AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇదేం కర్మరా బాబు.. పెళ్లి పీటల మీదే కొట్టుకున్న వధూవరులు.. కోపంతో విషంతాగిన వరుడు మృతి.. వధువు పరిస్థితి సీరియస్‌..

ఈ నేపథ్యంలో వారిద్దరికీ పెళ్లి జరుగుతుండగా ఇలా జరిగిందని చెప్పారు. మరోవైపు ఈ సమాచారం అందుకున్న పోలీసులు ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వధూవరులిద్దరూ విషం తాగారనే విషయం గమనించిన బంధువులు వెంటనే వారిద్దరినీ స్థానిక ఆస్పత్రికి తరలించారు.

ఇదేం కర్మరా బాబు.. పెళ్లి పీటల మీదే కొట్టుకున్న వధూవరులు.. కోపంతో విషంతాగిన వరుడు మృతి.. వధువు పరిస్థితి సీరియస్‌..
Bride Cancels Wedding
Jyothi Gadda
|

Updated on: May 19, 2023 | 7:35 AM

Share

వివాహ వేడుకలో వధూవరులు విషం తాగారు. వారి పెళ్లికి నిమిషాల ముందు వాగ్వాదం జరిగినట్లు సమాచారం. ఘటన అనంతరం ఇద్దరినీ ఆస్పత్రికి తరలించారు. 21 ఏళ్ల వరుడు మృతి చెందగా, 20 ఏళ్ల వధువు పరిస్థితి విషమంగా ఉందని పోలీసు అధికారులు తెలిపారు. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ఈ సంఘటన జరిగింది. కనాడియా ప్రాంతంలోని ఆర్యసమాజ్ ఆలయంలో 21 ఏళ్ల యువకుడికి 20 ఏళ్ల యువతితో మంగళవారం పెళ్లి జరుగుతున్నది. అయితే, పెళ్లి తంతు కార్యక్రమాలు జరుగుతుండగానే, వధూవరుల మధ్య వాగ్వాదం జరిగింది. ఈ నేపథ్యంలో తొలుత పెళ్లికుమారుడు విషం తాగాడు. విషయం పెళ్లికుమార్తెకు చెప్పాడు. దీంతో ఆమె కూడా విషం తాగింది.

వధూవరులిద్దరూ విషం తాగారనే విషయం గమనించిన బంధువులు వెంటనే వారిద్దరినీ స్థానిక ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే వరుడు చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. వధువు పరిస్థితి సీరియస్‌గా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

కాగా, తనను పెళ్లి చేసుకోవాలంటూ పెళ్లికుమార్తె గత కొన్ని రోజులుగా తమ కుమారుడిపై ఒత్తిడి చేస్తుందని వరుడి కుటుంబ సభ్యులు విలపిస్తూ పోలీసులకు వివరించారు.. అయితే ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నానని, రెండేళ్లు ఆగమని అతడు చెప్పగా ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసిందన్నారు. ఈ నేపథ్యంలో వారిద్దరికీ పెళ్లి జరుగుతుండగా ఇలా జరిగిందని చెప్పారు. మరోవైపు ఈ సమాచారం అందుకున్న పోలీసులు ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ లింక్ క్లిక్ చేయండి..

Follow Us
తల లేకపోయినా బతికేస్తాయి! బొద్దింకల గురించి ఈ ఆసక్తికర విషయాలు
తల లేకపోయినా బతికేస్తాయి! బొద్దింకల గురించి ఈ ఆసక్తికర విషయాలు
లక్ష్మీదేవి కటాక్షంతో ఈ రెండు రాశులవారి జీవితం మారబోతోంది
లక్ష్మీదేవి కటాక్షంతో ఈ రెండు రాశులవారి జీవితం మారబోతోంది
మొక్కజొన్న వీరికి విషంతో సమానం.. తింటే ఈ సమస్యలు..
మొక్కజొన్న వీరికి విషంతో సమానం.. తింటే ఈ సమస్యలు..
వాస్తు టిప్స్ : ఇంట్లో ఈ నాలుగు వస్తువులు ఉంటే మీ పంట పండినట్లే!
వాస్తు టిప్స్ : ఇంట్లో ఈ నాలుగు వస్తువులు ఉంటే మీ పంట పండినట్లే!
దేశవ్యాప్తంగా వరుసగా 5 రోజుల పాటు బ్యాంకులు బంద్
దేశవ్యాప్తంగా వరుసగా 5 రోజుల పాటు బ్యాంకులు బంద్
ఏఎన్నార్ మాట కోసం ఆరోజున.. కృష్ణంరాజు..
ఏఎన్నార్ మాట కోసం ఆరోజున.. కృష్ణంరాజు..
APPSC ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ (FSO) పోస్టులకు నోటిఫికేషన్.. లింక్
APPSC ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ (FSO) పోస్టులకు నోటిఫికేషన్.. లింక్
స్వాతి నక్షత్రంలోకి శుక్రుడు.. వీరికి పట్టింది బంగారమే
స్వాతి నక్షత్రంలోకి శుక్రుడు.. వీరికి పట్టింది బంగారమే
ఎంజీఎంలో భద్రత కరువు..! స్లాబ్ పెచ్చులు ఊడిపడి ముగ్గురికి గాయాలు
ఎంజీఎంలో భద్రత కరువు..! స్లాబ్ పెచ్చులు ఊడిపడి ముగ్గురికి గాయాలు
'అహంకారంతో విర్రవీగితే గొప్పవారు కాలేదు.. వినయమే అలంకారం' నీతికథ
'అహంకారంతో విర్రవీగితే గొప్పవారు కాలేదు.. వినయమే అలంకారం' నీతికథ