AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch Video: నల్ల తాచు వర్సెస్ వీధి కుక్క.. భయంకరమైన పోరు.. చివరికి ఏం జరిగిందంటే..

పాము, ముంగీసా మాత్రమే పొట్లాడుకుంటాయి. ఒక్క ముంగీసా మాత్రమే త్రాచు పామును ఓడించగలదు అని తెలుసు. అయితే అలా అనుకుంటే పొరబాడినట్టే. ముంగిసనే కాదు.. నేను సైతం ఆ విష సర్పాన్ని ఓడించగలనని చాటిచెప్పింది ఓ గ్రామ సింహం. అవును, అత్యంత ప్రమాదకరమైన పాముతో పోరాడి గెలిచింది ఆ శునకం. ఇందుకు సంబంధించిన షాకింగ్ వీడియో సోషల్

Follow us
Shiva Prajapati

|

Updated on: May 04, 2023 | 1:38 PM

పాము, ముంగీసా మాత్రమే పొట్లాడుకుంటాయి. ఒక్క ముంగీసా మాత్రమే త్రాచు పామును ఓడించగలదు అని తెలుసు. అయితే అలా అనుకుంటే పొరబాడినట్టే. ముంగిసనే కాదు.. నేను సైతం ఆ విష సర్పాన్ని ఓడించగలనని చాటిచెప్పింది ఓ గ్రామ సింహం. అవును, అత్యంత ప్రమాదకరమైన పాముతో పోరాడి గెలిచింది ఆ శునకం. ఇందుకు సంబంధించిన షాకింగ్ వీడియో సోషల్ మీడియాలో రచ్చ చేస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకకుందాం..

అత్యంత విషపూరితమైన నల్ల తాచుపాము వర్సెస్ పెంపుడు కుక్క ఫైటింగ్. ఈ బరిలో చివరికి నల్ల త్రాచు మట్టి కరిచింది. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం ఓటాయి గ్రామంలో రాగం యాకయ్య తన ఇంట్లో కుటుంబ సభ్యులతో కలిసి భోజనం చేస్తున్నారు. అదే సమయంలో పెరడు నుంచి ఇంట్లోకి వస్తున్న నల్ల తాచు పామును పెంపుడు కుక్క గమనించింది. ఆ పామును అడ్డుకునేందుకు అరుస్తూ దాని ఎదుటకు వెళ్లింది. పాము లెక్కచేయకుండా ముందుకు వస్తుండటంతో యుద్ధానికి సై అంది. దాంతో పోరు షురూ చేసింది. ఈ కుక్కకు మరో కుక్క కూడా తోడయింది. అయినప్పటికీ అదొక్కటే భీకర పోరాటం సాగించింది. పాము, కుక్క చాలా సేపు పోరాడాయి. పాము కాటు నుంచి తప్పించుకుంటూ.. దాని పీఛమనిచింది శునకం. తన పదునైన పళ్లతో కొరికేసింది. దాంతో పాము ప్రాణాలు విడిచింది. కుక్క తనను, తన యజమాని కుటుంబాన్ని కాపాడింది.

కాగా, ఈ రెండిటి మధ్య పోరాటాన్ని ఇంటి సభ్యులు, గ్రామస్తులు ఆసక్తిగా చూశారు. తమ ఫోన్ కెమెరాల్లో వీడియో రికార్డ్ చేశారు. ఆ వీడియోను సోషల్ మీడియాలో పబ్లిష్ చేయడంతో అదికాస్తా వైరల్ అయ్యింది. కుక్క పోరాటాన్ని చూసి నెటిజన్లు సైతం అవాక్కవుతున్నారు. విశ్వాసంలో కుక్కను మరేదీ మించదని కామెంట్స్ పెడుతున్నారు. తన యజమాని కుటుంబం కోసం తన ప్రాణాలను సైతం పణంగా పెట్టిన కుక్కను చూసి వావ్ అంటున్నారు నెటిజన్లు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..