Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గోవాలో మద్యం ఎందుకంత చీప్..? ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఇంత వ్యత్యాసం ఎందుకో తెలుసా..?

ఇది దేశీయ పర్యాటకులకే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఉండే టూరిస్టులకు కూడా ఫేవరెట్ డెస్టినేషన్. పోర్చుగీసు నిర్మాణాలు, పచ్చని అడవులు, జలపాతాలు, ప్రకృతి అందాలు కూడా పర్యాటకుల్ని కనువిందు చేస్తాయి. గోవా దాని సహజ సౌందర్యంతో పాటు మరొక విషయానికి ప్రసిద్ధి చెందింది. అది బీర్. గోవాలో బీరు చౌకగా లభిస్తుంది.

గోవాలో మద్యం ఎందుకంత చీప్..?  ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఇంత వ్యత్యాసం ఎందుకో తెలుసా..?
Follow us
Jyothi Gadda

|

Updated on: May 19, 2023 | 9:01 AM

గోవా అంటే అందమైన బీచ్ లు, అద్భుతమైన రైడ్ లు, కాసినోలు, పార్టీలు, ఎంజాయ్‌మెంట్‌ వాతావరణం గుర్తుకువస్తుంది. అంతేకాదు..ఏడాది పొడవునా సందర్శించగల అద్భుత పర్యాటక ప్రాంతాల్లో గోవా ఒకటి. ఇది దేశీయ పర్యాటకులకే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఉండే టూరిస్టులకు కూడా ఫేవరెట్ డెస్టినేషన్. పోర్చుగీసు నిర్మాణాలు, పచ్చని అడవులు, జలపాతాలు, ప్రకృతి అందాలు కూడా పర్యాటకుల్ని కనువిందు చేస్తాయి. అందుకే చాలా మంది ప్రజలు గోవా బీచ్‌లలో షికారు చేయడానికి ఇష్టపడతారు. చాలా మంది తమ స్నేహితులతో కలిసి గోవాకు విహారయాత్రకు వెళ్తుంటారు. గోవా దాని సహజ సౌందర్యంతో పాటు మరొక విషయానికి ప్రసిద్ధి చెందింది. అది బీర్. గోవాలో బీరు చౌకగా లభిస్తుందని, తప్పని సరిగా గోవాకు వెళ్లాలని చాలా మంది అనుకుంటుంటారు. ఇక్కడ బీర్ మంచి నీళ్ల ధరతో సమానం అని అనుకుంటారు. బీర్ కోసమే చాలా మంది గోవాకు వెళ్తుంటారు. అయితే, గోవాలో లభించే బీర్ ఎందుకు అంత చౌకగా లభిస్తుందో ఎప్పుడైనా ఆలోచించిరా..?

దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే గోవాలో బీర్ల ధర తక్కువ. ఢిల్లీతో పోలిస్తే బీర్ల ధరలు చాలా తక్కువ. సాధారణంగా బీర్ ధర బ్రాండ్, నాణ్యతపై ఆధారపడి ఉంటుంది. తేడా బ్రాండ్‌ను బట్టి మారుతుంది. కానీ, ఇక్కడ సగటు బీర్ ధరలు చాలా తక్కువగా ఉంటాయి.అయితే ఇక్కడ బీర్ ధరలు సగటున 25 శాతం తక్కువగా ఉంటాయి. అందుకే గోవాకు వచ్చి బీరు తాగేందుకు ఇష్టపడుతున్నారు. ఉదాహరణకు, ఢిల్లీలో రూ. 130 ఉన్న కొన్ని బ్రాండ్‌ల బీర్‌ను గోవాలో రూ. 90-100కి కొనుగోలు చేయవచ్చు. బాటిల్ రకం, ప్యాకేజింగ్ ఆధారంగా ధర వ్యత్యాసం మారవచ్చు. గోవాలో బీర్ ఎంత చౌకగా ఉంటుందో ఇప్పుడు మీరు ఊహించవచ్చు.

గోవాలో బీర్ చౌకగా ఉండటానికి అనేక కారణాలు ఉన్నాయి. దీని వలన బీర్ ధరలు చాలా తక్కువగా ఉంటాయి. దీనికి ప్రధాన కారణం ఇక్కడి పన్నుల విధానం. గోవాలో పన్ను విధానం ప్రకారం మద్యంపై పన్ను చాలా తక్కువ. దీని కారణంగా ఇక్కడ బీరు ధర ఇతర రాష్ట్రాల కంటే చాలా తక్కువ. మన దేశంలో మద్యం జీఎస్టీ పరిధిలోకి రాదు. దీంతో మద్యం ధరలను నిర్ణయించడంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక పాత్ర పోషిస్తోంది. కాబట్టి అక్కడ బీరుపై పన్ను శాతం చాలా తక్కువ.

ఇవి కూడా చదవండి

ఇది కాకుండా, గోవాలో మద్యం అమ్మకానికి టెండర్ పొందడం ఏం కష్టమైన పని కాదు. అందుకే ఇక్కడ మద్యం షాపుల సంఖ్య చాలా ఎక్కువ. పోటీ కూడా చాలా ఎక్కువగా ఉన్నందున మద్యం ధర తక్కువగా ఉంటుంది. గోవాలో చాలా మద్యం దుకాణాలు ఉన్నాయి. మీకు కొన్ని మీటర్ల దూరంలో మద్యం దుకాణం కనిపిస్తుంది. దీని వల్ల మద్యం ధరలు కూడా తగ్గే అవకాశం ఉంది. పర్యాటకాన్ని ప్రోత్సహించడంలో బీర్ కూడా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. కాబట్టి ప్రజలు బీర్ కోసం గోవాను సందర్శిస్తారు. పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు రేట్లు పెద్దగా పెంచలేదు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే గోవాలో అనేక స్థానిక బ్రాండ్లు ఉన్నాయి, ఇవి సహజంగా మద్యం ధరలను తగ్గిస్తాయి. అలాగే మద్యానికి అవసరమైన ముడిసరుకు కూడా ఇక్కడ సులభంగా దొరుకుతుంది. దీంతో ఇతర రాష్ట్రాలతో పోలిస్తే గోవాలో ఆల్కహాల్ ఉత్పత్తి చౌకగా ఉంటుంది. అది కూడా ధరపై ప్రభావం చూపుతుంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ లింక్ పై క్లిక్ చేయండి..