AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rs 2000 Note Withdrawn: నేటి నుంచి రూ. 2000 నోటు మార్పిడి.. 55 వేల బ్యాంక్‌ బ్రాంచీలు రెడీ.. రోజుకు ఎన్ని మార్చుకోవచ్చంటే..

అసలు కథ ఇవాళ్టీ నుంచే మొదలుకానుంది. 2వేల నోటుపై ప్రకటన చేసి నాలుగు రోజులైనా.. డిపాజిట్లు మొదలయ్యేది మాత్రం మరికాసేపట్లోనే. ఇదే ఇప్పుడు అసలు కథ. ముందు జాగ్రత్తగానే ఆర్‌బీఐ కూడా అలర్ట్‌ అయింది. గతంలో ఉన్న అనుభవాలను మళ్లీ పునారావృతం కాకుండా ప్రత్యేక ప్రకటన చేసింది. నో

Rs 2000 Note Withdrawn: నేటి నుంచి రూ. 2000 నోటు మార్పిడి.. 55 వేల బ్యాంక్‌ బ్రాంచీలు రెడీ.. రోజుకు ఎన్ని మార్చుకోవచ్చంటే..
Rs 2000 Note Withdrawn
Surya Kala
|

Updated on: May 23, 2023 | 6:49 AM

Share

బ్యాంక్‌లకు నేటి నుంచి మళ్లీ టెస్టింగ్‌ టైమ్‌. మరో మారు 2016 నాటి సిట్యూవేషన్‌ వస్తుందా? ఎందు కంటే.. ఇవాళ్టీ నుంచే బ్యాంకుల్లో మొదలయ్యే 2000 నోటు మార్పిడి అవస్తలు తలుచుకుంటనే గుబులు రేపుతోంది. ఒక వైపు మండుతున్న ఎండలు.. మరో వైపు బారులు తీరే క్యూ లైన్లను తలుసుకుంటేనే వణుకు పుడుతోంది. ఇంతకు బ్యాంకులు ఎలాంటి కండిషన్లు పెడుతాయి? బ్యాంకుల్లో ఎలాంటి ఏర్పాట్లు ఉంటాయి? అయితే.. RBI గవర్నర్‌ శక్తికాంత్‌ దాస్‌ మాత్రం ఎలాంటి భరోసా ఇచ్చారు?

ఇక అసలు కథ ఇవాళ్టీ నుంచే మొదలుకానుంది. 2వేల నోటుపై ప్రకటన చేసి నాలుగు రోజులైనా.. డిపాజిట్లు మొదలయ్యేది మాత్రం మరికాసేపట్లోనే. ఇదే ఇప్పుడు అసలు కథ. ముందు జాగ్రత్తగానే ఆర్‌బీఐ కూడా అలర్ట్‌ అయింది. గతంలో ఉన్న అనుభవాలను మళ్లీ పునారావృతం కాకుండా ప్రత్యేక ప్రకటన చేసింది. నోట్ల మార్పిడికి తగిన ఏర్పాట్లు చేసుకోవాలని బ్యాంకులకు మార్గదర్శకాలు కూడా జారీ చేసింది.

దేశ వ్యాప్తంగా ఉన్న లక్షా 55 వేల బ్యాంక్‌ బ్రాంచీలకు ఇది క్రూషియల్‌ టైమ్‌. ఒక్క సారిగా వచ్చి పడే ఖాతాదారులను ఎలా అదుపు చేయాలన్న ప్రశ్న బ్యాంక్‌లను వేధిస్తోంది. ఆర్బీఐ గవర్నర్‌ మాత్రం.. నోట్ల మార్పిడి సమయంలో ప్రజలు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా ఆర్‌బీఐ చర్యలు తీసుకుంటుందన్నారు. మార్పిడి కోసం బ్యాంకుల వద్ద ప్రజలు హడావుడి పడాల్సిన అవసరం లేదు. నాలుగు నెలల సమయం ఉంది. ప్రజలు దీన్ని సీరియస్‌గా తీసుకొని నోట్లన్నీ వాపస్‌ చేస్తారనే ఉద్దేశంతోనే అంత సమయం ఇచ్చింది ఆర్‌బీఐ. కొందరు వ్యాపారులు కొంత కాలం నుంచే 2,000 నోట్లను తిరస్కరిస్తున్నారు. ఈ సమస్య ఉపసంహరణ ప్రకటన తర్వాత మరింత ఎక్కువయింది.

