Telangana: పొంగులేటి ఏ గట్టున ఉంటారు? బీజేపీ నేతలతో మీటింగ్ తర్వాత కూడా సస్పెన్స్..!

కర్ణాటక ఎన్నికల ఫలితాల రోజే తెలంగాణలో ఆపరేషన్‌ కమలం జరగనుందా.. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణా రావు అదే రోజు కాషాయ కండువా కప్పుకుంటారా.. పొంగులేటితో బీజేపీ ఐదు గంటలపాటు జరిపిన మంత్రాంగం.. చివరకు ఏం తేల్చింది. జూపల్లి కూడా పొంగులేటి బాటలో నడుస్తున్నారా.. అసలు పొంగులేటి ఏ గట్టున ఉంటారు?

Telangana: పొంగులేటి ఏ గట్టున ఉంటారు? బీజేపీ నేతలతో మీటింగ్ తర్వాత కూడా సస్పెన్స్..!
Ponguleti Srinivas Reddy
Follow us
Shiva Prajapati

|

Updated on: May 05, 2023 | 9:55 AM

కర్ణాటక ఎన్నికల ఫలితాల రోజే తెలంగాణలో ఆపరేషన్‌ కమలం జరగనుందా.. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణా రావు అదే రోజు కాషాయ కండువా కప్పుకుంటారా.. పొంగులేటితో బీజేపీ ఐదు గంటలపాటు జరిపిన మంత్రాంగం.. చివరకు ఏం తేల్చింది. జూపల్లి కూడా పొంగులేటి బాటలో నడుస్తున్నారా.. అసలు పొంగులేటి ఏ గట్టున ఉంటారు? బీజేపీ చేరికల కమిటీతో మీటింగ్ తర్వాత కూడా ఇంకా ఎందుకీ సస్పెన్స్? ఇంతకీ కమలనాథులు ఇచ్చిన హామీలేంటి? పొంగులేని పెట్టిన షరతులేంటి?

రంజుగా ఖమ్మం రాజకీయం..

ఖమ్మం జిల్లాలో బీజేపీ బలహీనంగా ఉంది. అందుకే పొంగులేటిని చేర్చుకునేందుకు కాంగ్రెస్‌ కంటే కాస్త ఎక్కువగానే ట్రై చేస్తోంది. ఈటల రాజేందర్ నేతృత్వంలోని చేరికల కమిటీ ఖమ్మం వెళ్లి.. పొంగులేటి నివాసంలో ఆయనతో సమావేశం అయింది. ఈ మీటింగ్‌లో జూపల్లి కృష్ణారావు కూడా పాల్గొన్నారు. ఇద్దరినీ పార్టీలో చేరాలని ఆహ్వానించారు ఈటల. పార్టీలో సముచిత ప్రాధాన్యం ఇస్తామని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్‌ను ఓడించాలన్నదే అందరి ఉమ్మడి లక్ష్యమని.. అందుకే తమతో కలిసి పనిచేయాలని సూచించారు కమలనాథులు.

సీఎం కేసీఆర్‌ను గద్దె దించడమే తమ లక్ష్యమని ప్రకటించారు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. అనుచరులతో చర్చించాకే ఏ పార్టీలో చేరాలన్నది నిర్ణయిస్తామన్నారు. గతంలో కేసీఆర్‌ను గద్దె ఎక్కించేందుకు ఉద్యమం చేశామని.. ఇప్పుడు దింపేందుకు కూడా మరో ఉద్యమం చేయాలన్నారు మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు. ఇదిలాఉంటే.. ఉదయం చేరికల కమిటీ ఖమ్మం వెళ్లిన విషయం తనకు తెలియదని బండి సంజయ్ చెప్పడం చర్చనీయాంశమైంది.

ఇవి కూడా చదవండి

మొత్తానికి ఆపరేషన్‌ ఆకర్ష్‌ విషయంలో దూకుడు పెంచాలని బీజేపీ నిర్ణయించినట్లు తెలుస్తోంది. పొంగులేటిపైనా ఆ పార్టీ చాలా ఆశలే పెట్టుకున్నట్లు కనిపిస్తోంది. మరి పొంగులేటి దారెటు అన్న సస్పెన్స్‌ మాత్రం వీడటం లేదు. మొదట్లో గులాబీ పార్టీలో ఉన్న ఈటలను బీజేపీ మెల్లగా సముదాయించింది. బీజేపీ వైపు అడుగులు వేసేలా చేసింది. ఆ తర్వాత ఆపరేషన్‌ కమలాన్ని సక్సెస్‌చేసి ఈటెలను అక్కున చేర్చుకుంది. ఇప్పుడు పొంగులేటి, జూపల్లిని కూడా అదే బాటలో ఆకర్షించిందని పొలిటికల్‌ సర్కిల్స్‌ టాక్.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..