Dog Driving: ఈ మందుబాబు తెలివే తెలివి.. పోలీసుల నుంచి తప్పించుకోవడానికి డ్రైవింగ్‌ సీటులో కుక్కని కూర్చోబెట్టిన వైనం..

ఓ రహదారి వద్ద ట్రాఫిక్‌ పోలీసులు ప్రతి వాహనదారుడిని చెక్‌ చేస్తున్నారు. ఆ క్రమంలో ఓ కారు వారి వద్దకు వస్తుండటం గమనించి ఆపారు. కారు ఆపినా ఎవరూ బయటకు రాకపోవడంతో పోలీసులకి ఒక్కసారిగా ఏం జరుగుతుందా అని అనుమానం కలిగింది.

Dog Driving: ఈ మందుబాబు తెలివే తెలివి.. పోలీసుల నుంచి తప్పించుకోవడానికి డ్రైవింగ్‌ సీటులో కుక్కని కూర్చోబెట్టిన వైనం..
Drunken Driver Swaps Seats
Follow us
Surya Kala

|

Updated on: May 19, 2023 | 8:21 AM

పోలీసుల నుంచి తప్పించుకునేందుకు దొంగలు రకరకాల ఎత్తుగడలు వేస్తుంటారు. అంతేగాని జంతువులపై నెపం నెట్టడం అరుదు. అయితే యూఎస్‌లోని కొలరాడోలో రోడ్డుపై కారు ఓ మాదిరి స్పీడ్‌తో వస్తుంది. ఇంతతో ఓ రహదారి వద్ద ట్రాఫిక్‌ పోలీసులు ప్రతి వాహనదారుడిని చెక్‌ చేస్తున్నారు. ఆ క్రమంలో ఓ కారు వారి వద్దకు వస్తుండటం గమనించి ఆపారు. కారు ఆపినా ఎవరూ బయటకు రాకపోవడంతో పోలీసులకి ఒక్కసారిగా ఏం జరుగుతుందా అని అనుమానం కలిగింది. దీంతో పోలీసులు కారు వద్దకు నేరుగా వచ్చి చూడగా.. డ్రైవింగ్‌ సీటులో కూర్చొన్న కుక్కను చూసి ఒక్కసారిగా పోలీసులకు ఊపిరి ఆగినంత పనిఅయ్యింది. ఈ వింత ఘటన అమెరికాలో చోటు చేసుకుంది.

ఈ కారుని కుక్కే డ్రైవ్‌ చేసుకుని వచ్చిందా అంటూ అయోమయంగా చూస్తుండిపోయారు. కాసేపటికి వారు కారుని పరికించి చూడగా ప్యాసింజర్‌ సీటులో ఉన్న ఓ వ్యక్తిని గమనించి వెంటనే ఆరా తీశారు. ఐతే ఆ వ్యక్తి తాను డ్రైవ్‌ చేయలేదని బుకాయించాడు. ఆ తర్వాత పోలీసలు తమదైన శైలిలో అడగ్గా సీట్లు మార్చుకున్నట్లు తెలిపాడు. అతను డ్రింక్‌ చేయడంతో పోలీసుల అరెస్టు నుంచి తప్పించుకోవాలని చూశాడు. ఐతే పోలీసులు అతడినికి కేవలం 20 గజాల దూరంలోనే అదుపులోకి తీసుకున్నారు. ఆ కుక్కను జంతువుల సంరక్షణాధికారి పర్యవేక్షణలో ఉంచి సదరు వ్యక్తిని అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. తాను పట్టుబడకుండా ఉండేందుకే కుక్కను డ్రైవింగ్‌ సీట్‌లో కూర్చోబెట్టినట్టు పోలీసులు ఎదుట అంగీకరించాడు.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..