కుమార్తెను 17 సార్లు కత్తితో పొడిచి చంపిన తండ్రి.. భార్య, ముగ్గురు కుమారులపై కూడా..! ఎందుకో తెలుసా..

ఇంట్లో ఉక్కపోతగా ఉందని ఇంటి మేడ మీద నిద్రపోదామన్నందుకు ఆ భర్తకు కోసం కట్టలు తెంచుకొచ్చింది. అంతే కట్టుకున్న భార్యపై కత్తితో దాడి చేశాడు. అడ్డొచ్చిన కూతురిని 17 సార్లు దారుణంగా పొడిచి చంపేశాడు. ఈ షాకింగ్‌ ఘటన గుజరాత్‌లోని సూరత్‌ జిల్లాలో జరిగింది. కడోదర జీఐడీసీ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

కుమార్తెను 17 సార్లు కత్తితో పొడిచి చంపిన తండ్రి.. భార్య, ముగ్గురు కుమారులపై కూడా..! ఎందుకో తెలుసా..
Man Stabs Daughter To Death
Follow us
Srilakshmi C

|

Updated on: May 21, 2023 | 9:05 AM

ఇంట్లో ఉక్కపోతగా ఉందని ఇంటి మేడ మీద నిద్రపోదామన్నందుకు ఆ భర్తకు కోసం కట్టలు తెంచుకొచ్చింది. అంతే కట్టుకున్న భార్యపై కత్తితో దాడి చేశాడు. అడ్డొచ్చిన కూతురిని 17 సార్లు దారుణంగా పొడిచి చంపేశాడు. ఈ షాకింగ్‌ ఘటన గుజరాత్‌లోని సూరత్‌ జిల్లాలో జరిగింది. కడోదర జీఐడీసీ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

గుజరాత్‌లోని సూరత్‌ జిల్లా కడోదరలో సత్యంనగర్ ప్రాంతంలో రామానుజ్‌ మహదేవ్‌ సాహు, రేఖాదేవి (40) కాపురం ఉంటున్నారు. రామానుజ్‌ స్థానికంగా మిల్లులో పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఈ దంపతులకు సూరజ్ (16), ధీరజ్ (14), విశాల్ (12) అనే ముగ్గురు కుమారులు, చాంద్‌కుమారి (19) అనే ఓ కుమార్తె ఉన్నారు. వేసవి కాలం కావడంతో ఇంట్లో వేడిగా ఉందని ఇంటి మేడపై పడుకుందామని గురువారం రాత్రి రామానుజ్‌ను అతడి భార్య రేఖాదేవి అడిగింది. ఆ సమయంలో వారిద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. భార్యతో గొడవ జరిగిన తర్వాత రామానుజ్‌ ఇంట్లో నుంచి బయటికి వెళ్లిపోయాడు. కొద్ది సేపటి తర్వాత పదునైన కత్తితో తిరిగి వచ్చి చంపేస్తానంటూ రేఖాదేవిపై దాడికి యత్నించాడు. అదే సమయంలో తల్లిని కాపాడేందుకు కుమార్తె చాంద్‌కుమారి అడ్డు వెళ్లింది. దీంతో ఆగ్రహానికి గురైన రామానుజ్‌ కూతురిని 17 సార్లు పొడిచాడు. దీంతో చాంద్‌కుమారి అక్కడికక్కడే మృతి చెందింది.

భర్తను చూసి భయపడిన రేఖాదేవి ఇంటిపైకి చేరుకుంది. తండ్రి దాడిలో ముగ్గురు కుమారులు సూరజ్‌, ధీరజ్‌, విశాల్‌ కూడా గాయపడ్డారు. రామానుజ్‌ అక్కడికి కూడా వెళ్లి ఆమెపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. రక్షించేందుకు వచ్చిన ముగ్గురు కుమారులు సూరజ్, ధీరజ్, విశాల్ కూడా గాయపడ్డారు. భార్యాపిల్లలపై దారుణానికి పాల్పడిన నిందితుడు అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడు. గాయపడిన వారిని ఇరుగుపొరుగు ఆసుపత్రిలో చేర్పించారు. నిందితుడిని పోలీసులు అరెస్టు చేసి జైలుకు తరలించారు. తన భార్యపై అనుమానంతోనే ఈ దాడికి పాల్పడినట్లు రామానుజ్‌ పోలీసులకు తెలిపాడు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.