Chandrayaan-3: మరో సంచలానానికి తెర తీసిన ఇస్రో… త్వరలోనే చంద్రయాన్-3 ప్రయోగం

ల్యాండర్, రోవర్‌తో కూడిన చంద్రయాన్-3 చంద్రుని ఉపరితలంపై సురక్షితమైన ల్యాండింగ్, రోవింగ్‌లో సామర్థ్యాన్ని ప్రదర్శించడం లక్ష్యంగా పెట్టుకుంది. శ్రీ హరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి లాంచ్ వెహికల్ మార్క్ III (ఎల్‌వీఎం-3) అని కూడా పిలిచే జియోసింక్రోనస్ శాటిలైట్ లాంచ్ వెహికల్ మార్క్ III (జీఎస్ఎల్‌వీ మార్క్ III) మీదుగా ఇస్రో చంద్రయాన్-3ని ప్రయోగిస్తుంది.

Chandrayaan-3: మరో సంచలానానికి తెర తీసిన ఇస్రో… త్వరలోనే చంద్రయాన్-3 ప్రయోగం
Chandrayaan
Follow us
Srinu

|

Updated on: May 19, 2023 | 6:30 PM

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో చంద్రయాన్-2కి ఫాలో ఆన్ మిషన్ అయిన చంద్రయాన్-3 ప్రయోగానికి సిద్ధమైంది. చంద్రయాన్-3 జూలై రెండో వారంలో ప్రయోగించనున్నట్లు ఇస్రో సీనియర్ అధికారి తెలిపారు. ల్యాండర్, రోవర్‌తో కూడిన చంద్రయాన్-3 చంద్రుని ఉపరితలంపై సురక్షితమైన ల్యాండింగ్, రోవింగ్‌లో సామర్థ్యాన్ని ప్రదర్శించడం లక్ష్యంగా పెట్టుకుంది. శ్రీ హరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి లాంచ్ వెహికల్ మార్క్ III (ఎల్‌వీఎం-3) అని కూడా పిలిచే జియోసింక్రోనస్ శాటిలైట్ లాంచ్ వెహికల్ మార్క్ III (జీఎస్ఎల్‌వీ మార్క్ III) మీదుగా ఇస్రో చంద్రయాన్-3ని ప్రయోగిస్తుంది. ఎల్‌వీఎం-3 ప్రొపల్షన్ మాడ్యూల్ చంద్రయాన్-3ని 100 కిలోమీటర్ల చంద్రుని కక్ష్యలోకి తీసుకెళ్తుందని ఇస్రో తన వెబ్‌సైట్‌లో పేర్కొంది. ఈ చంద్రయాన్-3 లక్ష్యాలు ఏంటో ఓ సారి తెలుసుకుందాం.

చంద్రయాన్-3 లక్ష్యాలు

చంద్రుని ఉపరితలంపై సురక్షితంగా ల్యాండ్ అవ్వడం. ఆ ప్రదేశంలో శాస్త్రీయ ప్రయోగాలు నిర్వహించడం. అలాగే చంద్రునిపై రోవర్ ల్యాండింగ్‌ను ప్రదర్శించడం చంద్రయాన్-3 ప్రధాన లక్ష్యాలు. అలాగే ల్యాండర్ సాఫ్ట్ ల్యాండింగ్ చేయడంతో పాటు రోవర్ చంద్రుని ఉపరితలంపై రసాయన విశ్లేషణను నిర్వహిస్తుంది. ఈ ల్యాండర్, రోవర్ మిషన్ జీవితం ఒక చంద్రుని రోజు అంటే మన లెక్క ప్రకారం 14 రోజులకు సమానం.

ప్రత్యేక పేలోడ్‌తో అమరిక

చంద్రయాన్-3 వ్యోమనౌక భూమికి సంబంధించిన స్పెక్ట్రో-పోలరిమెట్రిక్ సంతకాలను అధ్యయనం చేసే ప్రయోగాత్మక పరికరంతో అమర్చారు. వ్యక్తిగతంగా, యూనివర్శిటీ ఆఫ్ మేరీల్యాండ్, బాల్టిమోర్ కౌంటీ (యూఎంబీసీ) అబ్జర్వేటరీ ప్రకారం ఇది ఇన్‌కమింగ్ లైట్‌ను దాని రంగుల్లోకి విభజించడం ద్వారా కాంతి ధ్రువణాన్ని కొలుస్తుంది. అలాగే ప్రతి రంగు యొక్క ధ్రువణాన్ని విశ్లేషిస్తుంది. అలాగే ఇందులో అమర్చిన పేలోడ్‌ను స్పెక్ట్రో-పోలారిమెట్రీ ఆఫ్ హాబిటబుల్ ప్లానెట్ ఎర్త్ (షేప్) అంటారు.

