Andhra Pradesh: ఈదురుగాలులతో ఏపీ వర్షాలు.. ఉరుములు, మెరుపులు కూడా.. ఆ జిల్లాలకు.!

ఏపీకి మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఆదివారం రాష్ట్రంలోని ఈ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది.

Andhra Pradesh: ఈదురుగాలులతో ఏపీ వర్షాలు.. ఉరుములు, మెరుపులు కూడా.. ఆ జిల్లాలకు.!
Ap Rains
Follow us
Ravi Kiran

|

Updated on: May 07, 2023 | 9:20 AM

ఏపీకి మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఆదివారం రాష్ట్రంలో అల్లూరి, ప్రకాశం, తిరుపతి, అన్నమయ్య, నంద్యాల జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది. అలాగే మిగిలిన జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు పడొచ్చునని వాతావరణ శాఖ అధికారులు అన్నారు. ఆగ్నేయ బంగాళాఖాతంలో శనివారం ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. అది కాస్తా ఆదివారం(మే 7) అల్పపీడనంగా ఏర్పడే అవకాశం ఉండగా.. సోమవారం(మే 8) నాటికి వాయుగుండంగా మారనుందని వాతావరణ అధికారులు అంచనా వేస్తున్నారు.

ఇక మోచా తుఫాన్.. ఉత్తర దిశగా మయన్మార్ వైపు కదిలే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని.. ఆ తుఫాను ముప్పు ఏపీకి ఉండకపోవచ్చునని వాతావరణ శాఖ చెబుతోంది. అల్పపీడనం, వాయుగుండం ప్రభావం కారణంగా రాష్ట్రంలోని కొద్దిమేర వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు. మరోవైపు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో శనివారం భారీ వర్షాలు కురిశాయి. అల్లూరి సీతారామరాజు జిల్లా అడ్డతీగలలో అత్యధికంగా 7.8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కాగా, అత్యల్పంగా కొల్లూరులో 4.6 సెంటీమీటర్ల వర్షం కురిసింది. ఇక పిడుగుపాటుకు తిరుపతి జిల్లాలో ఇద్దరు గొర్రెల కాపర్లు గాయపడగా.. 13 గొర్రెలు మృతి చెందాయి.

అమ్మబాబోయ్.. 1 కాదు.. 2 కాదు.. 11 పులులు వచ్చాయ్..
అమ్మబాబోయ్.. 1 కాదు.. 2 కాదు.. 11 పులులు వచ్చాయ్..
గురువారం సీఎం రేవంత్ రెడ్డితో సినీప్రముఖుల భేటీ..
గురువారం సీఎం రేవంత్ రెడ్డితో సినీప్రముఖుల భేటీ..
పోషకాల నిధి ప్యాషన్‌ ఫ్రూట్‌.. మధుమేహం బాధితులకు అద్భుత ఫలం..!
పోషకాల నిధి ప్యాషన్‌ ఫ్రూట్‌.. మధుమేహం బాధితులకు అద్భుత ఫలం..!
భ‌వానీ దీక్షా విర‌మ‌ణ‌ల్లో అద్భుత ఫ‌లితాలిస్తున్న క్యూఆర్ కోడ్!
భ‌వానీ దీక్షా విర‌మ‌ణ‌ల్లో అద్భుత ఫ‌లితాలిస్తున్న క్యూఆర్ కోడ్!
వేసిన తాళాలు వేసినట్టుగానే ఉన్నాయి..కానీ బంగారం మాయం
వేసిన తాళాలు వేసినట్టుగానే ఉన్నాయి..కానీ బంగారం మాయం
'అల్లు అర్జున్‌ను టార్గెట్ చేయడం మానేయండి': టాలీవుడ్ హీరోయిన్
'అల్లు అర్జున్‌ను టార్గెట్ చేయడం మానేయండి': టాలీవుడ్ హీరోయిన్
విరాట్ ఫ్యాన్స్‌కి శుభవార్త.. లెజెండ్‌కే సూటి పెట్టిన రన్ మెషిన్
విరాట్ ఫ్యాన్స్‌కి శుభవార్త.. లెజెండ్‌కే సూటి పెట్టిన రన్ మెషిన్
అల్పపీడనం ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలే.. వర్షాలు..
అల్పపీడనం ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలే.. వర్షాలు..
తిరుపతి, తిరుమలలో వైకుంఠ ద్వార ద‌ర్శ‌నం ఉచిత టోకెన్ల జారీ
తిరుపతి, తిరుమలలో వైకుంఠ ద్వార ద‌ర్శ‌నం ఉచిత టోకెన్ల జారీ
ఓటీటీలోకి వచ్చేసిన శివన్న లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ
ఓటీటీలోకి వచ్చేసిన శివన్న లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