AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

G 20 Meet: మళ్ళీ అక్కసు వెల్లడించిన చైనా.. ఇదీ మా భూభాగమే.. భారత్ స్ట్రాంగ్ కౌంటర్.. మీట్‌కు టర్కీ, సౌదీ అరేబియాలు దూరం..

చైనా చేసిన వ్యాఖ్యలను భారత్ తీవ్రంగా ఖండించింది. భారత్ తన సొంత భూభాగంలో సమావేశాలు నిర్వహించుకోవడం ఉచితం అంటూ.. చైనా ప్రతినిధి చేసిన వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేసింది. తాము చైనాతో సాధారణ సంబంధాలు నెలకొనాలంటే ఇరుదేశాల సరిహద్దుల్లో శాంతి, ప్రశాంతత అవసరమని పేర్కొంది.

G 20 Meet: మళ్ళీ అక్కసు వెల్లడించిన చైనా.. ఇదీ మా భూభాగమే.. భారత్ స్ట్రాంగ్ కౌంటర్.. మీట్‌కు టర్కీ, సౌదీ అరేబియాలు దూరం..
G 20 In Srinagar
Surya Kala
|

Updated on: May 21, 2023 | 11:10 AM

Share

భారత్ పై మరోసారి తన అక్కసుని వెళ్ళగక్కింది చైనా. జమ్మూకశ్మీర్‌ విషయంలో డ్రాగన్ కంట్రీ మళ్ళీ నోరు పారేసుకుంది. జమ్మూకశ్మీర్‌లో పర్యాటక రంగంపై జీ20 సమావేశాన్ని నిర్వహించడాన్ని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి వాంగ్ వెన్బిన్ వ్యతిరేకిస్తూ వ్యాఖ్యలు చేశారు.  వివాదాస్పద ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన సమావేశాలను తమ దేశం హాజరుకాదంటూ పేర్కొన్నారు. చైనా చేసిన వ్యాఖ్యలను భారత్ తీవ్రంగా ఖండించింది. భారత్ తన సొంత భూభాగంలో సమావేశాలు నిర్వహించుకోవడం ఉచితం అంటూ.. చైనా ప్రతినిధి చేసిన వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేసింది. తాము చైనాతో సాధారణ సంబంధాలు నెలకొనాలంటే ఇరుదేశాల సరిహద్దుల్లో శాంతి, ప్రశాంతత అవసరమని పేర్కొంది.

G20 థర్డ్ టూరిజం వర్కింగ్ గ్రూప్ సమావేశం ఈ నెల 22-24 తేదీలలో శ్రీనగర్‌లో జరగనుంది. ఇప్పటికే పటిష్ట భద్రత చర్యలను చేపట్టారు. భద్రతాదళాలు విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. స్థానిక షేర్‌ ఏ కశ్మీర్‌ ఇంటర్నేషనల్‌ కన్వెన్షన్‌ సెంటరులో ఈ సదస్సు జరగనున్నట్లు అధికారులు తెలిపారు. 2019లో జమ్మూకశ్మీర్ ప్రత్యేక హోదాను రద్దు చేసి, రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించారు.  ఆ తర్వాత జమ్మూ కాశ్మీర్‌లో జరుగుతున్న ఇది మొదటి అతిపెద్ద అంతర్జాతీయ కార్యక్రమం కావడంతో కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఘనంగా ఏర్పాట్లు చేస్తోంది.

శ్రీనగర్‌లో జరిగే ఈ సమావేశానికి జి20 దేశాల నుంచి దాదాపు 60 మంది ప్రతినిధులు హాజరుకానున్నారు. ముందుగా ఈ సమావేశానికి 100 మంది ప్రతినిధులు హాజరవుతారని భావించారు. ఈ సమావేశానికి దూరంగా ఉండాలని టర్కీ, సౌదీ అరేబియా దేశాలు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకూ ఈ రెండు దేశాలు నమోదు చేసుకోలేదని అధికారులు చెప్పారు.

ఇవి కూడా చదవండి

భద్రతాపరంగా సున్నితమైన ఈ ప్రాంతంలో ఎటువంటి అవాంఛనీయ ఘటన చోటుచేసుకోకుండా అధికారులు కట్టుదిట్ట ఏర్పాట్లు చేస్తున్నారు. మెరైన్ కమాండోలు, నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్సీ, ఆర్పీఎఫ్‌ సిబ్బంది, ఇతర పారామిలటరీ బలగాలు ఇప్పటికే మోహరించారు. భూభాగం నుండి గగనతల భద్రతలో భాగంగా ఈ ప్రాంతంలో మోహరించారు.

G20 సమావేశానికి వేదిక అయిన షేర్-ఎ-కశ్మీర్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ (SKICC) చుట్టూ ఉన్న దాల్‌ సరస్సు పరిసర ప్రాంతాలను మెరైన్‌ కమాండో బృందాలు జల్లెడ పట్టారు. పరిసర ప్రాంతాలను అదుపులోకి  తీసుకున్నారు. శికారాల్లో తిరుగుతూ చుట్టూ నిఘా పెంచారు. NSG కమాండోలు పోలీసులు, పారామిలటరీ బలగాలతో కలిసి ఏరియా డామినేషన్ కసరత్తులు నిర్వహిస్తున్నారు. గురువారం లాల్‌చౌక్‌లో ఎన్‌ఎస్‌జీ సోదాలు నిర్వహించింది. పారామిలటరీ దళాలు హౌస్‌బోట్‌లలోకి ప్రవేశించి అణువణువు గాలించాయి

స్థానిక పోలీసులు డ్రోన్‌ వ్యతిరేక వ్యవస్థలను ఏర్పాటు చేస్తున్నారు. సదస్సు ముగిసేదాకా శ్రీనగర్‌ నగరాన్ని ‘నో డ్రోన్‌’జోనుగా ప్రకటిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. సదస్సుకు వచ్చే విదేశీ ప్రతినిధులు తిరుగాడే మార్గాలను అందంగా అలంకరించారు. అనుమానాస్పద అంతర్జాతీయ ఫోన్‌కాల్స్‌, వదంతుల విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిందిగా కశ్మీర్‌ పోలీసులు సూచనలు జారీ చేశారు.

కాశ్మీర్  సంస్కృతి , పురాతన సంప్రదాయాన్ని ప్రపంచానికి తెలియజేసే విధంగా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. శ్రీనగర్‌లో జరిగే G20 ఈవెంట్ కాశ్మీర్ ప్రకృతి సౌందర్యాన్ని..  పర్యాటక సామర్థ్యాన్ని ప్రదర్శించడానికి వేదికగా మారుస్తున్నారు. అంతేకాదు జమ్మూకశ్మీర్ భారత దేశంలో అంతర్భాగమని ప్రపంచానికి సందేశాన్ని పంపడానికి కూడా ఈ సదస్సు వేదిక కానుందని అధికారులు అంటున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..