Smart Ring: అబ్బురపరుస్తున్న స్మార్ట్ రింగ్స్.. తక్కువ ధరకే అందుబాటులో.. ఫీచర్స్ చూస్తే వావ్ అనాల్సిందే..

గతంలో టైమ్ చూడాలంటే చేతికి ఉన్న వాచ్‌లో చూసేవాళ్లం. ఆ తరువాత క్రమంగా మొబైల్ ఫోన్ వాడకం పెరిగింది. అందులో సమయం చూసుకుంటున్నాం. క్రమంగా వాచ్‌లకు కూడా టెక్ రూపం సంతరించుకుంది. సరికొత్త టెక్నాలజీతో స్మార్ట్ వాచెస్ అందుబాటులోకి వచ్చాయి. యాపిల్ సహా అనేక ఎలక్ట్రానిక్స్ కంపెనీలు స్మార్ట్ ఫోన్లను మార్కెట్‌లోకి విడుదల చేశాయి.

Smart Ring: అబ్బురపరుస్తున్న స్మార్ట్ రింగ్స్.. తక్కువ ధరకే అందుబాటులో.. ఫీచర్స్ చూస్తే వావ్ అనాల్సిందే..
Smart Rings
Follow us
Shiva Prajapati

|

Updated on: May 03, 2023 | 12:49 PM

గతంలో టైమ్ చూడాలంటే చేతికి ఉన్న వాచ్‌లో చూసేవాళ్లం. ఆ తరువాత క్రమంగా మొబైల్ ఫోన్ వాడకం పెరిగింది. అందులో సమయం చూసుకుంటున్నాం. క్రమంగా వాచ్‌లకు కూడా టెక్ రూపం సంతరించుకుంది. సరికొత్త టెక్నాలజీతో స్మార్ట్ వాచెస్ అందుబాటులోకి వచ్చాయి. యాపిల్ సహా అనేక ఎలక్ట్రానిక్స్ కంపెనీలు స్మార్ట్ ఫోన్లను మార్కెట్‌లోకి విడుదల చేశాయి. ప్రస్తుతం ఈ స్మార్ట్ వాచ్‌ల ట్రెండే నడుస్తుందని చెప్పొచ్చు. ఇప్పుడు స్మార్ట్ వాచ్ మరో రూపంలో వస్తోంది. అదే.. స్మార్ట్ రింగ్. అవును, మార్కెట్‌లో స్మార్ట్ రింగ్స్ హల్‌చల్ చేస్తున్నాయి.

చాలా మంది ప్యాషన్ కోసం రింగ్స్ ధరిస్తుంటారు. ఎక్కువ శాతం మెటల్ రింగ్స్ ధరిస్తారు. అయితే, ఇప్పుడు ఆ రింగ్స్.. మరింత స్మార్ట్‌గా మారాయి. వాచ్ స్థానంలో స్మార్ట్ రింగ్స్ వచ్చేశాయి. ఇది కూడా స్మార్ట్ వాచ్ మాదిరిగానే పని చేస్తుంది. మరి ఈ స్మార్ట్ వాచ్‌లో ఫీచర్స్ ఏంటి? దాని ధర ఎంత ఉంటుంది? ఇందుకు సంబంధించిన వివరాలన్నీ తెలుసుకుందాం..

అసలేంటీ ఈ స్మార్ట్ రింగ్?

స్మార్ట్ వాచ్‌ల మాదిరిగానే.. స్మార్ట్ రింగ్‌లలో కూడా సెన్సార్స్, ఎన్ఎఫ్‌సి చిప్‌లు ఉంటాయి. స్మార్ట్ వాచ్ ఆరోగ్యాన్ని ట్రాక్ చేసినట్లే.. ఈ స్మార్ట్ రింగ్ కూడా హెల్త్‌ను ట్రాక్ చేస్తుంది. ఇందులో తేడా ఏంటంటే స్మార్ట్ రింగ్ పరిమాణం స్మార్ట్ వాచ్ కంటే చిన్నగా ఉండటమే. మీ వేలి సైజ్ ప్రకారం ఈ స్మార్ట్ రింగ్‌ను కొనుగోలు చేయొచ్చు. మరో మాటలో చెప్పాలంటే.. మార్కెట్లో సాధారణ రింగ్‌ని కొనుగోలు చేసినట్లే ఈ స్మార్ట్ రింగ్‌‌ను కూడా కొనుగోలు చేయొచ్చు.

ఇవి కూడా చదవండి

స్మార్ట్ రింగ్ ధర ఎంత?..

స్మార్ట్ రింగ్‌ ధర రూ. 1000 నుంచి ప్రారంభమై.. రూ. 20 వేల పైన కూడా ఉన్నాయి. కంపెనీ బ్రాండ్, ఫీచర్స్, బ్యాటరీ, తదితర వివరాలను బట్టి వీటు రేటు మారుతుంది.

పనితీరు ఇలా ఉంటుంది..

స్మార్ట్ వాచ్ మాదిరిగానే.. ఈ స్మార్ట్ రింగ్‌లో హార్ట్ రేట్ మానిటర్, పల్స్ రేట్ మానిటర్, స్లీప్ మానిటర్, బ్లూటూత్ కనెక్టివిటీ, కాంటాక్ట్‌లెస్ పేమెంట్ మొదలైన అనేక ఫీచర్లు ఉన్నాయి. స్మార్ట్ రింగ్ ఖరీదును బట్టి.. ఫీచర్స్ అందుబాటులో ఉన్నాయి. స్మార్ట్ వాచ్ మాదిరిగానే యాప్ ద్వారా మీ ట్రాకింగ్ మొత్తం వివరాలను చూడొచ్చు. మొబైల్ ఫోన్‌ను కూడా కంట్రోల్ చేసే వెసులుబాటు ఉంది. అలారం సెట్, కాల్ రిసీవ్, కాల్ కట్ చేయడం వంటి ఆప్షన్స్ కూడా ఉన్నాయి.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