- Telugu News Photo Gallery Inside Pele’s tomb in world’s tallest cemetery where fans can pay respects to Football icon who was laid to rest in gold coffin Telugu News
ఫుట్‌బాల్ కింగ్ కోసం బంగారు శవపేటిక.. మొత్తం 14 అంతస్తుల సమాధి గురించి ఆసక్తికర విషయాలు..
చెప్పులు లేని పేదరికం నుండి ఆధునిక చరిత్రలో గొప్ప, ప్రసిద్ధ అథ్లెట్లలో ఒకరిగా ఎదిగిన లెజెండరీ బ్రెజిలియన్ సాకర్ ప్లేయర్ పీలే 82 సంవత్సరాల వయస్సులో మరణించారు. మూడుసార్లు ప్రపంచకప్ గెలిచిన ఏకైక వ్యక్తిగా పీలే చరిత్ర పుట్టల్లోకి ఎక్కారు.
Updated on: May 18, 2023 | 2:17 PM

పీలే అసలు పేరు ఎడ్సన్ అరంటెస్ డో నాసిమెంటో. 1956లో శాంటోస్ క్లబ్‌లో చేరారు. ఈ చిన్న తీరప్రాంత క్లబ్‌ను ఫుట్‌బాల్‌లో అత్యంత ప్రసిద్ధ పేర్లలో ఒకటిగా మార్చారు. అయితే, ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శ్మశానవాటికగా గుర్తింపుపొందింది పీలే సమాధి.

డిసెంబర్ 29, 2022న క్యాన్సర్‌తో పోరాడి ఓడిపోయిన ఫుట్‌బాల్ కింగ్ పీలే కన్నుమూశారు. శాంటాస్‌లోని నెక్రోపోలిస్ ఎక్యుమెనియా మెమోరియల్ స్మశానవాటిక ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శ్మశానవాటికగా గుర్తింపు పొందింది. పీలే సమాధిని ప్రజల సందర్శనార్థం తెరిచారు.

14 అంతస్తుల సమాధి ఇప్పుడు ప్రజల కోసం తెరవబడింది. అక్కడ తై పీలేకు నివాళులు అర్పించేందుకు అభిమానులు ఎగబడుతున్నారు. రోజుకు 60 మంది సందర్శకులను ఇక్కడకు అనుమతిస్తారు.

ఈ ఏడాది జనవరి 3 నుంచి శాంటోస్‌లోని నెక్రోపోల్ ఎక్యుమెనియా మెమోరియల్ స్మశానవాటికలో పీలే అంత్యక్రియలు నిర్వహించారు.

పీలే సమాధి చుట్టూ ఫుట్‌బాల్ మైదానం ఉంది. సమాధి ప్రవేశద్వారం వద్ద పీలే రెండు పెద్ద బంగారు విగ్రహాలు ఉన్నాయి.

పీలే బంగారు శవపేటికలో పడి ఉన్నాడు. అతని సమాధిపై ఒక పెద్ద శిలువ ఉంది.

పీలే సమాధిలోని గది చుట్టూ దేవార్‌లో అనేక చిత్రాలు ఉన్నాయి. ఈ చిత్రాలు స్టేడియంలో అభిమానుల ఆటను చూస్తున్నాయి.

అభిమానుల సందర్శనార్థం పీలే సమాధిని తెరిచినప్పుడు పీలే కుమారుడు ఎడ్సన్ నాసిమెంటో కూడా అక్కడే ఉన్నాడు. పెల్ కొడుకు మొత్తం ప్రదేశాన్ని సందర్శించాడు.





























