ప్రధాని మోడీ మాట్లాడుతూ.. భారతీయులను ఆస్ట్రేలియా వాసులు అక్కున చేర్చుకున్నారని.. ఇరు దేశాలకు విడదీయలేని అనుబంధం ఉందంటూ పేర్కొన్నారు. భారత్, ఆస్ట్రేలియా బంధాలను 3 సీలు ప్రభావితం చేస్తాయని.. అవి కామన్వెల్త్, క్రికెట్, కర్రీ అన్నారు. ఆ తర్వాత 3 డీలు డెమోక్రసీ, డయాస్పోరా, దోస్తీలు ఉన్నాయని.. ఇరు దేశాల మధ్య యోగా బంధం కూడా ఉందన్నారు.