- Telugu News Photo Gallery World photos Highest honour for PM Modi conferred by Fiji and Papua New Guinea
PM Modi: ప్రధాని మోడీకి అరుదైన గౌరవం.. అత్యున్నత పురస్కారాలు ప్రదానం చేసిన ఫిజీ, పపువా న్యూ గినియా..
జపాన్ హిరోషిమాలో జరిగిన గ్రూప్ ఆఫ్ సెవెన్ (జి7) సమ్మిట్‌ను ముగించుకుని.. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పాపువా న్యూ గినియాలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. మూడు దేశాల పర్యటనలో భాగంగా ప్రధాని మోడీ ముందుగా పాపువా న్యూ గినియాలో బిజిబిజీగా ఉన్నారు. ఆదివారం రాత్రి ఆ దేశానికి చేరుకున్న ప్రధాని మోడీ.. సోమవారం ఆదేశ అగ్రనేతలతో ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించారు.
Updated on: May 22, 2023 | 11:47 AM

జపాన్ హిరోషిమాలో జరిగిన గ్రూప్ ఆఫ్ సెవెన్ (జి7) సమ్మిట్‌ను ముగించుకుని.. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పాపువా న్యూ గినియాలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. మూడు దేశాల పర్యటనలో భాగంగా ప్రధాని మోడీ ముందుగా పాపువా న్యూ గినియాలో బిజిబిజీగా ఉన్నారు. ఆదివారం రాత్రి ఆ దేశానికి చేరుకున్న ప్రధాని మోడీ.. సోమవారం ఆదేశ అగ్రనేతలతో ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించారు. ఈ పర్యటనలో ప్రధాని మోడీకి రెండు దేశాలకు సంబంధించిన అత్యున్నత పురస్కారాలు లభించాయి.

పాపువా న్యూ గినియా పర్యటనలో ఉన్న ప్రధాని మోడీకి ఫిజీ అత్యున్నత గౌరవ పురస్కారం లభించింది.. ప్రధాని మోడీ ప్రపంచ నాయకత్వాన్ని గుర్తించి ఫిజీ-కంపానియన్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ఫిజీ-అత్యున్నత గౌరవాన్ని ఫిజీ ప్రధాని సితివేణి రబుకా ప్రదానం చేశారు. ఫిజియేతరులు అతి కొద్దిమంది మాత్రమే ఈ పురస్కరాన్ని అందుకోవడం విశేషం. కాగా.. వారిలో ప్రధాని మోడీ ఉన్నారు.

ఇదే పర్యటనలో ప్రధాని మోడీకి మరో పురస్కారం కూడా లభించింది. పాపువా న్యూ గినియా కూడా అత్యున్నత పురస్కారంతో ప్రధాని మోడీని గౌరవించింది. దీంతో భారతదేశానికి అపూర్వమైన గౌరవం లభించినట్లయింది.

పసిఫిక్ ద్వీప దేశాల ఐక్యతకు, గ్లోబల్ సౌత్ అభివృద్ధికి భారత నాయకత్వం వహించినందుకు గాను పాపువా న్యూ గినియా పిఎం మోడీకి అత్యున్నత పురస్కారం లోగోహు ను ప్రదానం చేసింది. చాలా తక్కువ మంది ఈ అవార్డును అందుకున్నారు. వారిలో బిల్ క్లింటన్, ప్రధాని మోడీ లాంటి వారున్నారు.

ఫిజీ అత్యున్నత పురస్కారాన్ని ప్రధాని మోదీకి అందించిన వెంటనే.. పాపువా న్యూ గినియా కూడా తమ దేశ అత్యున్నత పురస్కారంతో ప్రధాని మోడీని గౌరవించింది.

పాపువా న్యూ గినియాలో ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం ఉదయం టోక్ పిసిన్ భాషలో తమిళ క్లాసిక్ ‘తిరుక్కురల్’ను విడుదల చేశారు. టోక్ పిసిన్ భాషలో తిరుక్కురల్ పుస్తకాన్ని విడుదల చేసిన ఘనత పీఎం జేమ్స్ మరాపేకు దక్కిందని పీఎం నరేంద్ర మోదీ సోషల్ మీడియా ద్వారా తెలిపారు.
