Kedarnath Snowfall: కేదార్‌నాథ్‌లో భారీగా మంచు వర్షం.. చిక్కుకుపోయిన యాత్రికులు.. ఊపిరాడక ఇబ్బందులు
కేదార్‌నాథ్‌లో భారీగా మంచు వర్షం కురుస్తోంది. దీంతో చార్‌ధామ్ యాత్రకు వెళ్లిన భక్తులు అష్టకష్టాలు పడుతున్నారు. ఉత్తరాఖండ్‌లోని కేదార్‌నాథ్‌లో ఎడతెగని హిమపాతంతో భక్తులు అడుగుతీసి అడుగు వేయలేని పరిస్థితి నెలకొంది.
కేదార్‌నాథ్‌లో భారీగా మంచు వర్షం కురుస్తోంది. దీంతో చార్‌ధామ్ యాత్రకు వెళ్లిన భక్తులు అష్టకష్టాలు పడుతున్నారు. ఉత్తరాఖండ్‌లోని కేదార్‌నాథ్‌లో ఎడతెగని హిమపాతంతో భక్తులు అడుగుతీసి అడుగు వేయలేని పరిస్థితి నెలకొంది. ఎక్కువమంది వయస్సు మీద పడినవారే కావడంతో కొందరికి ఊపరి అందక ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే ప్రతికూల వాతావరణంతో కేదార్‌నాథ్‌ను నిలిపివేశారు. అక్కడి నుంచి భక్తులు వీలైనంత తర్వగా తరలించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ యాత్రలో దాదాపు 150 మంది తెలుగువారు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, ఆలయ పరిసరాల్లో భారీగా మంచు వర్షం కురుస్తుండటంతో ఆలయ పరిసరాల్లో క్షణాల్లో వాతావరణం మారిపోతోంది. ప్రతికూల వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో కేదార్‌నాథ్ యాత్రను నిలిపివేయాలని అధికారులు నిర్ణయించారు.
కాగా, చార్‌ధామ్ యాత్ర ఏప్రిల్ 22న ప్రారంభమైంది. ముందుగా యమునోత్రి, గంగోత్రి యాత్ర ప్రారంభమైంది. సముద్ర మట్టానికి 12 వేల అడుగుల్లో కేదార్‌నాథ్ యాత్ర కొనసాగుతుంది. కేదార్‌నాథ్‌లో ప్రతికూల వాతావరణం ఉన్నా.. యాత్రికులు ఒక్కసారైనా కేదార్‌నాథుడిని దర్శించుకోవాలని వెళ్లారు. కానీ.. మంచు వర్షంతో ఆ ప్రాంతమంతా కూరుకుపోయింది. తిరిగి రాలేని పరిస్థితి నెలకొంది. దాంతో కొందరు మంచులోనే కూరుకుపోయారు. మరికొందరు అడుగుతీసి అడుగువేయలేని పరిస్థితి నెలకొంది. దీంతో అధికారులు చర్యలు చేపట్టి.. గుర్రాలపై అక్కడి నుంచి తరలిస్తున్నారు.
#WATCH | There has been heavy snowfall in Kedarnath Dham for the last 24 hours. In view of the situation, Kedarnath Yatra has been stopped today. The weather conditions in Kedarnath are not such that the pilgrims can stay here, so all the pilgrims present in Kedarnath Dham have… pic.twitter.com/Xx4nbZ3IYd
— ANI UP/Uttarakhand (@ANINewsUP) May 3, 2023
కేదార్‌నాథ్‌లో ఎడతెగని హిమపాతం కారణంగా ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు స్థానిక అధికారులు. మరోవైపు రిషికేష్‌లోని ప్రయాణికుల రిజిస్ట్రేషన్ తాత్కాలికంగా నిలిపివేశారు. వాతావరణ పరిస్థితులను బట్టి యాత్ర కొనసాగుతుందని తెలిపారు. టూరిస్టుల్లో గుండె జబ్బులు ఉన్నవారు అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. నిరంతర హిమపాతం మధ్య 12వేల అడుగుల ఎత్తులో ఆక్సిజన్ పీడనం తగ్గుతుందని తెలిపారు.
#WATCH | Snowfall continues in Kedarnath Dham.
Due to continuous snowfall for the last 24 hours, Kedarnath Yatra has been stopped today. pic.twitter.com/7JbCDn6Gkw
— ANI UP/Uttarakhand (@ANINewsUP) May 3, 2023
కాగా, మరో రెండు మూడు రోజులపాటు మంచు వర్షం కొనసాగుతుందని రుద్రప్రయాగ్ జిల్లా మెజిస్ట్రేట్ తెలిపారు. యాత్రికులు అప్రమత్తంగా ఉండాలని కోరారు.
जय बाबा भोलेनाथ जी की #केदारनाथ #kedarnathyatra #Kedarnathyatra2023 pic.twitter.com/wM3z8DQnuE
— uttrakhand wi fi (@rajendrabhatt) May 3, 2023
మరిన్ని జాతీయ వార్తల కోసం..