ISRO Recruitment 2023: బీఈ, బీటెక్‌ నిరుద్యోగులకు సదావకాశం.. ఇస్రోలో ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడుదల..

ఇండియన్‌ స్పేస్‌ రిసెర్చ్‌ ఆర్గనైజేషన్‌ (ఇస్రో) దేశవ్యాప్తంగా ఉన్న ఇస్రో కేంద్రాలు, యూనిట్‌లలో.. 65 సైంటిస్ట్/ ఇంజినీర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తూ ఇస్రో సెంట్రలైజ్డ్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డ్‌ (ఐసీఆర్‌బీ) నోటిఫికేషన్‌ విడుదల..

ISRO Recruitment 2023: బీఈ, బీటెక్‌ నిరుద్యోగులకు సదావకాశం.. ఇస్రోలో ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడుదల..
ISRO
Follow us

|

Updated on: May 05, 2023 | 12:17 PM

ఇండియన్‌ స్పేస్‌ రిసెర్చ్‌ ఆర్గనైజేషన్‌ (ఇస్రో) దేశవ్యాప్తంగా ఉన్న ఇస్రో కేంద్రాలు, యూనిట్‌లలో.. 65 సైంటిస్ట్/ ఇంజినీర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తూ ఇస్రో సెంట్రలైజ్డ్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డ్‌ (ఐసీఆర్‌బీ) నోటిఫికేషన్‌ విడుదల చేసింది. సివిల్, ఎలక్ట్రికల్, రిఫ్రిజిరేషన్ అండ్‌ ఎయిర్ కండిషనింగ్, ఆర్కిటెక్చర్ విభాగాల్లో ఈ ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు పోస్టును బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో కనీసం 60 శాతం మార్కులతో బీఈ, బీటెక్‌, బీఆర్క్‌ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత పొంది ఉండాలి. అభ్యర్ధుల వయసు మే 24, 2023వ తేదీ నాటికి 28 ఏళ్లకు మించకుండా ఉండాలి.

ఈ అర్హతలున్నవారు ఎవరైనా ఆన్‌లైన్‌ విధానంలో మే 24, 2023వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు సమయంలో ప్రతి ఒక్కరూ రూ.250లు అప్లికేషన్‌ ఫీజు చెల్లించవల్సి ఉంటుంది. అప్లికేషన్‌ ఫీజు చెల్లించడానికి తుది గడువు మే 26. రాతపరీక్ష, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ఎంపికైన వారికి నెలకు రూ.56,100ల వరకు జీతంగా చెల్లిస్తారు. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్ చేసుకోవచ్చు.

ఖాళీల వివరాలు..

  • సైంటిస్ట్/ ఇంజినీర్ ‘ఎస్‌సీ’ (సివిల్) పోస్టులు: 39
  • సైంటిస్ట్/ ఇంజినీర్ ‘ఎస్‌సీ ‘ (ఎలక్ట్రికల్) పోస్టులు: 14
  • సైంటిస్ట్/ ఇంజినీర్ ‘ఎస్‌సీ’ (రిఫ్రిజెరేషన్‌ అండ్‌ ఎయిర్ కండిషనింగ్) పోస్టులు: 9
  • సైంటిస్ట్/ ఇంజినీర్ ‘ఎస్‌సీ’ (ఆర్కిటెక్చర్) పోస్టులు: 1
  • సైంటిస్ట్/ ఇంజినీర్ ‘ఎస్‌సీ’ (సివిల్)- అటానమస్ బాడీ- పీఆర్‌ఎల్‌ పోస్టులు: 1
  • సైంటిస్ట్/ ఇంజినీర్ ‘ఎస్‌సీ’ (ఆర్కిటెక్చర్)- అటానమస్ బాడీ- పీఆర్‌ఎల్‌ పోస్టులు: 1

నోటిఫికేషన్‌ కోసం క్లిక్‌ చేయండి.

ఇవి కూడా చదవండి

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

Latest Articles
కార్పొరేట్ ప్రపంచంలో నయా ట్రెండ్‌.. ఆఫీస్‌ పికాకింగ్‌..
కార్పొరేట్ ప్రపంచంలో నయా ట్రెండ్‌.. ఆఫీస్‌ పికాకింగ్‌..
ఈ సమస్య ఉన్న చిన్నారుల్లో.. గుండెపోటు వచ్చే అవకాశం ఎక్కువ
ఈ సమస్య ఉన్న చిన్నారుల్లో.. గుండెపోటు వచ్చే అవకాశం ఎక్కువ
బజ్జీల బండికి కోట్లలో వ్యాపారం.. అసలు రహస్యం తెలుసా ??
బజ్జీల బండికి కోట్లలో వ్యాపారం.. అసలు రహస్యం తెలుసా ??
వారి వల్లే సిద్ధార్థ్‌తో నా నిశ్చితార్థం జరిగింది: అదితీ రావు
వారి వల్లే సిద్ధార్థ్‌తో నా నిశ్చితార్థం జరిగింది: అదితీ రావు
దాబా స్టైల్‌లో ఇలా చికెన్ కర్రీ చేయండి.. తిన్నవారు వావ్ అనాల్సింద
దాబా స్టైల్‌లో ఇలా చికెన్ కర్రీ చేయండి.. తిన్నవారు వావ్ అనాల్సింద
రాణించిన హార్దిక్.. కమిన్స్ మెరుపులు.. ముంబై టార్గెట్ ఎంతంటే?
రాణించిన హార్దిక్.. కమిన్స్ మెరుపులు.. ముంబై టార్గెట్ ఎంతంటే?
స్లీపర్ టిక్కెట్‌ని కొనుగోలు చేసి ఏసీ కోచ్‌లో ప్రయాణించవచ్చు
స్లీపర్ టిక్కెట్‌ని కొనుగోలు చేసి ఏసీ కోచ్‌లో ప్రయాణించవచ్చు
ఎన్టీఆర్ దేవర షూటింగ్‌లో అపశ్రుతి..ఆస్పత్రిలో 20 మంది ఆర్టిస్టులు
ఎన్టీఆర్ దేవర షూటింగ్‌లో అపశ్రుతి..ఆస్పత్రిలో 20 మంది ఆర్టిస్టులు
సమ్మర్ స్పెషల్ రెసిపీ.. మ్యాంగో మురబ్బా.. పిల్లలకు భలేగా ఇష్టం!
సమ్మర్ స్పెషల్ రెసిపీ.. మ్యాంగో మురబ్బా.. పిల్లలకు భలేగా ఇష్టం!
కేవలం రూ.20 ప్రీమియంతో రూ.2 లక్షల బీమా పాలసీ..మోడీ సర్కార్‌ బెస్ట
కేవలం రూ.20 ప్రీమియంతో రూ.2 లక్షల బీమా పాలసీ..మోడీ సర్కార్‌ బెస్ట