Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch Video: తల తెగిపడినా తగ్గేదేలే.. కసిగా తనను తానే కాటేసుకున్న డేంజరస్ స్నేక్..

సరిసృపాలలో చాలా రకాల జీవులు ఉంటాయి. వాటిలో ఎక్కువగా మనం చర్చించుకునేవి.. పాములు. ఈ భూమిపై అత్యం తప్రమాదకరమైన విషపూరితమైన పాములు లెక్కలేనన్ని ఉన్నాయి. ప్రమాదకరమైనవి కాబట్టే.. వాటిని చూస్తేనే జనాలు జడుసుకుంటారు. అలాగని, పాములు పనిగట్టుకుని వ్యక్తులపై, జీవులపై దాడి చేయవు. వాటికి అభద్రతా భావం కలిగితేనే అవి అటాక్ చేస్తాయి.

Watch Video: తల తెగిపడినా తగ్గేదేలే.. కసిగా తనను తానే కాటేసుకున్న డేంజరస్ స్నేక్..
Snake
Follow us
Shiva Prajapati

|

Updated on: May 04, 2023 | 9:52 AM

సరిసృపాలలో చాలా రకాల జీవులు ఉంటాయి. వాటిలో ఎక్కువగా మనం చర్చించుకునేవి.. పాములు. ఈ భూమిపై అత్యం తప్రమాదకరమైన విషపూరితమైన పాములు లెక్కలేనన్ని ఉన్నాయి. ప్రమాదకరమైనవి కాబట్టే.. వాటిని చూస్తేనే జనాలు జడుసుకుంటారు. అలాగని, పాములు పనిగట్టుకుని వ్యక్తులపై, జీవులపై దాడి చేయవు. వాటికి అభద్రతా భావం కలిగితేనే అవి అటాక్ చేస్తాయి.

అయితే, ఈ పాములు చాలా వేగంగా స్పందిస్తాయి. తమ సమీప పరిసరాలను వెంటనే గమనిస్తాయి. ఏదైనా ప్రమాదం పొంచి ఉందని గమనిస్తే.. వెంటనే అలర్ట్ అవుతాయి. అక్కడి నుంచి సాధ్యమైనంత త్వరగా వెళ్లిపోతాయి. ఇక ముప్పు తప్పదు అనుకున్నప్పుడు ఆత్మ రక్షణ కోసం రివర్స్ అటాక్ చేస్తుంది. కాటేస్తుంది. ఈ విషయం ఇలాఉంచితే.. చాలా సందర్భాల్లో ప్రజలు పాములను కొట్టి చంపుతారు. అయితే, పామును కొట్టి చంపినా.. చాలా సేపటి వరకు అవి బ్రతికే ఉంటాయి. గంటల తరబడి వాటిలో చలనం ఉంటుంది. చాలా సందర్భాల్లో ఇది నిరూపితమైంది కూడా. పాము చనిపోయింది కదా అని పట్టుకోబోయిన కొందరు.. అదే పాము కాటుకు గురై ప్రాణాలు కోల్పోయిన సందర్భాలు చాలానే ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

తాజాగా ఇందుకు నిదర్శనమైన ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చనిపోయిందని ఏమరపాటుకు గురయ్యారో అంతే సంగతి అని ఈ వీడియో నిరూపిస్తోంది. ఇంతకీ ఈ వీడియోలో ఏముందో ఇప్పుడు తెలుసుకుందాం. ఇంటి పరిసరాల్లో అత్యంత ప్రమాదకరమైన రక్తపింజరి పాము కనిపించడంతో.. ప్రజలు దాన్ని కొట్టి చంపారు. ఆ దాడిలో పాము తల, దాని శరీరం వేరు అయ్యాయి. అయినప్పటికీ.. పాము తోక భాగం ఇంకా జీవంతోనే ఉంది. అటూ ఇటూ కొట్టుకుంటోంది. ఆ పక్కనే తెగిపడిన పాము తల కూడా ఉంది. అయితే, తోక భాగం ఆ తలకు తగలగానే.. వెంటనే దానిలో చలనం వచ్చింది. నోరు తెరిచి కసిగా కాటేసింది. తన శరీర భాగమే అని తెలియని తల భాగం.. కోరలతో గట్టిగా పట్టేసింది. ఈ కాటుతో పాము శరీర భాగం గిలగిల కొట్టుకుంది. చూసేందుకు అత్యంత భయానకంగా ఉన్న ఈ వీడియోను @OTerrifying అనే ట్విట్టర్ అకౌంట్‌లో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాను హడలెత్తిస్తోంది.

వైరల్ వీడియోను కింద చూడొచ్చు..

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..