Manipur Violence: మణిపూర్‌లో టెన్షన్‌.. టెన్షన్‌..! ఇంటర్‌నెట్‌ బంద్‌, 5 రోజులపాటు కర్ఫ్యూ

మణిపూర్‌లోని చురచంద్‌పూర్‌లో మే 3న నిర్వహించిన ర్యాలీ హింసాత్మకంగా మారింది. పరిస్థితిని అదుపు చేసేందుకు పోలీస్‌ బలగాలతోపాటు ఆర్మీ, అస్సాం రైఫిల్స్‌ భారీ సంఖ్యలో మోహరించాయి...

Manipur Violence: మణిపూర్‌లో టెన్షన్‌.. టెన్షన్‌..! ఇంటర్‌నెట్‌ బంద్‌, 5 రోజులపాటు కర్ఫ్యూ
Manipur Violence
Follow us
Srilakshmi C

|

Updated on: May 04, 2023 | 11:44 AM

మణిపూర్‌లోని చురచంద్‌పూర్‌లో మే 3న నిర్వహించిన ర్యాలీ హింసాత్మకంగా మారింది. పరిస్థితిని అదుపు చేసేందుకు పోలీస్‌ బలగాలతోపాటు ఆర్మీ, అస్సాం రైఫిల్స్‌ భారీ సంఖ్యలో మోహరించాయి.  హింసాత్మక ప్రాంతాల్లో ఫ్లాగ్‌మార్చ్‌లు నిర్వహిస్తున్నట్లు డిఫెన్స్‌ అధికారులు గురువారం మీడియాకు వెల్లడించారు. ఇప్పటి వరకు దాదాపు 4 వేల మందిని రక్షించి, సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు తెలిపారు.

కాగా ఇంఫాల్ లోయలో షెడ్యూల్డ్ తెగ (ఎస్టీ)లపై ఆధిపత్యం చెలాయించే గిరిజనేతరులపై నిరసన తెలుపుతూ చురాచంద్‌పూర్ జిల్లాలోని టోర్‌బంగ్ ప్రాంతంలో ర్యాలీ నిర్వహించేందుకు ఆల్ ట్రైబల్ స్టూడెంట్ యూనియన్ మణిపూర్ (ATSUM) పిలుపునిచ్చింది. ఈ మేరకు బుధవారం నిర్వహించిన ‘గిరిజన సంఘీభావ యాత్ర’లో వేలాది మంది ఆందోళనకారులు పాల్గొన్నారు. కుకీ వర్గం గిరిజనులు, గిరిజన హోదా డిమాండ్‌ చేస్తున్న మెయితీల నడుమ భేదాభిప్రాయలు తలెత్తాయి.ఈ నేపథ్యంలో గిరిజనులు, గిరిజనేతరుల మధ్య ఘర్షణలు చెలరేగి హింసాత్మక రూపం దాల్చాయి. దీంతో పరిస్థితిని అదుపు చేసేందుకు పోలీసులు పలు రౌండ్లు బాష్ప వాయువును ప్రయోగించారు.

ఇవి కూడా చదవండి

గిరిజనేతర ప్రాబల్యం ఉన్న ఇంఫాల్ వెస్ట్, కక్చింగ్, తౌబాల్, జిరిబామ్, బిష్ణుపూర్ జిల్లాలతోపాటు గిరిజనులు అధికంగా ఉండే చురచంద్‌పూర్, కాంగ్‌పోక్పి, తెంగ్నౌపాల్ జిల్లాల్లో మణిపూర్‌ ప్రభుత్వం కర్ఫ్యూ విధించింది. ఆ రాష్ట్రవ్యాప్తంగా ఐదు రోజుల పాటు ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. మణిపూర్‌లో చెలరేగిన హింసాకాండను నియంత్రించేందుకు ప్రభుత్వ చొరవచూపాలని భారత దిగ్గజ బాక్సర్‌ ఎంసీ మేరీకోమ్ సోషల్‌ మీడియా వేదికగా గురువారం కేంద్రాన్ని అభ్యర్ధించారు. ‘నా రాష్ట్రం తగలబడిపోతుంది.. దయతో సహాయం చేయండి’ అంటూ ప్రధాని నరేంద్ర మోడీ, హోం మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌లను ట్యాగ్ చేస్తూ గురువారం తెల్లవారు ఝామున ట్వీట్‌ చేశారు. అక్కడి పరిస్థితి తెలుపుతూ ఫొటోలను సైతం పోస్ట్ చేశారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.