Watch Video: జెండా లాక్కున్న రష్యా ప్రతినిధి.. వెంటబడి కొట్టిన ఉక్రెయిన్ ఎంపీ ఒలెక్సాండర్‌..

టర్కీ రాజధాని అంకారాలో జరిగిన బ్లాక్‌ సీ ఎకనామిక్‌ కమ్యూనిటీ 61వ పార్లమెంటరీ అసెంబ్లీలో షాకింగ్‌ ఘటన చోటు చేసుకుంది. తమ జాతీయ జెండా లాక్కుని వెళుతున్న రష్యా ప్రతినిధిపై ఉక్రెయిన్ ఎంపీ ఒలెక్సాండర్‌ మారికోవ్‌స్కీ దాడి చేశారు. వెంటబడి తరుముతూ పిడిగుద్దులు కురిపించాడు. జాతీయ జెండాను తిరిగి తీసుకుంటూ..

Watch Video: జెండా లాక్కున్న రష్యా ప్రతినిధి.. వెంటబడి కొట్టిన ఉక్రెయిన్ ఎంపీ ఒలెక్సాండర్‌..
Russia Vs Ukraine
Follow us

|

Updated on: May 05, 2023 | 11:45 AM

టర్కీ రాజధాని అంకారాలో జరిగిన బ్లాక్‌ సీ ఎకనామిక్‌ కమ్యూనిటీ 61వ పార్లమెంటరీ అసెంబ్లీలో షాకింగ్‌ ఘటన చోటు చేసుకుంది. తమ జాతీయ జెండా లాక్కుని వెళుతున్న రష్యా ప్రతినిధిపై ఉక్రెయిన్ ఎంపీ ఒలెక్సాండర్‌ మారికోవ్‌స్కీ దాడి చేశారు. వెంటబడి తరుముతూ పిడిగుద్దులు కురిపించాడు. జాతీయ జెండాను తిరిగి తీసుకుంటూ.. మీలాంటి జంతువులు మా జెండాకు దూరంగా ఉండాలని హెచ్చరించాడు. ఇంతలో సెక్కూరిటీ సిబ్బంది వచ్చి ఇద్దరినీ అడ్డుకున్నారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఉక్రెయిన్ పై రష్యా దండయాత్ర ప్రారంభించి 14 నెలలు అవుతోంది. పరస్పర దాడులతో రెండు దేశాలు తీవ్రంగా నష్టపోయాయి. ప్రాణనష్టం కూడా విపరీతంగా ఉంది. తాజాగా క్రెమ్లిన్ భవనంపై ఉక్రెయిన్ దాడికి ప్రయత్నించిందంటూ రష్యా ఆరోపించింది. రెండు డ్రోన్లను కూల్చివేసిన దృశ్యాలను మీడియాకు విడుదల చేసింది. ఈ దాడికి ప్రతీకారదాడులు తప్పవంటూ రష్యా హెచ్చరించింది.

ఇవి కూడా చదవండి

ఈ నేపథ్యంలో టర్కీలోని అంకారాలో జరుగుతున్న బ్లాక్ సీ ఎకనామిక్ కమ్యూనిటీ 61వ పార్లమెంటరీ సమావేశాలలో రష్యా, ఉక్రెయిన్ ప్రతినిధులు పాల్గొన్నారు. ఉక్రెయిన్ ఎంపీ ఒలెక్సాండ్ర మారికోవస్కీ ఈ మీటింగ్ లో మాట్లాడుతుండగా రష్యా ప్రతినిధి వేదికపైకి వచ్చి ఉక్రెయిన్ జెండాను లాక్కుని వెళ్లారు. దీంతో ఆయన వెంటపడ్డ ఒలెక్సాండ్ర.. రష్యా ప్రతినిధిపై దాడి చేసి తమ జాతీయ పతాకాన్ని తిరిగి తీసుకున్నారు.

వైరల్ అవుతున్న వీడియో..

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Latest Articles
ఏసీ కూలింగ్ రావడం లేదా? కారణమిదే? ఈ టిప్స్ పాటిస్తే సరి..
ఏసీ కూలింగ్ రావడం లేదా? కారణమిదే? ఈ టిప్స్ పాటిస్తే సరి..
సంద్రంతో సయ్యాటలు ఆడుతున్న ముద్దుగుమ్మ మీనాక్షి చౌదరి
సంద్రంతో సయ్యాటలు ఆడుతున్న ముద్దుగుమ్మ మీనాక్షి చౌదరి
ఎన్ని కోట్లు ఇచ్చిన ఆ పని చేయను.. తెగేసి చెప్పిన సాయి పల్లవి
ఎన్ని కోట్లు ఇచ్చిన ఆ పని చేయను.. తెగేసి చెప్పిన సాయి పల్లవి
పర్యాటకులకు గుడ్‌న్యూస్‌.. ప్రారంభం కానున్న మొదటి ప్రైవేట్ రైలు
పర్యాటకులకు గుడ్‌న్యూస్‌.. ప్రారంభం కానున్న మొదటి ప్రైవేట్ రైలు
ఏపీ ఈఏపీసెట్‌ 2024 హాల్‌ టికెట్లు విడుదల.. డైరెక్ట్ లింక్ ఇదే
ఏపీ ఈఏపీసెట్‌ 2024 హాల్‌ టికెట్లు విడుదల.. డైరెక్ట్ లింక్ ఇదే
ఎన్నికల వేళ పవన్ గురించి నాని ఊహించని ట్వీట్
ఎన్నికల వేళ పవన్ గురించి నాని ఊహించని ట్వీట్
స్పాట్ ఫిక్సింగ్‌ కేసులో జైలుకు.. 5 ఏళ్ల నిషేధం.. కట్‌చేస్తే..
స్పాట్ ఫిక్సింగ్‌ కేసులో జైలుకు.. 5 ఏళ్ల నిషేధం.. కట్‌చేస్తే..
గొప్ప మైలేజీని అందించే బజాజ్ సీఎన్‌జీ బైక్‌లు..ఎప్పుడంటే..
గొప్ప మైలేజీని అందించే బజాజ్ సీఎన్‌జీ బైక్‌లు..ఎప్పుడంటే..
ఐటీ రిటర్న్స్ ఫైల్ చేస్తున్నారా…? ఫామ్-16 విషయంలో ఆ తప్పు వద్దంతే
ఐటీ రిటర్న్స్ ఫైల్ చేస్తున్నారా…? ఫామ్-16 విషయంలో ఆ తప్పు వద్దంతే
ఓటు వేయడానికి ఉదయాన్నే బయలుదేరాడు.. కేంద్రం సమీపంలోకి రాగానే..
ఓటు వేయడానికి ఉదయాన్నే బయలుదేరాడు.. కేంద్రం సమీపంలోకి రాగానే..