లేడీ సింగం యాక్సిడెంట్‌ కేసులో కీలక మలుపు.. పోస్టుమార్టం రిపోర్టులో విస్తుపోయే వాస్తవాలు

అసోం లేడీ సింగం యాక్సిడెంట్‌ కేసు కీలక మలుపు తిరుగుతోంది. ఎస్సై జున్ముణి రభా పోస్టుమార్టం రిపోర్టు తాజాగా వెలువడింది. దీనిలో సంచలన వాస్తవాలు బయటపడ్డాయి. రోడ్డు ప్రమాదంలో ఆమె మృతి చెందినట్లు తెలుస్తున్నా ఆమె శరీరంపై..

లేడీ సింగం యాక్సిడెంట్‌ కేసులో కీలక మలుపు.. పోస్టుమార్టం రిపోర్టులో విస్తుపోయే వాస్తవాలు
SI Junmoni Rabha accident case
Follow us
Srilakshmi C

|

Updated on: May 19, 2023 | 5:14 PM

అసోం లేడీ సింగం యాక్సిడెంట్‌ కేసు కీలక మలుపు తిరుగుతోంది. ఎస్సై జున్ముణి రభా పోస్టుమార్టం రిపోర్టు తాజాగా వెలువడింది. దీనిలో సంచలన వాస్తవాలు బయటపడ్డాయి. రోడ్డు ప్రమాదంలో ఆమె మృతి చెందినట్లు తెలుస్తున్నా ఆమె శరీరంపై అనేక గాయాలు ఉన్నట్లు, శరీరంలో వివిధ భాగాల్లో ఎముకలు సైతం విరిగినట్లు పోస్టుమార్టం రిపోర్టు వెల్లడించింది.

మరణించిన 24 గంటలలోపు నిర్వహించిన పోస్టుమార్టంలో జున్మోయి శరీరంలోని రెండు వైపుల పక్కటెముకలు విరిగినట్లు గుర్తించారు. మరోవైపు బ్రెయిన్ హెమరేజ్, కార్డియాక్ అరెస్ట్ కారణంగా జున్ముణి రభా మరణించారని కూడా ఈ నివేదికలో వెల్లడైంది. అలాగే ఆమె రెండు మోకాళ్లు, కాళ్లు-చేతులు, మోచేతులపై కూడా గాయాల గుర్తులు కనిపించినట్లు తేలింది.

ఇప్పటికే పలు అనుమానాలు..

మోరికోలాంగ్ పోలీస్ అవుట్ పోస్ట్ ఎస్సైగా విధులు నిర్వర్తిస్తున్న జున్ముణి మంగళవారం అర్థరాత్రి వేళ రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఆమె మృతి చెందిన సమయంలో జున్ముణి రెడ్‌ కలర్‌ టీషర్టు, బ్లూ కలర్ ఫ్యాంటు, మల్టీకలర్‌ సాక్స్‌ ధరించి ఒంటరిగా కారులో వెళ్తుండగా నాగోన్‌ జిల్లాలో లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంపై ఇప్పటికే పలు అనుమానాలు రేకెత్తుతున్నాయి. పథకం ప్రకారంగానే ఈ హత్య జరిగిందని, ఆమెను పోలీసు శాఖలోని కొందరు అధికారులు చిత్రహింసలు పెట్టి చంపారంటూ ఓ కానిస్టేబుల్‌ విడుదల చేసిన ఆడియో క్లిప్‌ వైరల్‌గా మారింది. రాభా అనుమానాస్పద మరణంపై దర్యాప్తు చేస్తున్న సీఐడీ అధికారులు ఆ కానిస్టేబుల్‌ను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్లు సమాచారం.

ఇవి కూడా చదవండి

ప్రత్యక్ష సాక్షి కథనం ప్రకారం..

మరోవైపు ప్రత్యక్ష సాక్షి అయిన ప్రణబ్ దాస్‌ను మే 18 సాయంత్రం గౌహతి నుంచి నాగోన్ పోలీస్ స్టేషన్‌కు కట్టుదిట్టమైన భద్రత మధ్య తరలించారు. తాను గౌహతి నుంచి వస్తున్నానని, ఘటన జరిగిన సమయంలో ఘటనా స్థలంలో హైవేకి ఎడమ వైపున కారు ఆపిఉండటం చూశానన్నాడు. ప్రమాద సమయంలో వాహనం ట్రక్కును ఢీకొనలేదని, ఆ సమయంలో ఆమె కారు నిలిపే ఉందని చెప్పాడు. ఇంతలో అకస్మాత్తుగా ఎదురుగా వస్తున్న ట్రక్కు కారును ఢీకొట్టిందని దాస్ చెప్పారు. ఆ సమయంలో నల్ల జీన్స్ ధరించిన వ్యక్తి కారు నుంచి దిగడం చూశానని తెలిపాడు. ప్రమాదం జరిగిన కొన్ని నిమిషాల తర్వాత కూడా అక్కడే ఉన్నానని, ఇంతలో ఓ పోలీసు అధికారి వచ్చి తనను వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోవాలని చెప్పడంతో.. తాను వెళ్లిపోయానని తెలిపాడు. ఈ వ్యవహారమంతా చూస్తుంటే జున్ముణి ని ఎవరో పథకం ప్రకారంగానే హత్య చేసి ఉంటారనే వార్తలు వినిపిస్తున్నాయి.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.