Crocodile: చేపల వేటకు వెళ్లి అదృశ్యం.. మొసలి కడుపులో మృతదేహం ప్రత్యక్షం

స్నేహితులతో కలిసి చేపల వేటకు వెళ్లి కనబడకుండా పోయిన వ్యక్తి మృతదేహం మొసలి కడుపులో ప్రత్యక్షమైంది. ఈ షాకింగ్‌ ఘటన ఆస్ట్రేలియాలోని క్వీన్స్‌లాండ్‌లో బుధవారం (మే 3) చోటుచేసుకుంది. వివరాల్లోకెళ్తే..

Crocodile: చేపల వేటకు వెళ్లి అదృశ్యం.. మొసలి కడుపులో మృతదేహం ప్రత్యక్షం
Human Remains Were Found Inside Reptiles
Follow us

|

Updated on: May 04, 2023 | 8:24 AM

స్నేహితులతో కలిసి చేపల వేటకు వెళ్లి కనబడకుండా పోయిన వ్యక్తి మృతదేహం మొసలి కడుపులో ప్రత్యక్షమైంది. ఈ షాకింగ్‌ ఘటన ఆస్ట్రేలియాలోని క్వీన్స్‌లాండ్‌లో బుధవారం (మే 3) చోటుచేసుకుంది. వివరాల్లోకెళ్తే..

ఆస్ట్రేలియాలోని క్వీన్స్‌లాండ్‌కు చెందిన కెవిన్ డార్మోడీ (65) అనే వ్యక్తి హోటల్‌ మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. స్నేహితులతో కలిసి కెన్నెడీ నదీ తీరంలో చేపల వేటకు వెళ్లి అదృశ్యమయ్యాడు. ప్రసిద్ధ ఉప్పునీటి మొసళ్ల ఆవాసం అయిన ఆ ప్రాంతంలో అతను కన్పించకపోవడానికి ముందు అరపులు విన్పించినట్లు స్నేహితులు తెలిపారు. చివరిసారిగా కెన్నెడీస్ బెండ్‌లో కెవిన్ కనిపించినట్లు అధికారులకు తెలిపారు. దీంతో అధికారులు అతని కోసం రెండు రోజులపాటు గాలింపు చర్యలు చేపట్టగా ఎలాంటి ఆనవాళ్లు దొరక్కపోవడంతో రెస్క్యూ ఆపరేషన్ నిలిపివేశారు.

కెవిన్ అదృశ్యమైన ప్రాంతానికి 1.5 కిలోమీటర్ల దూరంలో రెండు భారీ మొసళ్లను అధికారులు సోమవారం గుర్తించారు. ఈ రెండు మొసళ్లలో ఒకటి 4.1 మీటర్లు, మరొకటి 2.8 మీటర్ల పొడవు ఉన్నాయి. ఇవేమైనా అతన్ని తిన్నాయా అనే అనుమానంతో అధికారులు తనిఖీ చేయగా.. ఓ మొసలి కడుపులో మానవ అవశేషాలు లభ్యమయ్యాయి. ఐతే అది కెవిన్ మృతదేహమా.. కాదా.. అనే విషయం స్పష్టంగా తెలియరాలేదు. దీంతో మృతదేహాన్ని అధికారికంగా ధృవీకరించే ప్రక్రియ మొదలుపెట్టారు. ఈ దాడిలో రెండు మొసళ్లు పాల్గొని ఉంటాయని వన్యప్రాణి అధికారులు భావిస్తున్నారు. కాగా ఆస్ట్రేలియా ఉష్ణమండల ఉత్తర ప్రాంతంలో మొసళ్ళు సర్వసాధారణం. కానీ అవి మనుషులపై దాడులకు పాల్పడటం మాత్రం చాలా అరుదు.1985 నుంచి 13 మంది మొసళ్ల దాడుల్లో మృతి చెందినట్లు జాలర్లు తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.