ఆమెకు 28, ఆయనకు 60.. లేటు వయసులో ఘాటు ప్రేమ! నా భార్య కనిపించడం లేదంటూ భర్త ఫిర్యాదు

కాస్త లేటైన పర్లేదు అనుకున్నారేమో.. తమ ప్రేమను గెలిపించుకోవడానికి ఓ జంట నానాపాట్లు పడ్డాడు. కూతురు వయసున్న మహిళతో ప్రేమ వ్యవహారం నడపడమేకాకుండా ఏకంగా ఇంట్లో నుంచి పారిపోయారు. తన భార్య కనిపించడం లేదంటూ..

ఆమెకు 28, ఆయనకు 60.. లేటు వయసులో ఘాటు ప్రేమ! నా భార్య కనిపించడం లేదంటూ భర్త ఫిర్యాదు
60 Year Old Man Married 28 Year Old Woman
Follow us
Srilakshmi C

|

Updated on: May 19, 2023 | 6:35 PM

కాస్త లేటైన పర్లేదు అనుకున్నారేమో.. తమ ప్రేమను గెలిపించుకోవడానికి ఓ జంట నానాపాట్లు పడ్డాడు. కూతురు వయసున్న మహిళతో ప్రేమ వ్యవహారం నడపడమేకాకుండా ఏకంగా ఇంట్లో నుంచి పారిపోయారు. తన భార్య కనిపించడం లేదంటూ సదరు మహిళ భర్త లభోదిభోమంటూ పోలీసులను ఆశ్రయించడంతో వీరి ముదురు ప్రేమ బయటపడింది. ఉత్తరప్రదేశ్‌లో వెలుగు చూసిన ఈ విచిత్ర ఘటన స్థానికంగా చర్చణీయాంశంగా నిలిచింది. వివరాల్లోకెళ్తే..

ఉత్తర్​ప్రదేశ్ భదోహి జిల్లా బీహరోజ్‌పుర్‌కు చెందిన రామ్ యాదవ్​(60), అషర్ఫీ దేవి (28) ఇద్దరు గతకొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. రామ్​యాదవ్‌కు కుమారుడు, కోడలు, మనమడు, మనమరాలు ఉన్నారు. అషర్ఫీ దేవికి కూడా పెళ్లై భర్త, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఐతే గత కొంతకాలంగా రామ్​యాదవఖ, అషర్ఫీ గాఢంగా ప్రేమించుకుంటున్నారు. దీంతో ఓ రోజు ఇంట్లో నుంచి ఇద్దరూ పారిపోయారు. అషర్ఫీ దేవి భర్త కృష్ణ మూరత్ యాదవ్​తన భార్య కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారిని గాలించి పట్టుకున్న పోలీసులు స్టేషన్‌కు తీసుకొచ్చి ఇరు కుటుంబాల మధ్య రాజీ కుదిర్చే ప్రయత్నం చేశారు.

ఐతే అషర్ఫీ దేవి మాత్రం ప్రియుడు రామ్ యాదవ్‌నే వివాహం చేసుకుంటానని పట్టుబట్టింది. రామ్​యాదవ్‌ కొడుకు కోడలు ఎంత చెప్పిన పట్టించుకోకుండా ఆమెను వివాహం చేసుకుంటానని తెగేసి చెప్పాడు. దీంతో చేసేది లేక ఇరు కుటుంబాలు వారిని అక్కడే వదిలేసి వెళ్లిపోయారు. దీంతో రామ్ యాదవ్, అషర్ఫీ దేవిలకు పోలీసులే పెళ్లి చేశారు. వీరి ప్రేమ వ్యవహారం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.