ఇవి కూడా చదవండి

ల్యాండర్, రోవర్‌పై పేలోడ్ లక్ష్యాలు

చంద్రయాన్-3 ల్యాండర్‌పై చంద్రునికి సంబంధించిన ఉపరితల థర్మోఫిజికల్ ఎక్స్‌పెరిమెంట్ (సీహెచ్ఏఎస్టీఈ), లూనార్ సీస్మిక్ యాక్టివిటీ కోసం పరికరం (ఐఎల్ఎస్ఏ), లాంగ్‌ముయిర్ ప్రోబ్ (ఎల్పీ), రేడియో అనాటమీ ఆఫ్ మూన్ బౌండ్ హైపర్‌సెన్సిటివ్ అయానోస్పియర్, అట్మాస్పియర్ (రాంబా, ఆర్ట్రోరెలెక్ట్) వంటి పేలోడ్‌లు అమర్చారు.సీహెచ్ఏఎస్టీఈ చంద్ర ఉపరితలంపై ఉష్ణ వాహకత, ఉష్ణోగ్రతను కొలుస్తుంది. అలాగే ధ్రువ ప్రాంతం సమీపంలో ఐఎల్ఎస్ఏ ల్యాండింగ్ సైట్ చుట్టూ కంపనాలను కొలుస్తుంది. ఎల్పీ ప్లాస్మా సాంద్రతను అంచనా వేస్తుంది. అలాగే లేజర్ రెట్రోరెఫ్లెక్టర్ అర్రే రోవర్ నుంచి చంద్రుని లేజర్ శ్రేణి అధ్యయనాలను నిర్వహించడానికి నాసాకు ఉపయోగపడుతుంది. అలాగే చంద్రుని వ్యవస్థకు సంబంధించిన గతిశీలతను అర్థం చేసుకోవడంలో సహాయపడుతుంది. అలాగే రాంబా ల్యాండింగ్ సైట్‌లోని ప్లాస్మా సాంద్రతను, కాలానుగుణంగా ఎలా మారుతుందో కొలుస్తుంది. చంద్రయాన్-3  రోవర్‌లోని పేలోడ్‌లు ఆల్ఫా పార్టికల్ ఎక్స్-రే స్పెక్ట్రోమీటర్ (ఏపీఎక్స్ఎస్), లేజర్ ప్రేరిత బ్రేక్‌డౌన్ స్పెక్ట్రోస్కోప్ (ఎల్ఐబీఎస్) ఉన్నాయి. ఈ రెండు సాధనాలు ల్యాండింగ్ సైట్ చుట్టూ చంద్రుని ఉపరితలం మూలకూర్పును అంచనా వేస్తాయి.

ల్యాండర్ మాడ్యూల్, ప్రొపల్షన్ మాడ్యూల్ విధులు

చంద్రయాన్-3లో స్వదేశీ ల్యాండర్ మాడ్యూల్, ప్రొపల్షన్ మాడ్యూల్ కూడా ఉంటాయి. ప్రయోగ వాహనానికి చెందిన ఇంజెక్షన్ నుంచి చంద్రుని కక్ష్యలోకి చొప్పించే వరకూ ప్రొపల్షన్ మాడ్యూల్ ల్యాండర్ మాడ్యూల్‌ను తీసుకువెళుతుంది. దీని తరువాత ల్యాండర్ మాడ్యూల్ ప్రొపల్షన్ మాడ్యూల్ నుంచి అవుతుంది. షేప్ పేలోడ్ ప్రొపల్షన్ మాడ్యూల్‌పై అమర్చారు. ప్రొపల్షన్ మాడ్యూల్ నుంచి ల్యాండర్ మాడ్యూల్‌ను వేరు చేసిన తర్వాత ఇది పనిచేస్తుంది. 

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!