14 December 2024
Pic credit - Social Media
TV9 Telugu
బాబా వంగా’గా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన అంధ ఆధ్యాత్మికవేత్త. ఆమె చెప్పిన జోస్యాలు నిజమవుతాయనే భావన ఉంది.
కొన్ని రోజుల్లో 2024కు గుడ్ బై చెప్పేసి కొత్త సంవత్సరం 2025కి వెల్కం చెప్పడానికి రెడీ అవుతున్న నేపధ్యంలో బాబా వంగా జోస్యం మళ్ళీ వార్తల్లో నిలిచింది.
పశ్చిమ దేశాల్లో యుద్ధం మొదలవుతుందని.. ఈ యుద్ధం పెను విధ్వంసాన్ని కలిగిస్తుందని బాబా వంగా అంచనా వేసింది.
సిరియా పతనం జరిగిన వెంటనే పశ్చిమ, తూర్పు దేశాల మధ్య భారీ యుద్ధం ఉంజరిగే అవకాశం ఉందని.. ఇది మూడవ ప్రపంచ యుద్ధంగా మారుతుందని తెలిపింది.
అంతేకాదు కొత్త ఏడాది 2025లో మానవులకు గ్రహాంతర వాసులకు మధ్య సంబంధం ఏర్పడవచ్చని.. ఇది ప్రపంచాన్ని సంక్షోభం దిశా నేడుతుందని బాబా వంగా అంచనావేసింది.
బాబా వంగా అంచనా నిజమేమో.. గ్రహాంతర వాసులకు సంబంధించిన అన్ని ఫైల్స్ ని విడుదల చేస్తానని డోనాల్డ్ ట్రంప్ చేసిన వాగ్దానాన్ని గుర్తు చేసుకుంటున్నారు.
2025 చివరి నాటికి టెలీపతి అందుబాటులో వస్తుందని.. దీంతో మనుషుల మెదడు నుంచి మెదడు మధ్య సంభాషణ చేస్తారని బాబా వంగా అంచనా వేసింది.
ఈ ఆవిష్కరణ విప్లవాత్మక మార్పులలో భాగంగా టెలీపతితో పాటు నానోటెక్నాలజీలో పురోగతి ఉంటుందని పేర్కొంది. ఈ సాంకేతికతలను దుర్వినియోగం కలిగే ప్రమాదాల గురించి ఆమె హెచ్చరించింది.