గుజరాత్-హైదరాబాద్ భారతదేశంలోనే కాదు పాకిస్తాన్‌లో కూడా కనిపించే నగరాలు ఇవి..
ప్రపంచవ్యాప్తంగా అనేక నగరాల పేర్లను వినే ఉంటారు. అవి చిన్నవా..? లేదా పెద్దవా..? అన్న విషయం పక్కన పెడితే.. భారతదేశంలోని పలు నగరాల పేర్లతో సరిగ్గా సరిపోయే కొన్ని పేర్లు ఇతర దేశాల్లో కూడా ఉన్నాయి. మన దేశంలో ఢిల్లీ నగరం ఉంది. అది మన దేశ రాజధానిగా గుర్తింపు ఉంది. అయితే, అమెరికాలో కూడా ఢిల్లీకి స్థానం ఉంది. ఏంటీ షాక్ అవుతున్నారా..? అంతేకాదు.. ఇలాంటి పేర్లు పాకిస్థాన్‌లో కూడా ఉన్నాయి. భారత్‌లో ఉన్న నగరాల పేర్లతో పాకిస్తాన్‌లో ఉన్న ఆ నగరాలు ఏవో ఇక్కడ తెలుసుకుందాం..
Updated on: May 14, 2023 | 1:48 PM

భారతదేశంలోని పలు నగరాల పేర్లతో సరిగ్గా సరిపోయే కొన్ని పేర్లు ఇతర దేశాల్లో కూడా ఉన్నాయి. మన దేశంలో ఢిల్లీ నగరం ఉంది. అది మన దేశ రాజధానిగా గుర్తింపు ఉంది. అయితే, అమెరికాలో కూడా ఢిల్లీకి స్థానం ఉంది. ఏంటీ షాక్ అవుతున్నారా..?

Hyderabad, India Hyderabad- పూర్వ కాలంలో భారతదేశంలోని హైదరాబాద్‌ను దక్కన్ అని, పాకిస్థాన్‌లోని హైదరాబాద్‌ను సింధ్ అని పిలిచేవారు. కానీ నేడు మీరు ఈ దేశాలలో ఈ రెండు పేర్లతో నగరాలను చూస్తారు.

భారతదేశంలోని గుజరాత్ గురించి వినే ఉంటారు. కానీ ఈ ప్రదేశం పాకిస్తాన్‌లోని పంజాబ్‌లో కూడా ఉంది. భారతదేశంలోని గుజరాత్ చాలా అందమైన నగరం.

Sheikhpura In Bihar - షేక్‌పురా భారతదేశంలోని బీహార్ రాష్ట్రంలోని ఒక ప్రదేశం. మీరు పాకిస్థాన్‌లోని పంజాబ్‌లో కూడా అదే పేరును వినవచ్చు.

Kartarpur Corridor- కర్తాపూర్ భారతదేశంలోని పంజాబ్ నగరంలో ఉంది. అయితే పాకిస్థాన్‌లో మీరు పంజాబ్‌లోని కర్తాపూర్‌ని చూస్తారు.

Kutch- కచ్ జిల్లా భారతదేశంలో ఉంది. బలూచిస్తాన్‌లో కూడా అదే పేరు వినవచ్చు,. ఇది బాబర్ కచ్ పేరుతో ప్రసిద్ధి చెందింది.





























