Love Marriage: వయసు ఒక సంఖ్య మాత్రమే.. వరుడికి 22.. వధువుకి 48.. ఔను టీచర్‌ని ప్రేమించి పెళ్లి చేసుకున్న స్టూడెంట్..

ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఓ పెళ్లి వార్తల్లో నిలిచింది. 22 ఏళ్ల యువకుడు తనకంటే పెద్దదైన 48 ఏళ్ల యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఇదే విషయంపై వరుడు మాట్లాడుతూ.. వయస్సు కేవలం సంఖ్య మాత్రమేనని.. తనకు ఆమెలో జీవిత భాగస్వామి కనిపించింది.. మమ్మల్ని ఆశీర్వదించమని కోరుతున్నాడు మలేషియాకు చెందిన యువకుడు.

Love Marriage: వయసు ఒక సంఖ్య మాత్రమే.. వరుడికి 22.. వధువుకి 48.. ఔను టీచర్‌ని ప్రేమించి పెళ్లి చేసుకున్న స్టూడెంట్..
Love Marriage
Follow us
Surya Kala

|

Updated on: May 15, 2023 | 8:27 AM

ప్రేమకు వయసు, ఆస్తులు, అందం, ఏవీ అడ్డురావని.. ప్రపంచ వ్యాప్తంగా అనేక ప్రేమకథలు నిరూపిస్తూనే ఉన్నాయి. అయితే తరచుగా తనకంటే పెద్ద వయసున్న మహిళను పెళ్లి చేసుకునే యువకుల గురించి లేదా తమకంటే అతి చిన్న వయసున్న యువతులను పెళ్లి చేసుకున్న వృద్ధుల గురించి వార్తలు తరచుగా వింటున్నాం.. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఓ పెళ్లి వార్తల్లో నిలిచింది. 22 ఏళ్ల యువకుడు తనకంటే పెద్దదైన 48 ఏళ్ల యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఇదే విషయంపై వరుడు మాట్లాడుతూ.. వయస్సు కేవలం సంఖ్య మాత్రమేనని.. తనకు ఆమెలో జీవిత భాగస్వామి కనిపించింది.. మమ్మల్ని ఆశీర్వదించమని కోరుతున్నాడు మలేషియాకు చెందిన యువకుడు. వివరాల్లోకి వెళ్తే..

22 ఏళ్ల మహమ్మద్ డానియల్ అహ్మద్ అలీ 48 ఏళ్ల తన క్లాస్ టీచర్ జమీలాను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. మహమ్మద్ డానియల్ 2016 లో 3వ తరగతి చదువుకునే సమయంలో తన క్లాస్ రూమ్ లో పాఠాలు చెప్పడానికి వచ్చినప్పుడు జమిలాను మొదటి సారి కలిశాడు. అప్పుడు వీరిద్దరి బంధం ఉపాధ్యాయుడు, విద్యార్థిగా ఉండేది. జమిలా తన విద్యార్థులకు అత్యంత శ్రద్దగా పాఠాలు చెప్పేది.. అప్పుడు టీచర్ గా జమీలాను ఇష్టపడ్డానని చెప్పాడు మహమ్మద్ డానియల్ . ఒక ఏడాది తర్వాత వీరిద్దరూ వేరయ్యారు. చివరి సారి జమీలాను 4వ తరగతిలో ఉండగా చూసాడు.

అయినప్పటికీ డేనియల్ పుట్టినరోజుకి జమీలా ఫోన్‌ నుంచి శుభాకాంక్షలు పంపేది.. అలా మహమ్మద్ తన టీచర్ పై ప్రేమని ఇష్టాన్ని పెంచుకున్నట్లు వెల్లడించాడు. చివరకు తన ప్రేమ గురించి తన టీచర్ కు దైర్యం చేసి చెప్పేశాడు. అయితే ఇద్దరి మధ్య వయసు 26 సంవత్సరాలు తేడా ఉండడంతో జమీనా ప్రేమని రిజెక్ట్ చేసింది. అయినప్పటికీ డానియల్ తన పట్టుదలను వదలలేదు. ఆమె ఇంటి అడ్రస్ కనుక్కున్నాడు. జమీలాను పలకరించాడు. ఇద్దరు కాంటాక్ట్స్ మార్చుకున్నారు. మాటలు కలిసి నెమ్మదిగా ఇద్దరి మధ్య దూరం తిరిగింది. పరిచయం ప్రేమగా మారింది.

ఇవి కూడా చదవండి

చివరికి జమీలా అహ్మద్ అలీ ప్రేమని అంగీకరించింది. వీరి ప్రేమకు పెద్దల అంగీకారం దొరికింది. 2019లోనే వాళ్లిద్దరూ పెళ్లి చేసుకుందామని అనుకున్నారు. అదే సమయంలో కరోనా వైరస్ విజృంభించింది. దీంతో పెళ్లి వాయిదా పడింది. 2020 లో పెళ్లి చేసుకోవాలనుకున్నా.. పరిస్థితుల కారణంగా చివరికి 21 వ తేదీ నవంబర్ 2021 న జమీలా అహ్మద్ అలీ పెళ్లి చేసుకుని ఒక్కటయ్యారు. పెళ్లిని ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్ మధ్య సింపుల్ గా చేసుకున్నారు. ప్రస్తుతం అహ్మద్ అలీ వాటర్ ప్లాంట్ లో పనిచేస్తున్నాడు. జమిలా టీచర్ గా పనిచేస్తుంది.

వాస్తవానికి 2007 లో మొదటి భర్త నుంచి విడాకులు తీసుకుంది జమిలా.. వయసు అనేది జస్ట్ నంబర్ మాత్రమే అని.. తమ మధ్య ఉన్న 26 సంవత్సరాల తేడా తమ ప్రేమకు అడ్డంకి కాలేదని ఈ జంట చెబుతోంది. అంతేకాదు తనను ప్రేమిస్తున్నానని అలీ అతని కుటుంబం నుంచి దాచలేదని.. దైర్యంగా నిలబడి తన మనసు గెలుచుకున్నాడని.. తమది దేవుడు కలిసిన జంట అంటూ చెబుతోంది జమిలా..

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..