Stray Dogs: మరో దారుణం.. వీధి కుక్కల దాడిలో 12 ఏళ్ల బాలుడు బలి

కుక్కల దాడిలో ఇటీవల హైదరాబాద్ లో బాలుడి ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటన మరువక ముందే ఉత్తరప్రదేశ్‌లో మరో విషాదం చోటు చేసుకుంది. వీధి కుక్కల దాడిలో 12 ఏళ్ల బాలుడు మృతి చెందాడు. ఈ సంఘటన మంగళవారం నాడు జరిగింది. వివరాల్లోకెళ్తే..

Stray Dogs: మరో దారుణం.. వీధి కుక్కల దాడిలో 12 ఏళ్ల బాలుడు బలి
Stray Dogs
Follow us
Srilakshmi C

|

Updated on: May 03, 2023 | 11:40 AM

కుక్కల దాడిలో ఇటీవల హైదరాబాద్ లో బాలుడి ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటన మరువక ముందే ఉత్తరప్రదేశ్‌లో మరో విషాదం చోటు చేసుకుంది. వీధి కుక్కల దాడిలో 12 ఏళ్ల బాలుడు మృతి చెందాడు. ఈ సంఘటన మంగళవారం నాడు జరిగింది. వివరాల్లోకెళ్తే..

ఉత్తరప్రదేశ్‌లోని బరేలీలోని ఖానా గౌన్తియా గ్రామంలో అయాన్‌ (12) అనే బాలుడు స్నేహితులతో ఆడుకుంటుండగా వీధి కుక్కలు మూకుమ్మడిగా దాడి చేశాయి. భయభ్రాంతులకు గురైన బాలుడు రోడ్డుపై పరుగులు తీశాడు. ఈ క్రమంలో కింద పడిన బాలుడిపై కుక్కలు విచ్చలవిడిగా దాడికి తెగబడ్డాయి. గమనించిన స్థానికులు బాలుడిని రక్షించి, హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ బాలుడు మృతి చెందాడు. ఈ ఘటనలో మరో బాలుడు గాయపడ్డాడు.

బరేలీలో పిల్లలపై వీధి కుక్కలు దాడి చేయడం ఇదే మొదటి సారి కాదు. రెండు నెలల క్రితం వీధి కుక్కల దాడిలో ఓ బాలిక మృతి చెందింది. ఇంటి ముందు ఆడుకుంటున్న బాలికపై కుక్కలు దాడి చేసి150 మీటర్ల దూరం ఈడ్చుకెళ్లి చంపేశాయి. గతేడాది డిసెంబర్‌లో కూడా ఇదే విధమైన సంఘటన జరిగింది. ఇంటి సమీపంలో ఆడుకుంటున్న 12 ఏళ్ల బాలుడిపై 8 కుక్కలు దాడి చేసిచేశాయి. తీవ్రంగా గాయపడిన బాలుడిని స్థానికులు రక్షించి ఆసుపత్రికి తరలించడంతో ప్రాణాపాయం తప్పింది.

ఇవి కూడా చదవండి

కాగా తరచూ ఇలాంటి ఘటనలు జరుగుతున్నా అధికార యంత్రాంగం తూతూ మంత్రంగా చర్యలు తీసుకుని, కొన్నాళ్ల కు మర్చిపోతున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.