Amritsar Blast: స్వర్ణదేవాలయానికి కూతవేటు దూరంలో భారీ పేలుడు.. పలువురికి తీవ్ర గాయాలు..

పంజాబ్‌ లోని అమృత్‌సర్‌లో భారీ పేలుడు సంబంధించింది. ఈ పేలుడు ధాటికి స్థానిక ప్రజలు హడలిపోయారు. పేలుడులో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఆటోలో వెళ్తున్న ఆరుగురు అమ్మాయిలకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. స్వర్ణదేవాలయానికి కిలోమీటర్‌ దూరంలోనే ఈ పేలుడు జరగడం..

Amritsar Blast: స్వర్ణదేవాలయానికి కూతవేటు దూరంలో భారీ పేలుడు.. పలువురికి తీవ్ర గాయాలు..
Punjab
Follow us
Shiva Prajapati

|

Updated on: May 07, 2023 | 1:28 PM

పంజాబ్‌ లోని అమృత్‌సర్‌లో భారీ పేలుడు సంబంధించింది. ఈ పేలుడు ధాటికి స్థానిక ప్రజలు హడలిపోయారు. పేలుడులో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఆటోలో వెళ్తున్న ఆరుగురు అమ్మాయిలకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. స్వర్ణదేవాలయానికి కిలోమీటర్‌ దూరంలోనే ఈ పేలుడు జరగడం.. మరింత ఆందోళనను రేకెత్తిస్తోంది. పేలుడుపై అలర్ట్ అయిన భద్రతా సిబ్బంది ఘటనా స్థలాన్ని పరిశీలిస్తోంది. పేలుడు ఉగ్రవాదుల పనిగా భావించినా.. ఆ తరువాత లేదని నిర్ధారించారు. ఘటనపై లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు పేలుడుపై అప్రమత్తమైన పంజాబ్ ప్రభుత్వం.. దర్యాప్తునకు ఆదేశించింది.

పేలుడుకు సంబంధించి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న దృశ్యాలు..

పేలుడు ఘటనపై స్పందించిన పంజాబ్ పోలీసులు..

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..