ఇవి కూడా చదవండి

ఒక్కోక్క కస్టమర్‌ ఎన్ని నోట్లు మార్చు కోవచ్చు? ఒక్క సారి క్యూ లైన్‌లో నిలబడి నోట్లు మార్చుకున్న వ్యక్తి మళ్లీ క్యూలైన్‌లో నిలబడి నోట్లు మార్చుకునే అవకాశం ఉందా? బ్యాంక్‌లు ఫాలో అవుతున్న నిబంధనలు ఏంటీ? కేవైసీ అవసరమా? పాన్‌ వివరాలు ఇవ్వాలా? అకౌంట్‌ లేక పోయినా నోట్లు మార్చుకునే ఛాన్స్‌ ఉందా? అన్న ప్రశ్నలు తలెత్తున్నాయి.

50,000 కంటే ఎక్కువ మొత్తంలో చేసే డిపాజిట్లకు పాన్‌ సమర్పించాలనే నిబంధన ఇప్పటికే ఉందని ఆర్‌బీఐ గుర్తు చేసింది. 2,000 నోట్ల డిపాజిట్లకూ వర్తిస్తుంది. ఇక 2,000 నోట్ల స్థానంలో ఇతర నోట్లను ఇచ్చేందుకు తగినంత క్యాష్‌ కూడా బ్యాంకుల్లో అందుబాటులో ఉంచారు. డిపాజిట్ల విషయంలో ఇప్పటికే అవలంబిస్తున్న నిబంధనలనే 2,000 నోట్ల డిపాజిట్లకూ వర్తింపజేయాలని ఆర్‌బీఐ బ్యాంకులకు సూచించింది. ఇక పెద్ద మొత్తంలో అయ్యే డిపాజిట్లను తనిఖీ చేసే అంశాన్ని ఆదాయ పన్ను శాఖ చూసుకుంటుంది.

నోట్ల మార్పిడి కోసం వచ్చే వారికి తగిన వసతులు కల్పించాలని బ్యాంకులకు ఆర్‌బీఐ సూచించింది. 2016 నోట్ల రద్దు సమయంలో సామాన్యులు భారీ లైన్లలో నిలబడి ఇబ్బందులు పడ్డారని గుర్తుచేసింది. కొంతమంది చనిపోయినట్లు కూడా వార్తలు వచ్చాయని తెలిపింది. ఈ నేపథ్యంలో నోట్ల మార్పిడి కోసం వచ్చేవారికి నీడ, నీళ్ల వంటి వసతులు అందుబాటులో ఉండేలా చూడాలని సూచించింది. ముఖ్యంగా వేసవి నేపథ్యంలో సామాన్యులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూసుకోవాలని తెలిపింది. అలాగే కౌంటర్లన్నింటిలో నోట్లను మార్చుకునే వెసులుబాటు కల్పించాలని సూచించింది.

ఒక అడుగు ముందుకేసిన బ్యాంకింగ్‌ సెక్టార్‌లో లీడర్‌.. ఎస్‌బీఐ మరింత క్లారిటీ ఇచ్చింది. 2వేల నోటును ఒక్కోసారి 20 వేల విలువ వరకు ఎలాంటి పత్రాలు నింపకుండా, గుర్తింపు కార్డులు చూపకుండా నేరుగా బ్యాంకు శాఖల్లో ప్రజలు మార్చుకోవచ్చని ప్రకటించింది.

ఒక వ్యక్తి ఎన్నిసార్లైనా 2,000 నోట్లను బ్యాంకులో మార్చుకోవచ్చు. అయితే ఒక లావాదేవీలో 10 నోట్లకు మించి మార్చుకునే వీలుండదు. ఇక గరిష్ట పరిమితిపై ఆర్‌బీఐ కూడా ఎక్కడా క్లారిటీ ఇవ్వలేదు. ఖాతా ఉన్న బ్యాంకు శాఖలో, ఇతర శాఖల్లో కేవైసీ, ఇతర నిబంధనల మేరకు.. ఎంతమేర గరిష్ఠంగా క్యాష్‌ డిపాజిట్‌కు అనుమతి ఉంటే, అంత విలువ వరకు 2000 నోట్లను ఖాతాలో వేసుకోవచ్చు. 2వేల నోట్లను ఉసంహరిస్తున్నారే గానీ.. లీగల్‌ టెండర్‌ కొనసాగుతుందని ఆర్‌బీఐ తెలిపింది.

ఆభరణాల దుకాణాల్లో 50వేల వరకు క్యాష్‌ చెల్లింపులకు గుర్తింపు కార్డులు ఏమీ సమర్పించనక్కర్లేదు. పేరు, ఫోన్‌ నంబరు ఇస్తే సరిపోతుంది. 2 లక్షల వరకు కూడా నగదుతో చెల్లించొచ్చు. అయితే పాన్‌కార్డ్‌, ఆధార్‌ వంటి ధ్రువీకరణ పత్రాలు తీసుకుంటున్నట్లు బులియన్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు స్పష్టం చేస్తున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..