Largest Hot Pot: సగం కొండను ఆక్రమించిన హాట్ పాట్ రెస్టారెంట్.. ది, 5,800 మందికి ఒకే సారి సర్వ్..

చైనాలో ప్రతీదీ స్పెషలే... అది టెక్నికల్‌ అయినా.. నాన్‌టెక్నికల్‌ అయినా.. ఏదైనా సరే... స్పెషాలిటీకి కేరాఫ్‌ డ్రాగన్‌ కంట్రీయే. చైనాలోని చాంగ్‌క్వింగ్‌ పట్టణానికి సమీపంలో ప్రపంచంలోనే అతిపెద్ద హాట్‌పాట్‌ రెస్టారెంట్‌ ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారుతోంది.

Largest Hot Pot: సగం కొండను ఆక్రమించిన హాట్ పాట్ రెస్టారెంట్..  ది, 5,800 మందికి ఒకే సారి సర్వ్..
World S Largest Hot Pot
Follow us

|

Updated on: May 15, 2023 | 6:49 AM

సాధారణంగా ఏ రెస్టారెంట్‌లోనైనా పదుల సంఖ్యలో సిట్టింగ్‌ ఉంటుంది. మహా పెద్దదైతే వందల మంది వెళ్లి తినొచ్చు. కానీ.. చైనాలోని ఓ రెస్టారెంట్‌ ఒకేసారి వేల మందికి ఆతిథ్యమిస్తోంది. మరి.. ఆ రెస్టారెంట్‌లో వన్‌ సిట్టింగ్‌లో ఎంతమంది విందు ఆరగిస్తారో తెలుసుకుందాం..చైనాలో ప్రతీదీ స్పెషలే… అది టెక్నికల్‌ అయినా.. నాన్‌టెక్నికల్‌ అయినా.. ఏదైనా సరే… స్పెషాలిటీకి కేరాఫ్‌ డ్రాగన్‌ కంట్రీయే. చైనాలోని చాంగ్‌క్వింగ్‌ పట్టణానికి సమీపంలో ప్రపంచంలోనే అతిపెద్ద హాట్‌పాట్‌ రెస్టారెంట్‌ ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారుతోంది. ‘హాట్‌పాట్‌’అంటే కొందరు సమూహంగా ఏర్పడి టేబుల్‌ మధ్య పాత్ర పెట్టి ఏదైనా వంటకం వండుకుంటారు. తర్వాత దాన్ని వడ్డించుకుని, కబుర్లు చెబుతూ తింటారు. ప్రస్తుతం వండే పరిస్థితి లేదు.. కాబట్టి.. కేవలం చెఫ్‌లు తయారు చేస్తే తినడానికి ప్రాధాన్యం ఇస్తున్నారు.

ఓ కొండపైనున్న ఈ రెస్టారెంట్‌లో సుమారు 900 టేబుళ్లున్నాయి. ఏకకాలంలో 5వేల 800 మంది విందు ఆరగించవచ్చంటే ఎంత పెద్ద రెస్టారెంటో అర్థం చేసుకోవచ్చు. మొత్తం 3వేల 300 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉండే ఈ రెస్టారెంట్‌లో.. టేబుల్ బుక్‌ చేసుకుంటే అదెక్కడుందో కనుక్కోవడానికి ఒక మనిషి సహాయం తీసుకోవాలి. అందుకే.. ఇది అతి పెద్ద హాట్‌ పాట్‌ రెస్టారెంట్‌గా ఖ్యాతి గడించింది.

ఇవి కూడా చదవండి

గతేడాది గిన్నిస్‌ బుక్‌లో కూడా చోటు సంపాదించింది. ఇక.. కస్టమర్లు ఎవరు ఆర్డర్‌ పెట్టినా ఆ వంటకం తీసుకురావడానికి కనీసం 30 నిమిషాలు సమయం పడుతుంది. అయినా ఇక్కడకు వచ్చే వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతుందే తప్ప తగ్గట్లేదు. వేసవి కాలంలో అయితే రిజర్వేషన్‌ చేసుకోకుండా వస్తే టేబుల్ దొరకడమే కష్టమట. చైనా నలుమూలల నుంచి పర్యాటకులు ఈ రెస్టారెంట్‌కు తరలివస్తుంటారు. వెయిటర్లు, కుక్‌లు, కిచెన్‌లో పని చేసే సిబ్బంది అంతా కలిపి వందల సంఖ్యలో ఉంటారు. అయితే.. అంత బిజీగా ఉన్న రెస్టారెంట్‌లో అసలు రుచి ఉంటుందా అని కొందరికి అనుమానం వస్తోంది. కానీ.. ఆన్‌లైన్‌లో మాత్రం నెటిజన్లు మంచి రివ్యూలే ఇస్తున్నారు. రద్దీ వేళల్లో ఆహారం తీసుకురావడం కాస్త ఆలస్యమైనప్పటికీ.. రుచిలో మాత్రం రెస్టారెంట్ నిర్వాహకులు రాజీ పడబోరని చెబుతున్నారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Latest Articles