ప్రపంచ కుబేరుడు వేసుకున్న ఈ షర్ట్‌ ఖరీదెంతో తెలుసా ??

ప్రపంచ కుబేరుడు వేసుకున్న ఈ షర్ట్‌ ఖరీదెంతో తెలుసా ??

Phani CH

|

Updated on: May 04, 2023 | 9:53 AM

డబ్బులు ఉన్న వాళ్ల జీవితం బిందాస్‌గా ఉంటుంది. వాళ్లు ఉపయోగించే ప్రతీ వస్తువు ఖరీదైనదేనని అనుకుంటాం. సోషల్‌ మీడియాలోనూ వీటిపై చర్చ జరుగుతుంటుంది. అయితే తాజాగా ప్రపంచ కుబేరుల్లో ఒకరైన అమెజాన్‌ వ్యవస్థాపకుడు జెఫ్‌ బెజోస్‌ ధరించిన ఓ షర్ట్‌పై నెట్టింట ఇలాంటి చర్చే జరుగుతోంది.

డబ్బులు ఉన్న వాళ్ల జీవితం బిందాస్‌గా ఉంటుంది. వాళ్లు ఉపయోగించే ప్రతీ వస్తువు ఖరీదైనదేనని అనుకుంటాం. సోషల్‌ మీడియాలోనూ వీటిపై చర్చ జరుగుతుంటుంది. అయితే తాజాగా ప్రపంచ కుబేరుల్లో ఒకరైన అమెజాన్‌ వ్యవస్థాపకుడు జెఫ్‌ బెజోస్‌ ధరించిన ఓ షర్ట్‌పై నెట్టింట ఇలాంటి చర్చే జరుగుతోంది. కొన్ని లక్షల కోట్ల ఆస్తికి అధిపతి అయిన జెఫ్‌ బెజోస్‌ అంత తక్కువ ధర షర్ట్ ధరించడం ఏంటని నెట్టింట ఓ పెద్ద చర్చ జరగుతోంది. బెజోస్‌ ఇటీవల జరిగిన కోచెల్లా మ్యూజిక్‌ ఫెస్టివల్‌లో పాల్గొన్నాడు. తన ప్రేయసితో కలిసి ఈవెంట్‌కు హాజరమైన బెజోస్‌ ఉత్సాహంగా డ్యాన్స్‌ కూడా చేశాడు. ఈ సందర్భంగా తీసిన కొన్ని వీడియోలు, ఫొటోలు నెట్టింట వైరల్‌ అయ్యాయి. ఫొటోలను చూసిన నెటిజన్లను బెజోష్‌ షర్ట్ ఆకర్షించింది. బటర్‌ ఫ్లైస్‌ ప్రింటింగ్‌తో ఉన్న సదరు షర్ట్‌ ధరపై నెట్టింట ఇప్పుడు పెద్ద చర్చ జరుగుతోంది. బెజోష్‌ ధరించిన షర్ట్‌ అమెజాన్‌లో 12 డాలర్లకు అందుబాటులో ఉందని ఓ నెటిజన్‌ పోస్ట్‌ చేశాడు. మన కరెన్సీలో చెప్పాలంటే ఆ షర్ట్‌ విలువ కేవలం 980 రూపాయలు మాత్రమే. ఇంకేముంది ఈ పోస్ట్‌ కాస్త శరవేగంగా నెట్టింట ట్రెండ్‌ అవుతోంది. అన్ని లక్షల కోట్ల ఆస్తులున్న వ్యక్తి సింప్లిసిటీ భలే ఉంది అంటూ నెటిజన్లు కామెంట్స్‌ చేస్తున్నారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఐదేళ్ల చిన్నారి.. చూస్తుండగానే 95ఏళ్ల వృద్ధురాలిగా మారి..

NTR 30: ఒక పోరాటం ముగించాడు.. వస్తున్నాడు..

Ugram: ఉగ్రం సూపర్ డూపర్ హిట్‌ రిలీజ్‌ ముందే టాక్ లీక్‌

Bellamkonda Sreenivas: రష్మికతో డేటింగ్‌పై హీరో దిమ్మతిరిగే రిప్లై..

Agent: దారుణం.. అప్పుడే ఓటీటీలోకి ఏజెంట్