- Telugu News Photo Gallery Health Tips: These 5 foods you must avoid after consuming mango in summer season Know more Details
Health Tips: మామిడి పండ్లు తిన్న తరువాత వీటిని అస్సలు తినకండి.. లేదంటే ఆస్పత్రిపాలవుతారు..!
Healthy Food: మామిడి పండ్లను ఇష్టపడని వారు ఉండరు. వేసవిలో అత్యధికంగా లభించే ఈ మామిడిని పండ్లలోనే రారాజు అని పిలుస్తారు. మామిడి పండ్లు రుచికి మాత్రమే కాకుండా.. ఆరోగ్యంగా కూడా ఎంతో మేలు చేస్తుంది. మామిడి కాయలను నేరుగా గానీ, జ్యూస్ గా గానీ తీసుకోవచ్చు. అయితే, మామిడి పండ్లను తిన్న తరువాత కొన్ని ఆహారాలకు దూరంగా ఉండాలి. లేదంటే.. ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
Updated on: May 02, 2023 | 2:17 PM

మామిడి పండ్లలో రారాజు. ఎండాకాలం వచ్చిందంటే చాలు.. ప్రజలు మామిడి పండ్లను లొట్టలేసుకుంటూ తినేస్తారు. మామిడి పండులో చాలా పోషకాలు ఉంటాయి. ఇందులో విటమిన్లు ఎ, సి, కె, ఫైబర్, పొటాషియం, మెగ్నీషియం, ఫోలేట్, బీటా కెరోటిన్ వంటి పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. వేసవిలో మామిడిపండును తింటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అయితే, మామిడి పండు తిన్న తరువాత వీటిని అస్సలు తినొద్దు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

రెండు చెంచాల పచ్చి కాకరకాయ రసాన్ని సమాన పరిమాణంలో తెల్ల ఉల్లిపాయ రసంతో కలిపి రోజూ తీసుకుంటే కలరా నయమవుతుంది.

మామిడి పండ్లు తిన్న తర్వాత కూల్ డ్రింక్స్ అస్సలు తాగొద్దు. ఇలా చేయడం వల్ల గ్యాస్, ఛాతిలో మంట వంటి సమస్యలు తలెత్తుతాయి.

చాలా మంది వేసవిలో పుల్లటి పెరుగు, పండిన మామిడిని కలిపి తింటారు. ఈ ఆహారం మీ ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. జీర్ణ వ్యవస్థకు సంబంధించిన ఇబ్బందులు ఎదరువుతాయి. కడుపు నొప్పి, వాంతులు, ఉబ్బరం వంటి సమస్యలను పెంచుతుంది. అందుకే ఈ రెండూ కలిపి తినొద్దు.

చాలామంది మధ్యాహ్నం సమయంలో మామిడి పండ్లను తింటారు. మసాలా కూరలు తినొద్దు. మసాలా వంటకాలు, మామిడి పండును కలిపి తినడం వల్ల జీర్ణ సమస్యలు తలెత్తుతాయి. స్పైసీ ఫుడ్‌తో మామిడి పండ్లను కలిపి తినకూడదు.

పండ్లు తిన్న తర్వాత నీళ్లు తాగే అలవాటు ఉన్నా వెంటనే మార్చుకోండి. మామిడిపండ్లు తిన్న తర్వాత నీళ్లు తాగొద్దు. ఇలా చేయడం వల్ల జీర్ణ వ్యవస్థపై ప్రభావం చూపుతుంది. డయేరియా సమస్యలు రావచ్చు. పండు తిన్న అరగంట తర్వాత నీళ్లు తాగాలి.