Andhra Pradesh: భార్యాభర్త.. మధ్యలో ప్రియుడు.. కట్ చేస్తే.. వర్మీ కంపోస్ట్ షెడ్డులో..

ఎన్నో ఆశలతో అతను ఆమెను మనువాడాడు.. కానీ.. ఆమె చూపు మాత్రం పక్క దారి పట్టింది.. మరొకరితో మోజులో పడి కట్టుకున్న భర్తనే కడతేర్చింది. వివాహేతర బంధానికి భర్త అడ్డుగా ఉన్నాడని.. ప్రియుడితో కలిసి భార్య హత్య చేసిన దారుణ ఘటన అంబేద్కర్ కోనసీమ జిల్లాలో చోటుచేసుకుంది.

Andhra Pradesh: భార్యాభర్త.. మధ్యలో ప్రియుడు.. కట్ చేస్తే.. వర్మీ కంపోస్ట్ షెడ్డులో..
Crime News
Follow us
Shaik Madar Saheb

|

Updated on: May 07, 2023 | 9:20 AM

ఎన్నో ఆశలతో అతను ఆమెను మనువాడాడు.. కానీ.. ఆమె చూపు మాత్రం పక్క దారి పట్టింది.. మరొకరితో మోజులో పడి కట్టుకున్న భర్తనే కడతేర్చింది. వివాహేతర బంధానికి భర్త అడ్డుగా ఉన్నాడని.. ప్రియుడితో కలిసి భార్య హత్య చేసిన దారుణ ఘటన అంబేద్కర్ కోనసీమ జిల్లాలో చోటుచేసుకుంది. వివాహేతర సంబంధం మోజులో భార్య.. ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసింది. ఆ తర్వాత ఎవరికి అనుమానం రాకుండా పూడ్చిపెట్టింది. ఈ దారుణ ఘటన అంబేద్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేట మండలం గంగలకుర్రు అగ్రహారంలో జరగగా.. పోలీసుల దర్యాప్తులో అసలు నిజం ఆలస్యంగా వెలుగుచూసింది. గంగలకుర్రు అగ్రహారంనకు చెందిన రాయుడు రవిశంకర్ 2016లో అదిలాబాద్‌లో ఉంటున్న సమయంలో..అదిలాబాద్ కు చెందిన గజానంద్ కార్ డ్రైవర్‌గా చేరాడు. రవిశంకర్ తల్లి ఉపాధ్యాయురాలిగా పనిచేసేవారు. ఈ క్రమంలో అదిలాబాద్ మసాలా వ్యాపారం చేసే రవిశంకర్ వ్యాపారం లాభసాటిగా లేదని.. రవిశంకర్ స్వగ్రామం అంబాజీపేట మండలం గంగలకుర్రు అగ్రహారంలో వర్మి కంపోస్ట్ ఎరువుల తయారీ కేంద్రాన్ని ప్రారంభించాడు.

వర్మీ కంపోస్ట్ కూడా లాభసాటిగా లేకపోవడంతో.. ఆ తర్వాత రాయల్ ఎన్‌ఫీల్డ్ స్పెర్ పార్ట్స్ వ్యాపారం ప్రారంభించాడు. వర్మీ కంపోస్ట్ ప్రారంభించిన సమయంలో అదిలాబాద్లో కార్ డ్రైవర్ గా పనిచేసిన గజానంద్, అతని భార్య ఊర్మిళను తీసుకువచ్చి తనవద్దే పనిలో పెట్టుకున్నాడు. అమలాపురం మండలం బండారులంక మెట్ల కాలనీలో నివాసం ఉండేలా వారికి ఆశ్రయం కల్పించాడు. ఈ నేపథ్యంలో ఊర్మిళ, రవిశంకర్‌ మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. అయితే, వివాహేతర బంధానికి అడ్డుగా ఉన్న గజానంద్‌ను హతమార్చేందుకు అతని భార్య ఉర్మిళ, రవిశంకర్ గత ఏడాది నవంబరు నెలలో ప్లాన్ వేశారు. నవంబరు 23న వర్మీ కంపోస్టు షెడ్డులో గజానంద్‌ను.. కొట్టి చంపి అదే ప్రాంతంతో పాతిపెట్టారు.

గజానంద్ కనిపించకపోవడం, భార్య ఊర్మిళ వేరే వాళ్ళతో తీరుగుతుండటంతో అనుమానం వచ్చి గజానంద్ తండ్రి శివాజీ హైదరాబాదులోని అబ్దుల్ గంజ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మిస్టరీ కేసుగా నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. రవిశంకర్, ఊర్మిళ ఇద్దరు కలిసి గజానంద్ ను హత్య చేసినట్లు నిర్ధారించారు. అనంతరం.. అబ్దుల్ గంజ్ పోలీసులు అంబాజీపేట స్టేషన్ కు కేసును బదిలీ చేయగా పి.గన్నవరం సీఐ ప్రశాంత్,అంబాజీపేట ఎస్ఐ చైతన్య కుమార్ కలిసి రవిశంకర్, ఊర్మిళను అదుపులోకి తీసుకుని విచారించగా అసలు నిజాన్ని అంగీకరించారు. వారిద్దరినీ చేసి కోర్టులో హాజరు పరిచినట్టు తెలిపిన కొత్తపేట డీఎస్పీ వెంకటరమణ వెల్లడించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఏపీ వార్తల కోసం..