డ్రాగన్‌తో కలిసి భారత్‌పై బంగ్లాదేశ్ భారీ కుట్ర!

TV9 Telugu

16 December 2024

చైనా నుండి చెంగ్డు జె-10సి మల్టీరోల్ ఫైటర్ జెట్‌ను కొనుగోలు చేయాలని యోచిస్తోన్న బంగ్లాదేశ్ వైమానిక దళం.

ఈ ఒప్పందం పూర్తయితే పాకిస్థాన్ తర్వాత అధునాతన యుద్ధ విమానాన్ని సైన్యంలో చేర్చుకున్న రెండో దక్షిణాసియా దేశంగా నిలవనున్న బంగ్లాదేశ్.

తమ వైమానిక దళాన్ని ఆధునికంగా, శక్తివంతంగా మార్చేందుకు సిద్ధమవుతున్న ప్రకటించిన బంగ్లాదేశ్‌ ఎయిర్ చీఫ్ మార్షల్ షేక్ అబ్దుల్ హన్నన్.

బంగ్లాదేశ్ వైమానిక దళం మొదటి దశలో 16 J-10C విమానాలను కొనుగోలు. ప్రస్తుతం పాత ఎఫ్-7 యుద్ధ విమానాలు. ఆగస్టులో ఈ జెట్‌లను అందించిన చైనా.

J-10C నాల్గవ తరం మల్టీరోల్ ఫైటర్ జెట్, మొదటిసారిగా 2017లో ప్రదర్శన. యాక్టివ్ ఎలక్ట్రానిక్ స్కానింగ్ అర్రే (AESA) రాడార్‌తో అమర్చిన ఈ జెట్ ఖచ్చితమైన లక్ష్యాన్ని గుర్తిస్తుంది.

ఈ విమానంలో చైనా తయారు చేసిన WS-10C ఇంజిన్‌. PL-15 క్షిపణి అమర్చిన ఈ జెట్‌ పరిధి 200-300 కిలోమీటర్లు.

అమెరికన్ F-16కి సమానమైనదిగా భావిస్తున్న ఈ జెట్ రూపకల్పనలో ఇజ్రాయెల్ రద్దు చేసిన లావి ప్రాజెక్ట్‌లోని అంశాలు.

పాకిస్తాన్ ఇప్పటికే 25 J-10C ఫైటర్ జెట్లను కొనుగోలు చేసింది. దీని ఉద్దేశ్యం భారతదేశం యొక్క రాఫెల్ విమానాలను ఎదుర్కోవడమే.