AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కుమార్తె పెళ్లిని సంతోషంగా చూశారు.. ఆ తర్వాత బంధువులతో కలిసి ఇంటికి వస్తూ.. పాపం..

వారంతా తమ బంధువుల కుమార్తె పెళ్లికి హాజరయ్యారు. పెళ్లి సందడి అనంతరం వ్యాన్‌లో ఇంటికి బయలుదేరారు.. ఈ క్రమంలో వ్యాన్ అదుపుతప్పి రోడ్డు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ఐదుగురు అక్కడికక్కడే దుర్మరణం చెందగా.. 11 మందికి తీవ్రగాయాలయ్యాయి.

కుమార్తె పెళ్లిని సంతోషంగా చూశారు.. ఆ తర్వాత బంధువులతో కలిసి ఇంటికి వస్తూ.. పాపం..
Wedding
Shaik Madar Saheb
|

Updated on: May 03, 2023 | 9:45 AM

Share

వారంతా తమ బంధువుల కుమార్తె పెళ్లికి హాజరయ్యారు. పెళ్లి సందడి అనంతరం వ్యాన్‌లో ఇంటికి బయలుదేరారు.. ఈ క్రమంలో వ్యాన్ అదుపుతప్పి రోడ్డు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ఐదుగురు అక్కడికక్కడే దుర్మరణం చెందగా.. 11 మందికి తీవ్రగాయాలయ్యాయి. వారిలో కొంతమంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ దుర్ఘటన ఝార్ఖండ్​రాష్ట్రంలోని గుమ్లా జిల్లాలోని డుమ్రీ బ్లాక్‌లో మంగళవారం చోటుచేసుకుంది. స్థానికుల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. డుమ్రీలోని కటారీ చెందిన వధువుకి.. సారంగ్‌డిహ్‌లోని వరుడితో వివాహం జరిగింది. సారంగ్‌డిహ్‌లో జరిగిన ఈ వివాహానికి హాజరైన వధువు తల్లిదండ్రులు, ఆమె బంధువులు.. పెళ్లి తర్వాత స్వగ్రామమైన కటారీకి వ్యాన్ లో తిరిగి వస్తున్నారు. ఇంతలో, అతను జర్దా గ్రామ సమీపంలో పికప్ వ్యాన్ అదుపుతప్పి పల్టీలు కొడుతూ బోల్తా పడింది. ఈ ఘటన జరిగిన సమయంలో వ్యాన్ లో 45 నుంచి 55 మంది ఉన్నారు. వ్యాన్ పల్టీలు కొట్టడంతో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందగా, 11 మంది తీవ్రంగా గాయపడ్డారు. 11 మంది పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. క్షతగాత్రులందరినీ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం చైన్‌పూర్‌కు తీసుకువచ్చామని, అక్కడి నుండి వారందరినీ పెద్దాసుపత్రికి రిఫర్ చేసినట్లు చెప్పారు.

మృతుల్లో వధువు తల్లి లుందారీ దేవి (45), తండ్రి సుందర్ గయార్ (50), పులికర్ కుండో (50) సవితా దేవి మరొకరు ఉన్నారు. చాలామంది చిన్నారులకు గాయాలయ్యాయని పోలీసులు తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం..

Follow Us
సూపర్ డూపర్ టాక్ తో దూసుకుపోతున్న ధురంధర్
సూపర్ డూపర్ టాక్ తో దూసుకుపోతున్న ధురంధర్
కాలేజీలో తోటి విద్యార్ధిని గన్‌తో కాల్చి చంపిన మరో విద్యార్ధి!
కాలేజీలో తోటి విద్యార్ధిని గన్‌తో కాల్చి చంపిన మరో విద్యార్ధి!
ఆ రెండు సీన్లు యాడ్ చేసి ఉంటే సినిమా బ్లాక్ బస్టర్ అయ్యేది..
ఆ రెండు సీన్లు యాడ్ చేసి ఉంటే సినిమా బ్లాక్ బస్టర్ అయ్యేది..
ఐపీఎల్ 2026 కోసం ఆర్సీబీ ప్లేయర్లకు విరాట్ వార్నింగ్
ఐపీఎల్ 2026 కోసం ఆర్సీబీ ప్లేయర్లకు విరాట్ వార్నింగ్
ప్రియుడి మోజులో భర్తను కాల్చి బూడిద చేసిన భార్య..!
ప్రియుడి మోజులో భర్తను కాల్చి బూడిద చేసిన భార్య..!
గత 15 ఏళ్లలో ఇదే భారీ తగ్గింపు.. రికార్డ్‌ స్థాయిలో తగ్గనున్నాయ్
గత 15 ఏళ్లలో ఇదే భారీ తగ్గింపు.. రికార్డ్‌ స్థాయిలో తగ్గనున్నాయ్
ఈ నాలుగు ఇంట్లో ఉంటే డాక్టర్ తో పనిలేదు.. అన్ని సమస్యలు చెక్
ఈ నాలుగు ఇంట్లో ఉంటే డాక్టర్ తో పనిలేదు.. అన్ని సమస్యలు చెక్
డాక్టర్ బాబు దొంగ తెలివితేటలు.. ఎగ్జాంలో కాపీకి ఏం చేశాడో చూడండి!
డాక్టర్ బాబు దొంగ తెలివితేటలు.. ఎగ్జాంలో కాపీకి ఏం చేశాడో చూడండి!
దేవాన్ష్ బర్త్‌డే వేళ భక్తులకు అల్పాహారం వడ్డించిన నారా కుటుంబం..
దేవాన్ష్ బర్త్‌డే వేళ భక్తులకు అల్పాహారం వడ్డించిన నారా కుటుంబం..
ఐఆర్‌సీటీసీ అరుణాచల మోక్ష యాత్ర ప్యాకేజీ.. ఆధ్యాత్మిక కేంద్రాల..
ఐఆర్‌సీటీసీ అరుణాచల మోక్ష యాత్ర ప్యాకేజీ.. ఆధ్యాత్మిక కేంద్రాల..