AP 10th Exam Result 2023 Date: పదో తరగతి విద్యార్ధులకు అలర్ట్.. ‘పది’ ఫలితాలు వచ్చే వారంలోనే!
ఆంధ్రప్రదేశ్ పదో తరగతి పబ్లిక్ పరీక్షలు-2023 ఫలితాలు వచ్చే వారమే విడుదలకానున్నాయి. టెన్త్ ఫలితాలను ఈ వారంలో విడుదల చేయబోమని, ముందుగా ప్రకటించిన మేరకు వచ్చే వారంలోనే విడుదల చేస్తామని ఏపీ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్..
ఆంధ్రప్రదేశ్ పదో తరగతి పబ్లిక్ పరీక్షలు-2023 ఫలితాలు వచ్చే వారమే విడుదలకానున్నాయి. టెన్త్ ఫలితాలను ఈ వారంలో విడుదల చేయబోమని, ముందుగా ప్రకటించిన మేరకు వచ్చే వారంలోనే విడుదల చేస్తామని ఏపీ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ అధికారులు తెలిపారు. ఈ మేరకు తెలియజేస్తూ శుక్రవారం ఓ ప్రకటనలో వెల్లడించారు. ఫలితాలు విడుదలైన తర్వాత పరీక్షలకు హాజరైన విద్యార్ధులు అధికారిక వెబ్‌సైట్ లో ఫలితాలను డౌన్‌లోడ్ చేసుకోవచ్చన్నారు. ఫలితాలు విడుదలైన వారం రోజుల తర్వాత మార్క్స్ మెమోలు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటాయని తెలిపారు.
కాగా ఏపీ పదో తరగతి పరీక్షల ఫలితాల ప్రకటన తేదీని బోర్డు ఇప్పటి వరకు అధికారికంగా ప్రకటించలేదు. ఏప్రిల్ 3 నుంచి 18వ తేదీ వరకు నిర్వహించిన సంగతి తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా 3,349 కేంద్రాల్లో 6.64లక్షల మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరయ్యారు. ఇప్పటికే ఇంటర్ ఫలితాలు కూడా విడుదలవడంతో ఎప్పుడెప్పుడు పదోతరగతి ఫలితాలు విడుదలవుతాయా అని విద్యార్ధులు ఎదురుచేస్తున్నారు.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.