Miracle: రోజూ కాసేపు నేలపై కూర్చోండి… జరిగే అద్భుతాన్ని ఆస్వాధించండి..
నేలపై కూర్చోవడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఒకప్పుడు చాలా పనులు నేలపై కూర్చునే చేసేవారు. నేలపై కూర్చునే ఆహారాన్ని తినేందుకు ఇష్టపడేవారు. ఆయుర్వేదంలో, ఈ అలవాటు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని పేర్కొన్నారు. మనం ఎంత అలసిపోయినా కాసేపు నేలపై కూర్చుంటే వెంటనే ఉపశమనం కలుగుతుందని అనేక పరిశోధనల్లో తేలింది.
నేలపై కూర్చోవడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఒకప్పుడు చాలా పనులు నేలపై కూర్చునే చేసేవారు. నేలపై కూర్చునే ఆహారాన్ని తినేందుకు ఇష్టపడేవారు. ఆయుర్వేదంలో, ఈ అలవాటు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని పేర్కొన్నారు. మనం ఎంత అలసిపోయినా కాసేపు నేలపై కూర్చుంటే వెంటనే ఉపశమనం కలుగుతుందని అనేక పరిశోధనల్లో తేలింది. నేటికీ, భారతదేశంలోని అనేక ప్రాంతాలలో, చిన్న నుండి పెద్ద ఇళ్ళలో ప్రజలు నేలపై కూర్చొనే ఆహారం తింటారు. రోజూ కొన్ని నిమిషాలు నేలపై కూర్చోవడం వల్ల శరీరానికి ఎలాంటి ప్రయోజనాలను అందుతాయో ఇవాళ మనం తెలుసుకుందాం.
నేలపై కూర్చోవడం వల్ల కలిగే ప్రయోజనాలు..
నేలపై కూర్చోవడం వల్ల వెన్నెముకకు ఎక్కువ ప్రయోజనం కలుగుతుందని నిపుణులు చెబుతున్నారు. వెన్నెముక నిటారుగా ఉంటుందని, తద్వారా వెన్ను నొప్పి సమస్య తగ్గుతుందని పేర్కొంటున్నారు. అంతేకాదు.. నేలపై కూర్చోవడం వల్ల మెదడుపైనా ప్రభావం చూపుతుందట. ఇది హార్మోన్ల సమతుల్యను మెరుగుపరుస్తుందట. మానసిక స్థిరత్వాన్ని కూడా తెస్తుంది. కొన్ని నిమిషాలు నేలపై కూర్చోవడం వల్ల శరీరానికి శక్తి వస్తుందని నిపుణులు చెబుతున్నారు.
నేతలపై కూర్చోవడం వల్ల హిప్ ఫ్లెక్సర్లకు చాలా ప్రయోజనం ఉంటుందని చెబుతున్నారు నిపుణులు. కండరాలు కూడా బలపడుతాయి. వెన్నెముక, వీపు భాగాలు దృఢంగా అవుతాయి. ఇలా చేయడం వల్ల కూర్చునే భంగిమను కూడా మెరుగుపరుస్తుంది. అందుకే.. ఖచ్చితంగా నేలపై కూర్చోవాలని సూచిస్తున్నారు నిపుణులు.
నేలపై కూర్చున్నప్పుడు ఈ విషయాలను గుర్తుంచుకోండి..
1. నేలపై కూర్చున్నప్పుడు ఎల్లప్పుడూ సుఖాసన భంగిమలో కూర్చోవాలి. ఈ సమయంలో అస్సలు వంగి కూర్చోవద్దు.
2. వెన్నెముక నొప్పితో బాధపడుతున్నట్లయితే.. కింద ఒక దిండు వేసుకుని కూర్చోవచ్చు.
3. నేలపై కూర్చోవడం కష్టంగా అనిపిస్తే మొదట్లో కాళ్లను ముందుకు చాచి కూర్చోండి. తద్వారా క్రమంగా అలవాటు అవుతుంది.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..