Manipur Clashes: మణిపూర్‌లో చిక్కుకున్న తెలుగు విద్యార్థులు.. క్షేమంగా తరలించేందుకు ఏర్పాట్లు..

మణిపూర్‌లో చిక్కుకున్న తెలుగువారిని క్షేమంగా తరలించడానికి ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలు హెల్ప్‌లైన్‌లను ఏర్పాటు చేశాయి. మణిపూర్ ప్రభుత్వంతో ఏపీ, తెలంగాణ అధికారులు సంప్రదింపులు చేస్తున్నారు. ఇంఫాల్‌ నిట్‌లో చిక్కుకున్న విద్యార్థులను త్వరగా తీసుకురావాలని వారి తల్లిదండ్రులు వేడుకుంటున్నారు.

Manipur Clashes: మణిపూర్‌లో చిక్కుకున్న తెలుగు విద్యార్థులు.. క్షేమంగా తరలించేందుకు ఏర్పాట్లు..
Manipur
Follow us
Shiva Prajapati

|

Updated on: May 07, 2023 | 8:13 AM

మణిపూర్‌లో చిక్కుకున్న తెలుగువారిని క్షేమంగా తరలించడానికి ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలు హెల్ప్‌లైన్‌లను ఏర్పాటు చేశాయి. మణిపూర్ ప్రభుత్వంతో ఏపీ, తెలంగాణ అధికారులు సంప్రదింపులు చేస్తున్నారు. ఇంఫాల్‌ నిట్‌లో చిక్కుకున్న విద్యార్థులను త్వరగా తీసుకురావాలని వారి తల్లిదండ్రులు వేడుకుంటున్నారు.

చదువుల కోసం మణిపూర్‌కు విద్యార్థులు..

గత మూడు, నాలుగు రోజులుగా ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌ హింసాత్మక ఘటనలతో అట్టుడుకుతోంది. ఈ క్రమంలోనే.. చదువుల నిమిత్తం మణిపూర్‌ వెళ్లిన ఏపీ, తెలంగాణ విద్యార్థులు అక్కడ చిక్కుకుపోయారు. ప్రస్తుతం జరుగుతున్న హింసాత్మక ఘటనలతో విద్యార్థులు భయాందోళనకు గురవుతున్నారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. పిల్లల క్షేమ సమాచారం కోసం తల్లిదండ్రులు కూడా కంగారుపడుతున్నారు. ఇంఫాల్‌ నిట్‌లో బీటెక్‌ చేస్తున్న విజయవాడకు చెందిన జీవనశ్రీ కుటుంబ సభ్యులు టీవీ9తో మాట్లాడారు. విద్యార్థులను త్వరగా తీసుకొచ్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు జీవనశ్రీ మదర్‌.

ఇంఫాల్‌ నిట్‌ పరిసర ప్రాంతాల్లో డేంజర్‌ పరిస్థితులు..

ఇక.. ఇంఫాల్‌ నిట్‌లో ఉన్న విజయవాడకు చెందిన జీవనశ్రీ అనే విద్యార్థినితో టీవీ9 ప్రతినిధి క్రాంతి ఫోన్‌లో మాట్లాడారు. ఇంఫాల్‌ నిట్‌ పరిసర ప్రాంతాల్లో పరిస్థితులు డేంజర్‌గా ఉన్నాయని విద్యార్థిని భయాందోళన వ్యక్తం చేసింది.

ఇవి కూడా చదవండి

ఇదిలావుంటే.. మణిపూర్‌లో చిక్కుకున్న తెలుగువారిని క్షేమంగా తీసుకొచ్చేందుకు ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు త్వరితగతిన చర్యలు చేపట్టాయి. తెలంగాణ విద్యార్థులను ప్రత్యేక విమానంలో తీసుకురావాలని కేసీఆర్‌ ప్రభుత్వం నిర్ణయించింది. తెలంగాణకు చెందిన 250 మంది విద్యార్థులు ఇంఫాల్‌తోపాటు సమీప ప్రాంతాల్లో ఉన్నట్టు గుర్తించింది. వారిని తరలించేందుకు ఇవాళ మధ్యాహ్నం ఇంఫాల్‌ నుంచి ప్రత్యేక విమానం ఏర్పాటు చేసింది. అంతేకాదు.. మణిపూర్‌లోని పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ అక్కడున్నవారి కోసం ప్రత్యేక సెల్‌ ఏర్పాటు చేసింది. మణిపూర్‌లో చిక్కుకున్న వారి కోసం డీజీపీ ఆఫీస్ లో 7901643283హెల్ప్ లైన్ ఏర్పాటు చేశారు. ఇక మణిపూర్‌ సీఎస్‌తో మాట్లాడిన తెలంగాణ సీఎస్‌ శాంతికుమారి.. తెలంగాణ విద్యార్థులు క్షేమంగా వచ్చేలా చూడాలని కోరారు. మణిపూర్‌ అధికారులను సీఎస్‌, డీజీపీ ఎప్పటికప్పుడు సంప్రదిస్తూ తెలంగాణ ప్రజలు, విద్యార్థుల భద్రతపై తీసుకుంటున్న చర్యల గురించి ఆరా తీస్తున్నారు.

అధికారులు సంప్రదింపులు..

మరోవైపు.. మణిపూర్‌లో చిక్కుకున్న ఏపీ విద్యార్థుల కోసం జగన్ ప్రభుత్వం కూడా రంగంలోకి దిగంది. అక్కడి విద్యార్థులను తీసుకొచ్చేందుకు ఏపీ ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. దానిలో భాగంగా హెల్ప్ లైన్ నెంబర్లు ఏర్పాటు చేసింది. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు హెల్ప్ లైన్‌ను వివియోగించుకోవాలని ఏపీ ప్రభుత్వం కోరింది. అలాగే.. సహాయ పర్యవేక్షణ బాధ్యతల కోసం ప్రత్యేక అధికారి మైఖేల్ అఖోమ్‌ను నియమించింది. ఢిల్లీలోని ఏపీ భవన్‌లో కంట్రోల్ రూం ఏర్పాటు చేసింది జగన్‌ ప్రభుత్వం. ఇక.. మణిపూర్‌లోని పలు యూనివర్సిటీల్లో ఏపీకి చెందిన 150 మంది విద్యార్థులు చదువుతున్నట్లు అధికారుల అంచనా వేశారు. వారందరినీ క్షేమంగా తరలించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు ఏపీ అధికారులు. మణిపూర్ ప్రభుత్వంతో ఏపీ భవన్ అధికారులు సంప్రదింపులు జరుపుతున్నారు. మొత్తంగా.. మణిపూర్‌ హింసాత్మక ఘటనల నేపథ్యంలో ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు అలెర్ట్‌ అయ్యాయి. అక్కడి నుంచి విద్యార్థులను తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాయి.

మరిన్ని తెలంగాణ&ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..