Rojakorn Nanon: అలసట, బలహీనత తగ్గడానికి మొసలి రక్తం తాగుతున్న వ్యక్తి.. కాస్ట్ తెలిస్తే షాక్..
52 ఏళ్ల రోజాకార్న్ తన రోజును మొసలి రక్తంతో మొదలు పెడతాడు. అతను ప్రతిరోజూ ఒక గ్లాసు మొసలి రక్తం తాగుతాడు.. ఈ రక్తంలో థాయ్ స్పిరిట్ 'లావో ఖావో' కూడా మిళితమై ఉంటుంది. ఈ మొసలి రక్తాన్ని కేవలం ఉదయం మాత్రమే కాదు.. రాత్రి పడుకునే ముందు కూడా ఒక గ్లాసు మొసలి రక్తం తాగుతాడు. ఇలా తాగితేనే తనకు నిద్ర వస్తుందని చెబుతున్నాడు రోజాకార్న్ నానన్.
ప్రకృతిలో అనేక రకాల జీవులున్నాయి. కొన్ని సాధు జంతువులైతే.. మరికొన్ని రక్తం తాగుతూ జీవించే జీవులుంటాయి. రక్తం తాగుతూ జీవించే జీవులు ప్రపంచంలో చాలా ఉన్నాయి. ఇలాంటి వాటిల్లో బాగా ప్రాచుర్యంలో ఉన్న కథ రక్త పిశాచి. ఈ కథను తప్పనిసరిగా చాలామంది వినే ఉంటారు. అయితే ఈ రక్త పిశాచి మానవ రక్తాన్ని తాగుతాడని చెబుతారు. అనేక దేశాల్లో ప్రజలు రక్త పిశాచులు ఉన్నారని.. అది నిజమని భావిస్తారు. అయితే రక్త పిశాచి ఉన్నట్లు చాలా మంది ప్రజలు విశ్వసించరు. ఇవన్నీ కథలు అవ్వొచ్చు.. అయితే ఇప్పటికీ ప్రపంచంలో జంతువుల రక్తం తాగేవాళ్ళు కొందరు ఉన్నారు. చాలా దేశాల్లో ప్రజలు పాముల రక్తాన్ని తాగుతారు. అయితే ఎవరైనా మొసలి వంటి భయంకరమైన జంతువు రక్తాన్ని తాగుతారని మీరు ఎప్పుడైనా వినలేదా? కనీసం ఊహించారా..? ఈ రోజుల్లో అలాంటి ఒక వ్యక్తి నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాడు. తాను మొసలి రక్తం తాగడానికి గల కారణం విన్నవారిని ఆశ్చర్యపరిచింది.
ఈ వ్యక్తి పేరు రోజాకార్న్ నానన్. థాయ్‌లాండ్‌లోని ట్రాంగ్ ప్రావిన్స్ నివాసి. సాధారణంగా ప్రజలు తమ రోజును కాఫీ, టీ, పాలు లేదా జ్యూస్ వంటి వాటితో ప్రారంభిస్తారు. అయితే ఆడిటీ సెంట్రల్ అనే వెబ్‌సైట్ నివేదిక ప్రకారం, 52 ఏళ్ల రోజాకార్న్ తన రోజును మొసలి రక్తంతో మొదలు పెడతాడు. అతను ప్రతిరోజూ ఒక గ్లాసు మొసలి రక్తం తాగుతాడు.. ఈ రక్తంలో థాయ్ స్పిరిట్ ‘లావో ఖావో’ కూడా మిళితమై ఉంటుంది. ఈ మొసలి రక్తాన్ని కేవలం ఉదయం మాత్రమే కాదు.. రాత్రి పడుకునే ముందు కూడా ఒక గ్లాసు మొసలి రక్తం తాగుతాడు. ఇలా తాగితేనే తనకు నిద్ర వస్తుందని చెబుతున్నాడు రోజాకార్న్ నానన్.
మొసలి రక్తం తన శారీరక బలహీనతను, అలసటను పూర్తిగా పోగొట్టిందని వ్యాపారవేత్త రోజాకార్న్ అంటున్నారు. అంతకు ముందు రోజాకార్న్ కి బాగా అలసటగా అనిపించేదట. అయితే మొసలి రక్తం తాగడం మొదలు పెట్టిన తర్వాత శరీరంలో శక్తితో పాటు బలం కూడా వచ్చిందని చెప్పాడు. నివేదికల ప్రకారం, ఒక గ్లాస్ మొసలి బ్లడ్ కాక్‌టెయిల్ ధర దాదాపు రూ.800. దీనికి థాయ్‌లాండ్ అంతటా విపరీతమైన డిమాండ్ ఉంది. ఆ దేశ ప్రజలు పెంచడానికి కారణం ఇదే.
ఈ దేశంలో మొసలి మాంసాన్ని కూడా అమ్ముతారు. దీని ధర కిలో 500 రూపాయల కంటే ఎక్కువ. అంతే కాదు మొసలి పిత్తం కిలో రూ.75 వేలకు పైగానే విక్రయిస్తున్నారు. అంతే కాకుండా మొసళ్ల చర్మంతో లెదర్ సూట్లు, బెల్టులు మొదలైనవి తయారు చేస్తారు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..