట.. ఆ క్వాలిటీస్ తప్పనిసరి.. మీలో ఉన్నాయా మరి..

ప్రతి అమ్మాయి తనను ఎంతో ప్రేమించే, తన పట్ల శ్రద్ధ వహించే భాగస్వామి కావాలని కోరుకుంటుంది. అందుకే అమ్మాయిలు తమ భాగస్వాములను చాలా జాగ్రత్తగా ఎంచుకుంటారు. అమ్మాయిులు మొదట తమ భాగస్వామిని ఒకటి లేదా రెండుసార్లు కలుస్తారు. వారితో మాట్లాడుతారు. వారిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు.

Wanted Boyfriend: ఈ అమ్మాయికి బాయ్‌ఫ్రెండ్‌ కావాలట.. ఆ క్వాలిటీస్ తప్పనిసరి.. మీలో ఉన్నాయా మరి..
Julie Jinku
Shiva Prajapati
|

Updated on: May 06, 2023 | 11:27 AM

Share

ప్రతి అమ్మాయి తనను ఎంతో ప్రేమించే, తన పట్ల శ్రద్ధ వహించే భాగస్వామి కావాలని కోరుకుంటుంది. అందుకే అమ్మాయిలు తమ భాగస్వాములను చాలా జాగ్రత్తగా ఎంచుకుంటారు. అమ్మాయిులు మొదట తమ భాగస్వామిని ఒకటి లేదా రెండుసార్లు కలుస్తారు. వారితో మాట్లాడుతారు. వారిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. అతను ఎలా ఉన్నాడు, అతను ఎలాంటి స్వభావం కలిగి ఉన్నాడు అని అన్ని గమనించిన తరువాతే సంబంధంలో ముందుకు సాగుతుంది. కొందరైతే మొదటి చూపులోనే ప్రేమలో పడిపోయిన వారు కూడా ఉన్నారు. ప్రేమలో ఎలాంటి డిమాండ్, షరతులకు చోటు లేదు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఒక అమ్మాయి తనకు బాయ్‌ఫ్రెండ్‌ కావాలంటూ ఆఫర్ ప్రకటించింది. అయితే, తనకు బాయ్‌ఫ్రెండ్ కావాలంటే కొన్ని క్వాలిటీస్ వారిలో ఉండాలని షరతులు పెట్టింది. ఒకటో, రెండో, పదో షరతులు కాదండోయ్.. ఏకంగా 54 షరతులు పెట్టింది ఆ అమ్మాయి. ఇప్పుడీ ప్రకటనకు సంబంధించిన వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

అమ్మాయి పేరు జూలీ జింకూ అని చెబుతున్నారు. ‘మిర్రర్’ కథనం ప్రకారం.. జూలీ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్. సోషల్ మీడియాలో చాలా చురుకుగా ఉంటుంది. తనకు సంబంధించిన రీల్స్, వీడియోలు, ఫోటోలు షేర్ చేసుకుంటూ తనకంటూ ప్రత్యేకతను సంపాదించుకుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమెకు 1.44 లక్షల మంది ఫాలోవర్లు, ట్విట్టర్‌లోనూ లక్ష మందికిపైగా ఫాలోవర్స్ ఉన్నారు.

ఇవి కూడా చదవండి

అయితే, జూలీ తాజాగా తనకు ఒక బాయ్‌ఫ్రెండ్ కావాలంటూ ప్రకటన ఇచ్చింది. తాను బాయ్‌ఫ్రెండ్ కోసం వెతుకుతున్నట్లుగా ప్రకటించింది. అలాగని ఎవరిని పడితే వాళ్లను యాక్సెప్ట్ చేయదండోయ్. తనకు నచ్చిన వ్యక్తి అయినా సరే.. 54 క్వాలిటీస్ ఉండాల్సిందే అంటోంది జూలీ. ఆ షరతులను, క్వాలిటీస్‌ను కలిగిన ఏ యువకుడైనా బాయ్‌ఫ్రెండ్‌గా ఉండేందుకు అర్హులు అని తెలిపింది.

ఆ క్వాలిటీష్, కండీషన్స్ ఏంటంటే..

కండీషన్స్, క్వాలిటీస్‌ను జూలీ మూడు విభాగాలుగా విభజించింది. టాప్ రిక్వైర్మెంట్, సెకండ్ ప్రయారిటీ, ఎక్స్‌ట్రా అని పేరు పెట్టింది. జూలీ ప్రధాన కండీషన్లలో మొదటిది.. ఆమెకు బిడ్డ వద్దు. ఆమెతో ఎక్కవ సమయం గడిపే బాయ్‌ఫ్రెండ్ కవాలి. ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. అసూయ భావాలు కలిగి ఉండొద్దు. భావోద్వేగానలు నియంత్రించుకునే శక్తి, మతం గురించి పట్టించుకోవద్దు, వీడియో గేమ్స్ ఎలా ఆడాలో తెలిసి ఉండాలి. హర్రర్ సినిమాలను చూసే వారై ఉండాలి. ఇలా 54 షరతులను పెట్టింది జూలీ. మరి వీటిని యాక్సెప్ట్ చేసేదెవరు.. ఆమెకు నచ్చేదెవరు.. ఆమెకు బాయ్‌ఫ్రెండ్ అయ్యేదెవరు? అనే అంశం సోషల్ మీడియాలో ఇంట్రస్టింగ్‌గా మారింది.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..