AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వీడెవడండీ బాబూ.. ఒళ్లంతా తేనెటీగలతో తిరుగుతున్నాడు.. పైగా గుప్పింట్లో రాణి ఈగను దాచిపెట్టుకుని..

ఆ నొప్పి భరించటం కూడా చాలా కష్టం. కొన్ని కొన్ని సందర్బాల్లో ప్రాణాలు కూడా ప్రమాదం లేకపోలేదు. కానీ, వైరల్‌ అవుతున్న వీడియోలో మాత్రం యువకుడి ఎడమచేతిపై తేనెటీగలు తేనెతుట్టేనే ఏర్పాటు చేసుకున్నాయి. పైగా అతను  పిడికిలి బిగించి నడుస్తుంటే.. మిగిలిన తేనెటీగలు అతని చేతికి వేలాడుతున్నాయి.

వీడెవడండీ బాబూ.. ఒళ్లంతా తేనెటీగలతో తిరుగుతున్నాడు.. పైగా గుప్పింట్లో రాణి ఈగను దాచిపెట్టుకుని..
Swarm Of Bees
Jyothi Gadda
|

Updated on: May 19, 2023 | 11:18 AM

Share

ఎన్నో అరుదైన, అద్భుతమైన దృశ్యాలు కళ్ల ముందుకు వస్తుంటాయి. కానీ, అది నిజమో కాదో ఇప్పటికీ నమ్మడం కష్టంగానే ఉంటుంది. అలాంటి మరో వీడియో వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. వీడియో చూస్తే మీరు మీ కళ్ళను మీరే నమ్మలేరు. ఈ వీడియో మీకు ఖచ్చితంగా చెమటలు పట్టిస్తుంది. ఈ వీడియోలో, ఒక బాలుడు తన ఎడమ చేతిపై ఏకంగా తేనేటీగల పుట్టనే మోస్తూ తిరుగుతున్నాడు. అతడు ఎక్కడికి వెళితే.. అక్కడికి తనతో పాటుగా ఆ తేనెటీగలు కూడా మోసుకుంటూ వీధిలో నడుస్తున్న దృశ్యాలు నెటిజన్లు షాక్‌ అయ్యేలా చేస్తున్నాయి.

ఈ ఘటన అమెరికాలో జరిగినట్లు సమాచారం. మీడియా కథనాల ప్రకారం, ఈ బాలుడు తేనెటీగల పెంపకంతో తేనె వ్యాపారం చేస్తున్నాడు. అయితే తేనెటీగలు అతనికి ఇలా అంటుకోవడం నిజంగా షాకింగ్‌గా ఉంది. ఎందుకంటే తేనెటీగలు ఎవరినీ వదలవు. ఎవరు ఎలా దొరికినా దాడి చేసిన కుట్టి చంపేస్తాయి. ఆ నొప్పి భరించటం కూడా చాలా కష్టం. కొన్ని కొన్ని సందర్బాల్లో ప్రాణాలు కూడా ప్రమాదం లేకపోలేదు. కానీ, వైరల్‌ అవుతున్న వీడియోలో మాత్రం యువకుడి ఎడమచేతిపై తేనెటీగలు తేనెతుట్టేనే ఏర్పాటు చేసుకున్నాయి. పైగా అతను  పిడికిలి బిగించి నడుస్తుంటే.. మిగిలిన తేనెటీగలు అతని చేతికి వేలాడుతున్నాయి. అయితే దీని వెనుక కారణం ఎంటన్నది బయటపడటంతో అందరూ షాక్ అయ్యారు. ఈ తేనెటీగలు అతడు చేసిన ఒక గొప్ప ఉపాయంతో ఇలా అతని కంట్రోల్లోకి వచ్చాయని అంటున్నారు.

ఇవి కూడా చదవండి

మీడియా నివేదికల ప్రకారం, బాలుడు తన పిడికిలిలో రాణి తేనెటీగను పట్టుకున్నాడు. అందుకే తేనెటీగలు అతనిపై దాడి చేసి ఉండవచ్చు. కానీ, తేనెటీగలు అతనికి చిన్నపాటి హాని కూడా కలిగించలేదు. అందుకు కారణం ఈ యువకుడు తేనెటీగల పెంపకం చేస్తుండటం వల్ల కావచ్చు. ప్రస్తుతం అతని వీడియో వైరల్‌గా మారగా, దానికి భిన్నమైన స్పందనలు లభిస్తున్నాయి.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ లింక్ క్లిక్ చేయండి..

ఇండోర్ వన్డే తర్వాత రో-కో మాయం..గుండెలు బాదుకుంటున్న ఫ్యాన్స్
ఇండోర్ వన్డే తర్వాత రో-కో మాయం..గుండెలు బాదుకుంటున్న ఫ్యాన్స్
విశాఖలో మరో కీలక కార్యాలయం.. కేంద్ర హోం శాఖ నిర్ణయంతో..
విశాఖలో మరో కీలక కార్యాలయం.. కేంద్ర హోం శాఖ నిర్ణయంతో..
రవితేజ, కృష్ణవంశీ ఎందుకు మాట్లాడుకోరు.! ఓపెన్‌గా చెప్పేసిన టాలీవు
రవితేజ, కృష్ణవంశీ ఎందుకు మాట్లాడుకోరు.! ఓపెన్‌గా చెప్పేసిన టాలీవు
నాగోరే నాగోబా.. నేడే మహాపూజ.. అర్థరాత్రి నుండి జాతర షురూ..
నాగోరే నాగోబా.. నేడే మహాపూజ.. అర్థరాత్రి నుండి జాతర షురూ..
ఉదయాన్నే ఖాళీ కడుపుతో బొప్పాయి తింటున్నారా? ఏం జరుగుతుందంటే..
ఉదయాన్నే ఖాళీ కడుపుతో బొప్పాయి తింటున్నారా? ఏం జరుగుతుందంటే..
సూపర్ సిక్స్‌లో భారత్ దూకుడు.. ఖాతాలోకి మరో ట్రోఫీ..?
సూపర్ సిక్స్‌లో భారత్ దూకుడు.. ఖాతాలోకి మరో ట్రోఫీ..?
ఎవరైనా చనిపోయినప్పుడు తెల్లటి దుస్తులు ఎందుకు ధరిస్తారో తెలుసా?
ఎవరైనా చనిపోయినప్పుడు తెల్లటి దుస్తులు ఎందుకు ధరిస్తారో తెలుసా?
అఖిల్ మూవీపై ముందే ఫిక్సయ్యా.. వినాయక్ చెప్పినా వినలేదు.!
అఖిల్ మూవీపై ముందే ఫిక్సయ్యా.. వినాయక్ చెప్పినా వినలేదు.!
విషాదం నుంచి విజయం వైపు.. గృహిణి నుంచి సక్సెస్ ఫుల్ బిజినెస్..
విషాదం నుంచి విజయం వైపు.. గృహిణి నుంచి సక్సెస్ ఫుల్ బిజినెస్..
హైదరాబాద్ వాసులకు శుభవార్త.. మెట్రో సర్వీసులపై కీలక అప్డేట్
హైదరాబాద్ వాసులకు శుభవార్త.. మెట్రో సర్వీసులపై కీలక అప్డేట్