Love Story: జీవితం బోర్ కొడుతోందని బాయ్ ఫ్రెండ్‌ని ఎంపిక చేసుకున్న భార్య .. నెలనెలా 60 వేలు ఇస్తున్న ప్రియుడు..

తన భర్త మీద విశ్వాసం, ప్రేమ తగ్గడం మొదలు పెట్టిందని చెప్పింది. దీంతో జెన్నీ సరికొత్తగా ఆలోచించింది.. వెంటనే.. ఇల్లిసిట్ ఎన్ కౌంటర్స్ అనే వెబ్ సైట్ లో ఐడీ క్రియేట్ చేసి బాయ్ ఫ్రెండ్ కోసం వెతకడం మొదలుపెట్టింది.ది.

Love Story: జీవితం బోర్ కొడుతోందని బాయ్ ఫ్రెండ్‌ని ఎంపిక చేసుకున్న భార్య .. నెలనెలా 60 వేలు ఇస్తున్న ప్రియుడు..
Pocket Money
Follow us
Surya Kala

|

Updated on: May 14, 2023 | 10:26 AM

తల్లిదండ్రులు, అన్నదమ్ములు, అక్కచెల్లెలు వంటి అనేక రక్తసంబంధాలు జీవితంలో చాలా ప్రత్యేకమైనవి. అయితే వీటన్నికంటే వెరీవెరీ స్పెషల్ అనిపిస్తుంది.. భార్యాభర్తల సంబంధం. ఏ బంధమైనా,  సంబంధమైనా నడిచేసి నమ్మకంపనే.. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య సంబంధం అందంగా సాగడానికి ప్రతి ఒక్కరికీ నమ్మకంతో పాటు, ప్రేమ కూడా అవసరం. ఎందుకంటే భార్యాభర్తల మధ్య బంధం దారం అంత సున్నితమైంది. ఒక్కసారి దారం తెగిపోతే.. ఏ విధంగా ముడి కనిపిస్తూ ఉంటుందో.. అదే విధంగా భర్తభర్తల మధ్య కలతలు వస్తే.. వాటి ప్రభావం జీవితంపై కనిపిస్తూనే ఉంటుంది. అంతేకాదు సంబంధం విచ్ఛిన్నం కావడానికి ఎక్కువ సమయం పట్టదు. అయితే జంటలు కలతలు రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటూ.. జీవితాన్ని కొనసాగుతుంటారు.. మరికొందరు మాత్రం భర్తభర్తల బంధాన్ని పెద్దగా పట్టించుకోరు. అంతేకాదు  పెళ్లయిన తర్వాత కూడా ఇతరులతో సంబంధాలు పెట్టుకుంటారు . అలాంటి కేసు ఒకటి ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అంతేకాదు చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది.

అసలు విషయంలోకి వెళ్తే.. 42 ఏళ్ల మహిళ పెళ్లి అయినప్పటికీ మరో వ్యక్తితో సంబంధం పెట్టుకుంది. అంతేకాదు తన బాయ్ ఫ్రెండ్ నుంచి పాకెట్ మనీ కోసం ప్రతి నెలా దాదాపు 60 వేల రూపాయలు తీసుకుంటుంది. ప్రస్తుతం ఈ మహిళ నెట్టింట్లో ఓ రేంజ్ లో చక్కర్లు కొడుతోంది. ఆ మహిళ పేరు జెన్నిఫర్.

స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించిన జెన్నిఫర్..  డైలీ స్టార్ కథనం ప్రకారం.. ఇటీవల జెన్నిఫర్ తన జీవితానికి సంబంధించిన షాకింగ్ నిజాన్ని చెప్పింది. జీవితం బోర్ కొడుతోంది..  తన దగ్గర ఖర్చు చేయడానికి కూడా సరిపడా డబ్బు లేదు. అటువంటి పరిస్థితిలో.. తన భర్త మీద విశ్వాసం తగ్గడం మొదలు పెట్టిందని..చెప్పింది. దీంతో జెన్నీ సరికొత్తగా ఆలోచించింది.. వెంటనే.. ఇల్లిసిట్ ఎన్ కౌంటర్స్ అనే వెబ్ సైట్ లో ఐడీ క్రియేట్ చేసి బాయ్ ఫ్రెండ్ కోసం వెతకడం మొదలుపెట్టింది.

ఇవి కూడా చదవండి

బాయ్ ఫ్రెండ్ నుంచి  ప్రతి నెలా 60 వేల రూపాయలు   చివరకు జెన్నీ అన్వేషణ ఫలించింది. బాయ్‌ఫ్రెండ్‌ను ఎంపిక చేసుకుంది. అయితే ఈ బాయ్ ఫ్రెండ్ గురించి తన భర్తకు చెప్పలేదు జెన్నీ. వాస్తవానికి తన బాయ్‌ఫ్రెండ్‌ నుంచి ఖర్చుల కోసం డబ్బులు తీసుకోవాలని ఎప్పుడూ అనుకోలేదని.. అయితే తన బాయ్ ఫ్రెండ్ డబ్బులు ఇస్తుంటే కాదనలేకపోయానని జెన్నిఫర్‌ చెప్పింది. ఇప్పుడు జెన్నీ ప్రియుడు ఆమెకు ప్రతి నెలా మనదేశ కరెన్సీలో దాదాపు 60వేల రూపాయలు ఇస్తాడు. ఈ డబ్బులతో జెన్నీ షాపింగ్ చేస్తుంది. తన అభిరుచులన్నింటినీ నెరవేర్చడానికి ప్రయత్నిస్తుంది. అయితే ఈ విషయం తన భర్తకు తెలిస్తే.. తమ భార్యాభర్తల బంధం ప్రమాదంలో పడుతుందేమో అని కూడా ఓ వైపు జెన్నీ భయాన్ని వ్యక్తం చేస్తోంది. ప్రస్తుతం ఈ జెన్నీ నెట్టింట్లో ఓ రేంజ్ లో చక్కర్లు కొడుతోంది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..