Whale Vomit: రూ. 30 కోట్లు విలువ చేసే తిమింగలం వాంతి పట్టివేత..దీనికి ఎందుకంత డిమాండ్ అంటే
మైనంలా ఉండే ఈ పదార్థం తిమింగలాల జీర్ణవ్యవస్థలో సహజసిద్ధంగా తయారవుతుంది. చాలా మంది దీన్ని తిమింగలం వాంతి అంటారు. దీనికి ఘాటైన మట్టి వాసనతో పాటు సముద్రపు వాసన సైతం ఉంటుంది. స్వచ్ఛత, నాణ్యతను బట్టి ఈ అంబర్‌గ్రిస్ కిలో 1 కోటి నుంచి రూ.2 కోట్ల వరకు ఉంటుందని అంచనా.
తమిళనాడులో వేల్ అంబర్‌గ్రీస్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. టుటికోరిన్ బీచ్ వద్ద డీఆర్‌ఐ నలుగురు స్మగ్లర్లను అరెస్ట్ చేసింది. వారి నుంచి 18.1 కిలోల బరువున్న తిమింగలం వాంతిని స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. బహిరంగ మార్కెట్‌లో దాని విలువ 31.6 కోట్ల రూపాయల కంటే ఎక్కువ ఉంటుందని డీఆర్‌ఐ పేర్కొంది. అంబర్‌గ్రీస్‌ను ఫ్లోటింగ్ గోల్డ్‌గా పిలుస్తుంటారు. దీన్ని సుగంధ పరిమళాల తయారీలో వినియోగిస్తుంటారు. దాంతో మార్కెట్‌లో భారీగా డిమాండ్ ఉంటుంది. సముద్రంలో తేలియాడే అంబర్‌గ్రిస్ అప్పుడప్పుడు కొందరికి దొరుకుతుంది.
ఎందుకంత డిమాండ్..?
మైనంలా ఉండే ఈ పదార్థం తిమింగలాల జీర్ణవ్యవస్థలో సహజసిద్ధంగా తయారవుతుంది. చాలా మంది దీన్ని తిమింగలం వాంతి అంటారు. దీనికి ఘాటైన మట్టి వాసనతో పాటు సముద్రపు వాసన సైతం ఉంటుంది. స్వచ్ఛత, నాణ్యతను బట్టి ఈ అంబర్‌గ్రిస్ కిలో 1 కోటి నుంచి రూ.2 కోట్ల వరకు ఉంటుందని అంచనా. అత్యంత అరుదుగా లభిస్తుండడంతో విపరీతమైన డిమాండ్ ఉంటుంది. అంతర్జాతీయ మార్కెట్‌లో భారీ ధర పలుకుతుందని అధికారులు పేర్కొంటున్నారు.
సెంట్లు, పర్ఫ్యూమ్‌లు, ఇతర సుగంధ పరిమళాల తయారీలో అంబర్‌గ్రిస్‌ను ఎక్కువగా వినియోగిస్తుంటారు. ప్రాచీన సంస్కృతిలో దీన్ని ఆహారంలో రుచి కోసం కూడా వాడేవారట. మద్యం, పొగాకుతో కలిపి కూడా ఉపయోగించిన దాఖలాలు ఉన్నాయి.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..