Premchand Aggarwal: నడి రోడ్డుపై యువకుడిని చితకబాదిన మంత్రి.. వైరల్ అవుతోన్న వీడియో
ఉత్తరాఖండ్ ఆర్థిక మంత్రి ప్రేమ్‌చంద్ అగర్వాల్ పట్టపగలు నడి రోడ్డుపై ఓ యువకుడిని చితకబాదారు. మంత్రితోపాటు అతని అనుచరులు కూడా విచక్షణారహితంగా దాడి చేశారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవడంతో..
ఉత్తరాఖండ్ ఆర్థిక మంత్రి ప్రేమ్‌చంద్ అగర్వాల్ పట్టపగలు నడి రోడ్డుపై ఓ యువకుడిని చితకబాదారు. మంత్రితోపాటు అతని అనుచరులు కూడా విచక్షణారహితంగా దాడి చేశారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవడంతో ప్రతిపక్ష కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ అసలేం జరిగిందంటే..
రిషికేశ్ నగరంలో మంత్రి ప్రేమ్‌చంద్ అగర్వాల్ మంగళవారం నాడు రోడ్డుపై తన కారులో వెళ్తున్నారు. ట్రాఫిక్ కారణంగా రద్దీ ఎక్కువగా ఉండటంతో అటుగా వెళ్తున్న సురేంద్రసింగ్ నెగీ అనే యువకుడు తన బైక్‌తో మంత్రి కారును ఢీకొట్టాడు. దీంతో మంత్రికి, యువకుడికి మధ్య వాగ్వాదం జరిగింది. కోపోధ్రిక్తుడైన మంత్రి ప్రేమ్‌చంద్ లాగిపెట్టి నెగీ చెంపపై కొట్టారు. అనంతరం మంత్రి గన్‌మెన్‌తోపాటు మంత్రి అనుచరులు కూడా యువకుడిపై దాడికి పాల్పడటం వీడియోలో చూడొచ్చు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవడంతో కాంగ్రెస్ పార్టీ నేతలు బీజేపీ మంత్రి దౌర్జన్యంపై తీవ్ర అగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘ఇది సిగ్గుచేటు. సామాన్యుల పట్ల బీజేపీ మంత్రులు, ఎమ్మెల్యేల వైఖరికిది అద్దం పడుతుంది. ఇంత చిన్న విషయానికి మంత్రి, ఆయన గన్‌మెన్ దాడికి తెగబడ్డారంటూ’ కాంగ్రెస్ అధికార ప్రతినిధి గరిమా దాసౌని అన్నారు.
Uttarakhand Cabinet Minister Premchand Agarwal fighting with youth in Rishikesh, then later his bodyguards also beat up the youth! pic.twitter.com/GxvNzuLk1O
— Yash (@Yashfacts28) May 2, 2023
ఈ ఘటనపై మంత్రి ప్రేమ్‌చంద్ అగర్వాల్ స్పందిస్తూ.. సురేంద్ర సింగ్ నేగి అనే వ్యక్తి నాపై దాడి చేసి, అసభ్యపదజాలంతో దుర్భాషలాడు. నా కుర్తాను చింపివేశాడు. జేబులో ఉన్న నా డబ్బు, విలువైన వస్తువులు కూడా మాయమయ్యాయి. అందుకే నా గన్‌మెన్ చర్య తీసుకోవలసి వచ్చింది’ అని మీడియా సమావేశంలో వివరణ ఇచ్చారు. ఈ ఘటనలో నేగీని విచారణ నిమిత్తం పోలీసులు అదుపులోకి తీసుకుని, కొత్వాలి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఐతే కొద్ది సేపటకాంగ్రెస్, బీజేపీ నేతలు పెద్దసంఖ్యలో అక్కడకు చేరుకుని పరస్పరం నినాదాలు చేసుకున్నారు. బాధ్యతాయుత పదవిలో ఉన్న మంత్రి ఇలాగేనా ప్రవర్తించేదంటూ కాంగ్రెస్ మండిపడింది. మంత్రి వెంటనే రాజీనామా చేయాలని లేదా సీఎం ఆయన్ని పదవి నుంచి వెంటనే తొలగించాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.