- Telugu News Photo Gallery World photos Dinosaurs how was the time when t rex used to rule the earth in telugu
T Rex Dinosaur: 68 మిలియన్ ఏళ్ల క్రితం భూమి మీద 170 మిలియన్ డైనోసార్‌లు.. పరిశోధనలో షాకింగ్ విషయాలు
మానవ నాగరికత ఆదిమ మానవులతో ప్రారంభమైంది. అయితే శాస్త్రవేత్తల ప్రకారం భూమిపై ఒకప్పుడు డైనోసార్‌లు అంటే రాక్షస బల్లులు జీవించేవి. డైనోసార్ల జాతి ఇప్పటికీ, ఎప్పటికీ ఓ వీడని మిస్టరీయే.. ఇవి ఎలా జన్మించాయో, ఎలా అంతమయ్యాయో తెలియజెప్పేందుకు స్పష్టమైన ఆధారాలు లేవు
Updated on: May 23, 2023 | 11:37 AM

మానవ నాగరికత ఆదిమ మానవులతో ప్రారంభమైంది. అయితే ఆదిమ మానవుల కంటే ముందు భూమి మీద ఎవరు నివసించారని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? శాస్త్రవేత్తల ప్రకారం భూమిపై ఒకప్పుడు డైనోసార్‌లు అంటే రాక్షస బల్లులు జీవించేవి. ముఖ్యంగా టైరన్నోసారస్ రెక్స్ లాంగ్ నెక్ డైనోసార్‌లు కొన్ని మిలియన్ సంవత్సరాల క్రితం.. జీవించేవని.. వీటి సంఖ్య కొన్ని కోట్ల వరకూ ఉంటుందని వెల్లడించారు.

డైనోసార్ల జాతి ఇప్పటికీ, ఎప్పటికీ ఓ వీడని మిస్టరీయే.. ఇవి ఎలా జన్మించాయో, ఎలా అంతమయ్యాయో తెలియజెప్పేందుకు స్పష్టమైన ఆధారాలు లేవు. అయితే.. శాస్త్రవేత్తల ప్రకారం.. సుమారు 68 మిలియన్ సంవత్సరాల క్రితం భూమి మీద భారీ డైనోసార్‌లు జీవించేవి. ఆ సమయంలో భూమిపై ఉన్న టైరన్నోసారస్ రెక్స్ లాంగ్ నెక్ డైనోసార్‌ల సంఖ్య దాదాపు 170 కోట్ల వరకు ఉంటుందని తాజా పరిశోధనలో వెల్లడైంది. అంటే ప్రస్తుతం భారతదేశంలో ఉన్న జనాభా కంటే ఎక్కువ. ప్రస్తుతం భారతదేశ జనాభా 140 కోట్లన్న సంగతి తెలిసిందే.

జర్మనీకి చెందిన జోహన్నెస్ గుటెన్‌బర్గ్ యూనివర్శిటీ ఆఫ్ మెయిన్జ్‌కు చెందిన ఎవా గ్రెబెలర్ ప్రకారం.. డైనోసార్‌ల సగటు బరువు, జనాభా సాంద్రత, గుడ్ల సంఖ్య, సగటు జీవితం మొదలైన వాటిపై వివిధ పరిశోధనల ఆధారంగా రూపొందించిన నమూనా నుండి ఈ సంఖ్యను రూపొందించారు.

విశేషమేమిటంటే టైరన్నోసారస్ రెక్స్ లాంగ్ నెక్ డైనోసార్‌లోని ఒక్కో తరంలో దాదాపు 19 వేల డైనోసార్‌లు ఉన్నట్లు పరిశోధనలో వెల్లడైంది. సుమారు 2.5 మిలియన్ సంవత్సరాలు భూమిపై జీవించిన ఈ జీవిలో సుమారు 90 వేల తరాలు ఉన్నాయి.

2022 నవంబర్‌లో లభించిన భూమిపై అతిపెద్ద T రెక్స్ శిలాజ స్కాటీ కంటే 70% పెద్దదని ఒక పరిశోధన వెల్లడించింది. వాటి వేగం గురించి కూడా ఒక ముఖ్యమైన పరిశోధన జరిగింది. వాటి వేగం గంటకు 5 కి.మీ వరకు ఉండేదని తెలిపారు. జెయింట్ డైనోసార్‌లు కూడా పక్షుల్లా ఎగరగలవని కొన్ని పరిశోధనల్లో పేర్కొన్నారు. ప్రస్తుతం వీటిపై నిరంతరం పరిశోధనలు సాగుతున్నాయి.
