Unique Love Story: తెలుగబ్బాయి.. జపాన్ అమ్మాయి.. భద్రాద్రి రామయ్య సాక్షిగా వివాహంతో ఒక్కటైన జంట..

తాజాగా హైదరాబాద్‌కు చెందిన ఓ యువకుడు జపాన్‌లో ఉద్యోగం కోసం వెళ్లి అక్కడి యువతిని ప్రేమంచి పెద్దల అంగీకారంతో హిందూ సంప్రదాయం ప్రకారం వివాహం చేసుకున్నాడు. భద్రాద్రి రాముడి సాక్షిగా ఇరు కుటుంబాలవారూ వైభవంగా వివాహం జరిపించారు.

Unique Love Story: తెలుగబ్బాయి.. జపాన్ అమ్మాయి.. భద్రాద్రి రామయ్య సాక్షిగా వివాహంతో ఒక్కటైన జంట..
Japan Girl & Indian Guy Love Marriage
Follow us
Surya Kala

|

Updated on: May 05, 2023 | 9:58 AM

ప్రేమకు కులం మతమే కాదు, దేశం, ప్రాంతం, భాషతో కూడా పనిలేదని నిరూపించే ఎన్నో సంఘటనలు మనం చూశాం. చదువుకోసమో, ఉద్యోగం కోసమో ఇతర దేశాలకు వెళ్తున్న భారతీయులు అక్కడి వారితో ప్రేమలో పడటం వారిని వివాహం చేసుకొని అక్కడే సెటిల్‌ అవటం పరిపాటిగా మారింది. తాజాగా హైదరాబాద్‌కు చెందిన ఓ యువకుడు జపాన్‌లో ఉద్యోగం కోసం వెళ్లి అక్కడి యువతిని ప్రేమంచి పెద్దల అంగీకారంతో హిందూ సంప్రదాయం ప్రకారం వివాహం చేసుకున్నాడు. భద్రాద్రి రాముడి సాక్షిగా ఇరు కుటుంబాలవారూ వైభవంగా వివాహం జరిపించారు.

హైదరాబాద్‌ కు చెందిన వైద్యులు కాపర్తి జగన్నాథ చారి కుమారుడు ఆకాష్ జపాన్ లో ఇంజనీర్‌గా ఉద్యోగం చేస్తున్నాడు. జపాన్ కు చెందిన మీకెలా అనే యువతి ఆకాష్‌ పనిచేసే కంపెనీలో హెచ్ ఆర్ మేనేజర్ గా ఉద్యోగం చేస్తోంది. వీరిద్దరి మధ్య పరిచయం ప్రేమగా మారింది. వీరిద్దరూ పెద్దలను ఒప్పించి వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. వీరి కోరికను విన్న ఇరు కుటుంబం తల్లిదండ్రులు పెళ్ళికి  అంగీకరించారు.

జపాన్‌ కుటుంబం అయిన వధువు మీకెలా హిందూ సంప్రదాయాన్ని గౌరవించింది. దీంతో కాష్ మీకెలాల పెళ్లిని హిందువులను తలదన్నేలా చక్కని భారతీయ సంప్రదాయ దుస్తులు ధరించి భద్రాద్రి రాముడి సమక్షంలో వైభవంగా వివాహం జరిపించారు. భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామి వారి ఆలయంలో ఇరు కుటుంబాలు, భారతదేశం, జపాన్ దేశం కు చెందిన పెద్దల సమక్షంలో వివాహం జరుపుకున్నారు. హిందూ సాంప్రదాయం ప్రకారం వివాహం చేసుకోవడం చాలా సంతోషంగా ఉందని పెళ్లి కుమార్తె మీకెలా ఆనందం వ్యక్తం చేసింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..