Health Tips: ‘టీ’తో కలిపి వీటిని అస్సలు తినొద్దు, తాగొద్దు.. లేదంటే ప్రమాదంలో పడతారు..!
ప్రపంచ వ్యాప్తంగా చాలా మంది ఉదయం లేవడం లేవడంతోనే బెడ్ కాఫీ, టీ తాగుతారు. తమ రోజు తేనీరుతోనే ప్రారంభిస్తారు. టీ, కాఫీ తాగితే రిలాక్స్‌గా ఫీలవుతారు. లేదంటే.. తలనొప్పితో ఇబ్బంది పడుతుంటారు. అయితే, టీ ఎంత రిలాక్స్ ఇస్తుందో.. టీ తో కలిపి కొన్ని పదార్థాలు తిన్నా.. తాగినా.. అంతే ప్రమాదాన్ని కలిగిస్తాయి. మరి ఆ ప్రమాదకరాకాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
Updated on: May 03, 2023 | 1:14 PM

టీ తాగే ముందు, తరువాత పెరుగు, పెరుగుతో చేసిన పదార్థాలు అస్సలు తినొద్దు. లేదంటే జీర్ణ సంబంధిత సమస్యలు తలెత్తుతాయి.

ఉదయం వేళ అల్పాహారంగా పండ్లు తినే అలవాటు ఉంటే.. టీ తాగేటప్పుడు గానీ, తాగిన తరువాత గానీ వెంటనే తినకూడదు. టీ తాగడానికి, పండ్లు తినడానికి మధ్య కనీసం గంట వ్యవధి ఉండాలి.

ఐరన్: కరివేపాకులో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. ఇది రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయిని పెంచడంలో సహాయపడుతుంది. దీన్ని తీసుకోవడం ద్వారా రక్తహీనత నుండి బయటపడవచ్చు మరియు రక్తహీనత ఫిర్యాదులను కూడా దూరం చేసుకోవచ్చు.

టీ తాగక ముందు గానీ, తాగిన వెంటనే గానీ లెమన్ జ్యూస్ అస్సలు తాగొద్దు. అలా చేస్తే కడుపు ఉబ్బరం సమస్య తలెత్తుతుంది.

టీ తాగే సమయంలో పసుపు వేసిన పదార్థాలు గానీ, పసుపు గానీ అస్సలు తీసుకోవద్దు. లేదంటే కడుపు సంబంధిత సమస్యలు వేధిస్తాయి. కడుపు ఉబ్బరంగా ఉంటుంది.