Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Grah Gochar 2023: రాశులు మారుతున్న గ్రహాలు.. ఈ 4 రాశుల వారికి పెను కష్టాలు! ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే..

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మే నెలలో శుక్రుడు, సూర్యుడు, కుజుడు రాశులు మారబోతున్నారు. ఈ మాసంలో బుధుడు మేషరాశిలోకి వెళ్లనున్నాడు. ఈ గ్రహ మార్పు ప్రభావం అన్ని రాశివారిపైనా కనిపిస్తుంది. మే 2వ తేదీన శుక్రుడు వృషభరాశిని విడిచిపెట్టి మిథునరాశిలోకి ప్రవేశిస్తాడు. దీని కారణంగా కుజుడు, శుక్రుడు సంయోగం జరుగుతుంది.

Grah Gochar 2023: రాశులు మారుతున్న గ్రహాలు.. ఈ 4 రాశుల వారికి పెను కష్టాలు! ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే..
Grah Gochar
Follow us
Shiva Prajapati

|

Updated on: May 02, 2023 | 2:15 PM

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మే నెలలో శుక్రుడు, సూర్యుడు, కుజుడు రాశులు మారబోతున్నారు. ఈ మాసంలో బుధుడు మేషరాశిలోకి వెళ్లనున్నాడు. ఈ గ్రహ మార్పు ప్రభావం అన్ని రాశివారిపైనా కనిపిస్తుంది. మే 2వ తేదీన శుక్రుడు వృషభరాశిని విడిచిపెట్టి మిథునరాశిలోకి ప్రవేశిస్తాడు. దీని కారణంగా కుజుడు, శుక్రుడు సంయోగం జరుగుతుంది. తదుపరి, కుజుడు మే 10 న కర్కాటక రాశిలోకి వెళతాడు. మే 15 న బుధుడు మేషరాశిలోకి వెళ్తాడు. మే 15వ తేదీనే సూర్యుడు మేషం నుంచి వృషభరాశికి కూడా ప్రయాణిస్తాడు. ఈ గ్రహ స్థితిలో అనేక రాశుల వారికి మే నెల శుభప్రదంగా ఉంటుంది. అయితే ముఖ్యంగా ఈ 4 రాశుల వారికి కీడు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వారి జీవితంలో ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొనే అవకాశం ఉన్నందున చాలా జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు జ్యోతిష్య పండితులు. మరి నష్టాలు జరిగే ఆ నాలుగు రాశులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

వృషభం..

మే నెలలో గ్రహ చలనం కారణంగా వృషభ రాశి వారు ఆరోగ్యం పట్ల మరింత శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. మిగతా రోజుల కంటే ఎక్కువ శ్రద్ధ చూపాల్సిన అవసరం ఉంది. ఇక ఆర్థిక పరమైన అవకాశాలు కూడా అనుకూలంగా లేవు. ఈ సమయంలో మీరు క్లిష్ట పరిస్థితులను ఎదుర్కోవచ్చు. కెరీర్ కూడా అంత అనుకూలంగా లేదు. కాబట్టి ఎలాంటి నిర్ణయాలలైనా చాలా జాగ్రత్తగా తీసుకోండి.

కన్యారాశి..

మే నెలలో గ్రహ మార్పుల వల్ల కన్యారాశి వారు ఆరోగ్యానికి గురయ్యే అవకాశాలు ఎక్కవగా కనిపిస్తున్నాయి. విదేశాలతో వ్యాపారం చేసే ఈ రాశివారికి ప్రతికూల పరిస్థితులు ఉన్నాయి. వ్యాపారులు ఈ నెలలో నక్షత్రాల స్థానం మీకు అనుకూలంగా లేనందున.. చాలా జాగ్రత్తగా ముందడుగు వేయాలి. ఇక కుటుంబం, సామాజిక జీవితంలో కొంత గందరగోళం ఉండవచ్చు.

ఇవి కూడా చదవండి

ధనుస్సు రాశి..

ధనుస్సు రాశి వారికి మే నెలలో గ్రహాల సంచారం కారణంగా ఆర్థికంగా ప్రతికూల పరిస్థితులు ఉంటాయి. ఈ నెలలో వివాదాలకు కొంత దూరంగా ఉండాలి. ఈ నెలలో వివాహం, ఇతర అంశాల్లో మీ ప్రమేయం మీకు ప్రాణాంతకంగా మారొచ్చు. వివాదానికి దిగడం మీకు ప్రతికూలంగా మారవచ్చు. పని, వ్యాపారంలో కూడా కష్టపడవలసి ఉంటుంది. అంతే కాకుండా కుటుంబ విషయాలపై ఆందోళనలు కూడా ఉండవచ్చు.

కుంభ రాశి..

కుంభ రాశికి, మేలో జరుగుతున్న గ్రహ చలనం.. డబ్బు పరంగా చాలా వ్యతిరేక ప్రభావం చూపుతుంది. ఈ నెలలో మీ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచుకోవడానికి చాలా కష్టపడవలసి ఉంటుంది. ఈ నెల, వ్యాపార అవకాశాలు పెద్దగా కనిపించవు. మే నెలలో విజయం సాధించడానికి కష్టపడాల్సి ఉంటుంది. ఈ మాసంలో ప్రయాణాలకు దూరంగా ఉండాలి.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..